
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.
ఇదిలా ఉండగా రీసెంట్‌గా మహేశ్ పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్‌లో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదం వాడుతానని తెలిపారు. హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లు పేర్కొన్నారు.
ఒకవేళ తాను డైరెక్టర్ అయితే 'ఒక్కడు' మూవీని రీక్రియేట్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment