cover page photo
-
ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్ (Vogue) కవర్ పేజీపై మెరిసిన నటి (ఫోటోలు)
-
వోగ్ మ్యాగజీన్ కవర్ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్ మామూలుగా లేదుగా!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పిరామిల్ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ అండ్ బ్యూటీ మేగజీన్ వోగ్ కవర్‌పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్‌గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారు. మేగజీన్ కవర్‌పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌ను వోగ్ ఇండియా ఇన్‌స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ డియోర్ గోల్డెన్ ఫ్రాక్‌లో ఇషా అంబానీ లుక్ అదిరిపోయింది. మ్యాచింగ్ రెడ్ అండ్ పింక్ గులీబాలు అమరి, చేతిలో బోకే, యాష్-టోన్ గ్లోవ్స్, కొత్త హెయిర్ స్టయిల్హైలైట్గా నిలిచాయి. ఈ ఫోటో షూట్లో రెండో లుక్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించారామె. ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ఉంగరాల జుట్టు కంట్రోల్లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు. సో... మనం ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్‌గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్ తన కర్లీ హెయిర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు.కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా రిలయన్స్ రీటైల్ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో గంటలో ఆర్డర్ డెలివరీ చేసేలా కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
ప్లేబాయ్ కవర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. పొలిటికల్ ప్రకంపనలు!
ఫ్రాన్స్ మహిళా మంత్రి కవర్ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఈ సందర్భంగా మర్లీన్.. ప్లేబాయ్ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అని అన్నారు. మహిళల హక్కులను డిఫెండ్ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇక, మర్లీన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls — Jeanne Baron (@jeannebarontv) April 2, 2023 -
అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏమైనా చేయగలను : సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నా స్కిన్‌టోన్‌తో నేను కంఫర్టబుల్‌గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది..కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు. కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది' అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. కాగా హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద సినిమాకు విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పుతిన్‌పై టైమ్ మ్యాగజైన్ సంచలనం! ఇదీ అసలు కథ
Fact Check On Putin Face With Hitler On Time Cover: ఉరుము ఉరిమి మంగలం (మట్టిపాత్ర) మీద పడ్డట్లు.. నాటో చేరిక అభ్యంతరాలను చూపుతూ ఉక్రెయిన్‌పై రష్యా తన ప్రతాపం చూపిస్తోంది. అందుకే ఉక్రెయిన్ దీనస్థితిని చూసి జనాలంతా జాలిపడుతున్నారు. శక్తివంతమైన తమ బలగాలను ఉక్రెయిన్ అడ్డుకుంటుండడంతో.. ఆ కోపం పౌరులపై చూపిస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఈ మారణహోమానికి కారకుడైన పుతిన్‌ను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో తిట్టిపోస్తోంది. టైమ్ మ్యాగజైన్ సైతం తన లేటెస్ట్ ఎడిషన్ ‘రి రిటర్న్ ఆఫ్ హిస్టరీ.. హౌ పుతిన్ షట్టర్డ్ యూరోప్స్ డ్రీమ్స్’ పేరిట కవర్ స్టోరీని పబ్లిష్ చేసింది. దానిపై పుతిన్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫేస్‌తో కలగలిసిన కవర్ చిత్రం ఉండడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కళ్లతో పాటు, హిట్లర్ మీసాలు సైతం పుతిన్‌కు అన్వయింపజేసి ఆ కవర్ చిత్రాలను ప్రచురించినట్లు కనిపిస్తోంది. అయితే.. టైమ్ మ్యాగజైన్ ఇలా రెండు ఫొటోలతో కవర్ పేజీలను ప్రచురించిన దాఖలాలు లేవ్!. అందుకే క్రాస్ చెక్ కోసం ఫ్యాక్ట్ చెక్ ప్రయత్నించగా.. ఆ ఫొటోలు ఫేక్ అని తేలింది. ఒరిజినల్ టైం అదే టైటిల్‌తో కవర్ స్టోరీని మార్చి 14-21 ఎడిషన్ కోసం తీసుకొచ్చింది. దానిపై ఫొటో జర్మనీ యుద్ధ ట్యాంకర్ ఫొటోను పబ్లిష్ చేసింది. TIME’s new cover: How Putin shattered Europe’s dreams https://t.co/jXsRFKrW8B pic.twitter.com/hDJs0ptJs0 — TIME (@TIME) February 25, 2022 అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు మాత్రం ఫిబ్రవరి 28-మార్చి 7వ తేదీల పేరిట వైరల్ అవుతున్నాయి. My TIME artwork has gone viral - so I thought it would be appropriate for me to write a little about it. The image is one out of a sequence of three I created on the day Russia invaded Ukraine. I felt the official cover by TIME was uninspired and lacked conviction. pic.twitter.com/m5P5rorqgt — Patrick Mulder 🏴 (@MrPatrickMulder) February 28, 2022 గ్రాఫిక్ డిజైనర్ ప్యాట్రిక్ మల్డర్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సందర్భంగా ఈ ఇమేజ్‌లను క్రియేట్ చేశాడట. తద్వారా జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది ఇలా మరోలా జనాల్లోకి వెళ్లింది. How I made the cover. pic.twitter.com/LFZVOAhNMo — Patrick Mulder 🏴 (@MrPatrickMulder) February 26, 2022 -
11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ
TIME Cover Ft. Zuckerberg: మార్క్ జుకమ్‌బర్గ్ ఈ పేరు అందరికీ సుపరిచతమైనదే. ఫేస్‌బుక్‌తో సోషల్‌మీడియా ప్రస్థానానికి నాంది పలికాడు మార్క్. ఫేస్‌బుక్‌ను స్థాపించడంలో జుకమ్బర్డ్ కీలకపాత్రను పోషించాడు. ఫేస్బుక్ స్థాపనతో అంచెలచెలుగా జుకమ్‌బర్గ్ ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో చేరాడు. ఫేస్బుక్ ఒక్కటే కాకుండా...వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా శాసించే రేంజ్‌కు జుకమ్‌బర్గ్ వెళ్లాడు. ఫేస్‌బుక్‌పై భారీ ఎత్తున ఆరోపణలు...! గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్‌బుక్‌పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మార్క్ జుకమ్బర్గ్పై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. పర్సన్ ఆఫ్ ది ఇయర్ నుంచి...డిలీట్ వరకు...! తాజాగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకమ్ బర్గ్ ఫోటోను ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ టైమ్స్ మ్యాగజీన్ కవర్ మీద ప్రచురించింది. ఇప్పుడు ఈ ఫోటోపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టైమ్స్ మ్యాగజీన్ జుకమ్‌బర్గ్ ఫోటోపై...‘డిలీట్ ఫేస్బుక్..క్యాన్సల్...డిలీట్... ’అంటూ మ్యాగజీన్ కవర్‌ను రూపోందించింది. ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెస్ హాగెన్ ఫేస్‌బుక్‌పై బయటపెట్టిన రహస్య పత్రాలను ఉద్దేశించి టైమ్స్ మ్యాగజీన్ జుకమ్‌బర్గ్ కవర్ఫోటోను ప్రచురించింది. ఇక్కడ విషయమేమిటంటే ఇదే టైమ్స్ మ్యాగజీన్ 2010లో పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా మార్క్ జుకమ్‌బర్గ్ ఫోటోను కవర్‌పేజీపై ప్రచురించింది. ఆ సమయంలో మార్క్ ఏవిధంగా ఎదిగాడనే అంశాలను టైమ్స్ తన మ్యాగజీన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాడని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: Jeff Bezos and Elon Musk: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు' -
బిహార్ బుక్లెట్పై పాకిస్తాన్ బాలిక
పట్నా: బిహార్‌లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్లెట్ కవర్‌పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది. పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్లెట్లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు. -
నిన్నటి వరకు గొప్ప కవి.. నేడు వేశ్యనా?
తిరువనంతపురం : సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కవర్ పేజీపై 27 ఏళ్ల మోడల్ గిలుజోసెఫ్ ఒక బిడ్డకు స్తన్యమిస్తున్న ఫొటోను ప్రచురించారు. అయితే ఈ మ్యాగజైన్‌పై సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాగజైన్‌తో చనుబాలపై మరోసారి చర్చ మొదలైందని కొందరు ప్రశంసిస్తుండగా.. పెళ్లి కాని మోడల్‌ను ఫోటో కవర్ పేజీపై వినియోగించడం ఏమిటని మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మ్యాగజైన్‌పై వివాదం చెలరేగి కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది. ఇక నటి గిలుజోసెఫ్పై పరుష పదజాలంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం ఏంటని మండిపడ్డారు. పెళ్లి కాని నటివి ఇటువంటి ఫొటో షూట్లు చేయవచ్చా అని నిలదీసారు. ఇదంతా పబ్లిక్ స్టంట్‌లో భాగమేనని విరుచుకుపడ్డారు. ఈ విమర్శలపై నటి గిలు జోసెఫ్ ఓ జాతీయ చానెల్‌తో ఘాటుగా స్పందించారు. ‘ఆ ఫొటో షూట్‌కు ఒక్క పైసా కూడా తీసుకోలేదని అలాంటప్పుడు అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుంది. పత్రికలు, టీవీల్లో వచ్చే గ్రాఫిక్ ఫొటోలను చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టంతోనే గృహలక్ష్మీ చేపట్టిన చనుబాల ఆవశ్యకత ప్రచారంలో భాగస్వామినయ్యాను. తల్లులు వారి బిడ్డలకు దైర్యంగా పాలివ్వాలనే లక్ష్యంతో ఈ ప్రచారం మొదలెట్టాం. అంతే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా కొనియాడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారు’ అని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కవర్ పేజ్‌పై బన్నీ స్టైలిష్ లుక్
స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఉన్న ఇమేజ్ సంగతి తెలిసిందే. ఇప్పటికే తన స్టైల్స్‌లో యూత్‌ను కట్టిపడేస్తున్న బన్నీ ఓ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై కనిపించి అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. మ్యాక్సిమ్ స్టీడ్ ఫిబ్రవరి ఎడిషన్ కవర్ పేజ్‌పై డీసెంట్ లుక్‌లో దర్శనమిచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం చేయించుకున్న డిఫరెంట్ హెయిర్ కట్ తో ఉన్న బన్నీ అదే మేకోవర్‌లో కవర్ పేజ్ పై కనిపించాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు శరత్ కుమార్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. MAXIM STEED . FEB 2018. Thank You ! pic.twitter.com/zWHkUVHIHv — Allu Arjun (@alluarjun) 8 February 2018 -
ఎఫ్హెచ్ఎం కవర్ పేజీపై నేహాశర్మ హాట్ పోజు
బాలీవుడ్లో కాస్త గౌరవప్రదంగా నటిస్తుంది అని చెప్పుకోదగ్గ వాళ్లలో నేహా శర్మ ఒకరు. అయితే.. ఇప్పుడు ఆమె కూడా హాట్ హాట్ ఫొటో పోజులు ఇస్తూ వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా ఎఫ్హెచ్ఎం మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం నేహా శర్మ నల్లటి దుస్తుల్లో హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ పత్రిక కవర్‌పేజీపై నేహా శర్మ సెక్సీఫొటో దర్శనమిచ్చింది. దాంతో ఇక నేహాశర్మకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని, మంచి మంచి పాత్రలు వస్తాయని అంటున్నారు. నేహా మొట్టమొదటే ఇమ్రాన్ హష్మితో కలిసి క్రూక్ అనే సినిమాలో చేసింది. ఆ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఆ తర్వాత బాలాజీ టెలిఫిలింస్ బ్యానర్లో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమా చేసినా, దాంతోనూ పెద్దగా లాభం రాలేదు. ఆ తర్వాత చేసిన యంగిస్థాన్ సినిమాతో మాత్రం ఆమె కాస్తంత వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఎఫ్హెచ్ఎం లాంటి మ్యాగజైన్ కవర్ పేజి మీద రావడంతో సినిమాల్లో సైతం అలా కనిపించడానికి అభ్యంతరం లేదన్న సందేశాన్ని నేహ ఇచ్చిందనే అందరూ అంటున్నారు.