కవర్ పేజ్‌పై బన్నీ స్టైలిష్‌ లుక్‌ | Allu Arjun Stylish look on Maxim steed Cover page | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 8 2018 1:26 PM | Last Updated on Thu, Feb 8 2018 2:04 PM

Allu Arjun On maxim Steed Cover Page - Sakshi

మ్యాక్సిమ్‌ స్టీడ్‌ కవర్‌ పేజ్‌పై అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఉన్న ఇమేజ్‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే తన స్టైల్స్‌లో యూత్‌ను కట్టిపడేస్తున్న బన్నీ ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌పై కనిపించి అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. మ్యాక్సిమ్‌ స్టీడ్‌ ఫిబ్రవరి ఎడిషన్ కవర్‌ పేజ్‌పై డీసెంట్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం చేయించుకున్న డిఫరెంట్‌ హెయిర్‌ కట్‌ తో ఉన్న బన్నీ అదే మేకోవర్‌లో కవర్‌ పేజ్‌ పై కనిపించాడు.

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలాఖరున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా యాక్షన్ కింగ్‌ అర్జున్‌, తమిళ నటుడు శరత్‌ కుమార్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement