Rashmika Mandanna Reaction To Allu Arjun Stylish Look With Cigar Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna-Allu Arjun: పుష్పను గుర్తుపట్టని రష్మిక మందన్నా.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Tue, Aug 9 2022 6:19 PM | Last Updated on Tue, Aug 9 2022 7:37 PM

Rashmika Mandanna Reaction To Allu Arjun Stylish Look Goes Viral - Sakshi

Rashmika Mandanna Reaction To Allu Arjun Stylish Look Goes Viral: నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇటీవల విడుదలైన 'సీతారామం' చిత్రంలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంటుంది. చిట్టి పొట్టి డ్రెస్‌లు వేస్తూ యూత్‌ను అట్రాక్ట్‌ చేసే రష్మికపై ట్రోలింగ్‌లు కూడా జరిగాయి. అయితే తాజాగా మరోసారి రష్మిక చేసిన ఓ కామెంట్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఆడేసుకుంటున్నారు. 

ఇటీవల ఓ యాడ్‌ కోసం తన లుక్‌ స్టైల్‌ మొత్తంగా అల్లు అర్జున్‌ మార్చేసిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌ కోసం బన్నీ నెరిసిన జుట్టు, గడ్డం, నోట్లో సిగార్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ లుక్‌ సోషల్ మీడియాను షేక్ కూడా చేసింది. అయితే తాజాగా బన్నీ లుక్‌పై రష్మిక కామెంట్ చేసింది. అల్లు అర్జున్ స్టైలిష్‌ ఫొటో పోస్ట్‌ను ట్యాగ్‌ చేస్తూ 'మై గాడ్‌, ఒక్క క్షణం మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను సార్‌' అని రీట్వీట్‌ చేసింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌ నేషనల్ క్రష్‌పై మండిపడుతున్నారు. 

'ఎంత బాలీవుడ్‌ ఆఫర్లు వస్తే మాత్రం టాలీవుడ్‌ హీరోలు నీకు కనిపించడం లేదా?', 'నీతో నటించిన హీరోను కూడా గుర్తుపట్టలేవా? ఇది మరీ ఓవరాక్షన్‌', 'ఇప్పుడు నీకు తెలుగు హీరోల కంటే హిందీ హీరోల ముఖాలే గుర్తుంటాయా?', 'నేషనల్‌ క్రష్‌ అయితే మాత్రం మా ఐకాన్‌ స్టార్‌ను గుర్తుపట్టరా?', 'బన్నీనే గుర్తుపట్టకపోవడం దారుణం. ఇది కాస్త ఓవర్‌గా లేదు' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన 'పుష్ప' ఎంత పెద్ద హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement