లగడపాటి శ్రీధర్‌శిరీషా, శ్రీధర్
‘‘రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోతాను. ఈ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఇలాంటి కథను అల్లు అర్జున్‌గారు ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్. ట్రైలర్, పోస్టర్‌లతో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్‌గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళ, తమిళ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్.
అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శిరీషా శ్రీధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హిట్ మూవీ అనుకునే చేశా. నా కన్నా ముందు ఆడియన్స్ చూడాలనుకున్నా. అభిమానులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్‌బిలీవబుల్. ఈ కలియుగంలో దశాబ్దానికో మంచి కథ వస్తుంది. ఈ కథ అలాంటిదే.
ఇల్లు శుభ్రం చేసినా, స్నానం చే సినా ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సినిమా చూసినప్పుడు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్‌గారి యాక్టింగ్‌కు తిరుగులేదు. ఈ సినిమా ఓ పేజీ కాదు మంచి పుస్తకం. మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు వక్కంతం వంశీ. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘బాహుబలి’ వేసిన పాత్‌లో మేమూ నడుస్తున్నాం. సోమవారం నుంచి సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు.
‘‘పర్ఫెక్ట్ మూవీ అందించినందుకు గర్వంగా ఉంది. వర్క్ అంటే కమిట్‌మెంట్ ఉన్న సూపర్ స్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేశభక్తి సబ్జెక్ట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెబితే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారని నిరూపించింది ఈ సినిమా. ఓ స్టార్ హీరో రోల్ గురించి, ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా కథను నమ్మినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. వంశీ యూనిక్ పాయింట్‌తో వచ్చారు. యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత శిరీషా.
Comments
Please login to add a commentAdd a comment