
అల్లు అర్జున్–అనూ ఇమ్మాన్యుయేల్–పోసాని కృష్ణమురళి ముగ్గురి మధ్య ఓ ఇంపార్టెంట్ విషయం జరుగుతోంది. ముగ్గురూ ఊటీలో ఉన్నారు. ఎందుకంటే, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఊటీలో నైట్ షూట్ చేస్తున్నారు. బన్నీ–అను–పోసాని పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి బన్నీ అభిమానులు వెళుతున్నారు. జనరల్‌గా షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువమందిని చూడనివ్వరు... సినిమాకి సంబంధించిన కీలకమైన సమాచారం ఏదైనా బయటికొస్తుందేమోనని. కానీ, బన్నీ మాత్రం ఫ్యాన్స్‌ని షూటింగ్ చూడనిచ్చారు. అది మాత్రమే కాదు.. వాళ్లకు లొకేషన్లో లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ వీళ్లంతా తెలుగు ఫ్యాన్స్ కాదు. ఫ్రమ్ తమిళనాడు, కేరళ. బన్నీకి అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు మరి.
Comments
Please login to add a commentAdd a comment