దేశం మనకేమిచ్చిందన్నది కాదు. పౌరులుగా దేశం కోసం మనమేం చేశామన్నదే ముఖ్యం. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో కూడిన వ్యక్తిత్వం ఉన్నవాడే సూర్య. దేశం కోసం నేను సైతం అంటూ సూర్య ఏం చేశాడన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకం పై శిరీష శ్రీధర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్ పాత్ర పేరు సూర్య. ప్రస్తుతం గోవాలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ రేపటితో కంప్లీట్ అవుతుందని సమాచారం. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో పాటు, ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
‘‘ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ స్పెషల్‌గా ఉంటుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా చూసిన తర్వాత వాళ్ల పేరులో ముందుగానీ, వెనకగానీ ఇండియా అని యాడ్ చేసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత ఎమోషనల్ స్టోరీ. వాస్తవానికి సినిమా షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశాం. కానీ, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే షూటింగ్ ఆలస్యం అవుతుందని గోవాలో జరుపుతున్నాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. శరత్‌కుమార్, అర్జున్, అనూప్‌సింగ్ ఠాకూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment