anu immanuyel
-
"ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్ రిలీజ్ అప్పుడే
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 10న ఈ సినిమా నుంచి దీంతననా అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. -
అల్లుడు అదుర్స్
‘అల్లుడు శీను’తో కెరీర్ ప్రారంభించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఎనిమిదో సినిమా టైటిల్‌ను ‘అల్లుడు అదుర్స్’గా ఖరారు చేశారు. నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కందిరీగ’, ‘రభస’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, సాయి శ్రీనివాస్ లుక్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘వేసవిలో ప్రేక్షకులను అలరించే ఆహ్లాదకరమైన సినిమా ఇది’’ అని చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా
‘‘రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోతాను. ఈ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఇలాంటి కథను అల్లు అర్జున్‌గారు ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్. ట్రైలర్, పోస్టర్లతో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్‌గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళ, తమిళ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శిరీషా శ్రీధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హిట్ మూవీ అనుకునే చేశా. నా కన్నా ముందు ఆడియన్స్ చూడాలనుకున్నా. అభిమానులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్బిలీవబుల్. ఈ కలియుగంలో దశాబ్దానికో మంచి కథ వస్తుంది. ఈ కథ అలాంటిదే. ఇల్లు శుభ్రం చేసినా, స్నానం చే సినా ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సినిమా చూసినప్పుడు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్‌గారి యాక్టింగ్‌కు తిరుగులేదు. ఈ సినిమా ఓ పేజీ కాదు మంచి పుస్తకం. మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు వక్కంతం వంశీ. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘బాహుబలి’ వేసిన పాత్లో మేమూ నడుస్తున్నాం. సోమవారం నుంచి సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మూవీ అందించినందుకు గర్వంగా ఉంది. వర్క్ అంటే కమిట్మెంట్ ఉన్న సూపర్ స్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేశభక్తి సబ్జెక్ట్‌ను ఎంటర్టైనింగ్గా చెబితే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారని నిరూపించింది ఈ సినిమా. ఓ స్టార్ హీరో రోల్ గురించి, ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా కథను నమ్మినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. వంశీ యూనిక్ పాయింట్‌తో వచ్చారు. యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత శిరీషా. -
పేరులో ఇండియా
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. పౌరులుగా దేశం కోసం మనమేం చేశామన్నదే ముఖ్యం. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో కూడిన వ్యక్తిత్వం ఉన్నవాడే సూర్య. దేశం కోసం నేను సైతం అంటూ సూర్య ఏం చేశాడన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకం పై శిరీష శ్రీధర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్ పాత్ర పేరు సూర్య. ప్రస్తుతం గోవాలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ రేపటితో కంప్లీట్ అవుతుందని సమాచారం. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో పాటు, ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ స్పెషల్‌గా ఉంటుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా చూసిన తర్వాత వాళ్ల పేరులో ముందుగానీ, వెనకగానీ ఇండియా అని యాడ్ చేసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత ఎమోషనల్ స్టోరీ. వాస్తవానికి సినిమా షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశాం. కానీ, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే షూటింగ్ ఆలస్యం అవుతుందని గోవాలో జరుపుతున్నాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. శరత్‌కుమార్, అర్జున్, అనూప్‌సింగ్ ఠాకూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఫ్రమ్ తమిళనాడు... కేరళ!
అల్లు అర్జున్–అనూ ఇమ్మాన్యుయేల్–పోసాని కృష్ణమురళి ముగ్గురి మధ్య ఓ ఇంపార్టెంట్ విషయం జరుగుతోంది. ముగ్గురూ ఊటీలో ఉన్నారు. ఎందుకంటే, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఊటీలో నైట్ షూట్ చేస్తున్నారు. బన్నీ–అను–పోసాని పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి బన్నీ అభిమానులు వెళుతున్నారు. జనరల్‌గా షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువమందిని చూడనివ్వరు... సినిమాకి సంబంధించిన కీలకమైన సమాచారం ఏదైనా బయటికొస్తుందేమోనని. కానీ, బన్నీ మాత్రం ఫ్యాన్స్‌ని షూటింగ్ చూడనిచ్చారు. అది మాత్రమే కాదు.. వాళ్లకు లొకేషన్లో లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ వీళ్లంతా తెలుగు ఫ్యాన్స్ కాదు. ఫ్రమ్ తమిళనాడు, కేరళ. బన్నీకి అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు మరి. -
చిద్విలాసం
రాజమహేంద్రవరంలో ‘మజ్ను’ సినిమా బృందం సందడి చేసింది. ఆ సినిమా హీరో నాని, హీరోయిన్ అను ఇమ్మానుయేల్‌లు సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా హాళ్లకు వెళ్లి ప్రేక్షకుల కనువిందు చేశారు. సినిమాను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.