lagadapati sridhar & sirisha
-
పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా
‘‘రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోతాను. ఈ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఇలాంటి కథను అల్లు అర్జున్‌గారు ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్. ట్రైలర్, పోస్టర్లతో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్‌గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళ, తమిళ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శిరీషా శ్రీధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హిట్ మూవీ అనుకునే చేశా. నా కన్నా ముందు ఆడియన్స్ చూడాలనుకున్నా. అభిమానులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్బిలీవబుల్. ఈ కలియుగంలో దశాబ్దానికో మంచి కథ వస్తుంది. ఈ కథ అలాంటిదే. ఇల్లు శుభ్రం చేసినా, స్నానం చే సినా ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సినిమా చూసినప్పుడు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్‌గారి యాక్టింగ్‌కు తిరుగులేదు. ఈ సినిమా ఓ పేజీ కాదు మంచి పుస్తకం. మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు వక్కంతం వంశీ. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘బాహుబలి’ వేసిన పాత్లో మేమూ నడుస్తున్నాం. సోమవారం నుంచి సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మూవీ అందించినందుకు గర్వంగా ఉంది. వర్క్ అంటే కమిట్మెంట్ ఉన్న సూపర్ స్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేశభక్తి సబ్జెక్ట్‌ను ఎంటర్టైనింగ్గా చెబితే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారని నిరూపించింది ఈ సినిమా. ఓ స్టార్ హీరో రోల్ గురించి, ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా కథను నమ్మినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. వంశీ యూనిక్ పాయింట్‌తో వచ్చారు. యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత శిరీషా. -
స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్
మాస్‌కి కావాల్సిన వీరత్వం... క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన భిన్నత్వం... రెండూ సూర్యలో ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారాయన. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘సికిందర్’ చిత్రంతో మరోమారు భిన్నంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు సూర్య. లగడపాటి శిరీషా-శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆగస్ట్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సూర్య స్టయిలిష్ డాన్‌గా ఇందులో కనిపించనున్నారు. గొప్ప కథాంశంతో లింగుస్వామి చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలకు స్పందన బాగుంది. అందం, అభినయం కలబోతగా ఇందులో సమంత పాత్ర ఉంటుంది. పదేళ్లు పూర్తి చేసుకున్న మా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థకు ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. -
అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను : నాగార్జున
‘‘సూర్యను తెలుగు ప్రేక్షకులు మన హీరోలాగానే భావించి ఆదరిస్తున్నారు. తనకు తమిళనాడులో కన్నా ఇక్కడే ఎక్కువ క్రేజ్ ఉందని సూర్య ఇప్పుడే నాతో చెప్పాడు. సూర్య ప్రతి సినిమాకీ పడే కష్టం మామూలుది కాదు’’ అని నాగార్జున అన్నారు. సూర్య - సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ‘సికిందర్’ చిత్రం పాటల వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నాగార్జున ఆవిష్కరించి రాజమౌళికి ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘నేనొకసారి సూర్యకు ఫోన్ చేసి చిన్న సహాయం అడిగాను. హెచ్.ఐ.వి. గురించి ప్రచారం చేయమని అడిగితే వెంటనే జ్యోతికతో కలిసి ప్రచారం చేయడానికొచ్చారు. అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’’ అని తెలిపారు. సూర్య మాట్లాడుతూ ‘‘చాలారోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. రాజమౌళి గారు ఒప్పుకుంటే బాహుబలిలో చిన్నవేషమైనా వేస్తాను’’ అన్నారు. ఈ వేడుకలో సమంత, లింగుస్వామి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.