స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్ | Surya movie Sikandar to be released on 15th August | Sakshi
Sakshi News home page

స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్

Published Sun, Aug 10 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్

స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్

మాస్‌కి కావాల్సిన వీరత్వం... క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన భిన్నత్వం... రెండూ సూర్యలో ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారాయన. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘సికిందర్’ చిత్రంతో మరోమారు భిన్నంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు సూర్య. లగడపాటి శిరీషా-శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఆగస్ట్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ  సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సూర్య స్టయిలిష్ డాన్‌గా ఇందులో కనిపించనున్నారు. గొప్ప కథాంశంతో లింగుస్వామి చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలకు స్పందన బాగుంది. అందం, అభినయం కలబోతగా ఇందులో సమంత పాత్ర ఉంటుంది. పదేళ్లు పూర్తి చేసుకున్న మా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థకు ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement