‘‘సిల్వర్ స్క్రీన్స్ పై కొత్త ప్రపంచాలను, సరికొత్త నేపథ్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆ తరహా సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుంతోంది. ఈ అంశాలే నన్ను ‘కంగువ’ సినిమా చేసేలా ప్రేరేపించాయి. ‘కంగవ’ పూర్తిగా కల్పిత కథ. ప్రతి ఒక్కరి లోపల ఓ యుద్ధం ఉంటుంది. అలాగే బయట పరిస్థితులతోనూ యుద్ధం చేస్తుంటారు. ఈ రెండు యుద్ధాలను బ్యాలెన్స్ చేసిన ఓ యుద్ధవీరుడి కథే ‘కంగువ’’ అని దర్శకుడు శివ అన్నారు.
సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం ‘కంగవ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ–‘‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం నాటి పాత్ర కంగువ. ప్రస్తుత పాత్ర ఫ్రాన్సిస్. నాన్స్ –లీనియర్ స్క్రీన్స్ ప్లేతో ఈ కథ రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్ లో జరుగుతుంది.
ఈ రెండు టైమ్‌లైన్స్, క్రియేటివ్ స్పేస్, కమర్షియల్ అంశాలు.. ఇవన్నీ ‘కంగువ’లో పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేయడం ఓ దర్శకుడిగా నాకు కిక్ ఇచ్చింది. ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద సినిమా చేయగలిగాను. ‘యానిమల్’ సినిమాకి ముందే బాబీడియోల్‌గారు మా చిత్రంలో భాగమయ్యారు. ఓ షాడో కాప్‌గా దిశాపటానీ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా దగ్గర కొన్ని కథలున్నాయి. అవకాశం వస్తే తెలుగు హీరోలతో చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment