వోగ్‌ మ్యాగజీన్‌ కవర్‌ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్‌ మామూలుగా లేదుగా! | Isha Ambani on Vogue cover a floral beauty for latest photos | Sakshi
Sakshi News home page

వోగ్‌ మ్యాగజీన్‌ కవర్‌ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్‌ మామూలుగా లేదుగా!

Published Fri, Jun 28 2024 5:28 PM | Last Updated on Fri, Jun 28 2024 6:07 PM

Isha Ambani on Vogue cover a floral beauty for latest photos

రిలయన్స్‌ అధినేత  ముఖేష్‌ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్  డైరెక్టర్‌ ఇషా అంబానీ పిరామిల్‌ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ మేగజీన్‌ వోగ్‌ కవర్‌పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్‌గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను చాటుకున్నారు.  మేగజీన్‌  కవర్‌పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌ను  వోగ్‌ ఇండియా ఇన్‌స్టాలో  ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

 ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్  డియోర్  గోల్డెన్  ఫ్రాక్‌లో ఇషా అంబానీ లుక్‌ అదిరిపోయింది. మ్యాచింగ్‌ రెడ్‌ అండ్‌ పింక్‌  గులీబాలు అమరి,  చేతిలో  బోకే,  యాష్-టోన్ గ్లోవ్స్‌, కొత్త హెయిర్‌ స్టయిల్‌హైలైట్‌గా నిలిచాయి. ఈ ఫోటో షూట్‌లో రెండో లుక్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించారామె.  

 ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇ‍ష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్‌ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ‌ ఉంగరాల జుట్టు కంట్రోల్‌లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ  చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు.  సో... మనం ఎలా  ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్‌గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్‌  తన కర్లీ హెయిర్‌ కష్టాలను గుర్తు చేసుకున్నారు.

కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్‌గాలా ఫ్యాషన్‌ ఈవెంట్‌లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ రీటైల్‌ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా  రిలయన్స్‌ రీటైల్‌ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో  గంటలో ఆర్డర్‌ డెలివరీ చేసేలా  కొత్త  పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement