Vogue Magazine
-
వోగ్ మ్యాగజీన్ కవర్ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్ మామూలుగా లేదుగా!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పిరామిల్ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ అండ్ బ్యూటీ మేగజీన్ వోగ్ కవర్‌పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్‌గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారు. మేగజీన్ కవర్‌పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌ను వోగ్ ఇండియా ఇన్‌స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ డియోర్ గోల్డెన్ ఫ్రాక్‌లో ఇషా అంబానీ లుక్ అదిరిపోయింది. మ్యాచింగ్ రెడ్ అండ్ పింక్ గులీబాలు అమరి, చేతిలో బోకే, యాష్-టోన్ గ్లోవ్స్, కొత్త హెయిర్ స్టయిల్హైలైట్గా నిలిచాయి. ఈ ఫోటో షూట్లో రెండో లుక్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించారామె. ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ఉంగరాల జుట్టు కంట్రోల్లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు. సో... మనం ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్‌గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్ తన కర్లీ హెయిర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు.కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా రిలయన్స్ రీటైల్ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో గంటలో ఆర్డర్ డెలివరీ చేసేలా కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
Volodymyr Zelensky: ఒక పోజు.. వంద విమర్శలు
కీవ్: ప్రఖ్యాత వోగ్ మేగజీన్ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. యుద్ధ పరిస్థితులకు దర్పణం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ ఒలేనా మరికొన్ని ఫొటోలు దిగారు. అయితే, రష్యాతో యుద్ధంతో దేశం రావణకాష్టంగా రగిలిపోతుంటే తాపీగా సతీమణితో మేగజైన్లకు పోజులిస్తున్నాడని జెలెన్స్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. జెలెన్స్కీ దంపతుల చర్యను సమర్థిస్తూ కూడా చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. ప్రత్యేక డిజిటల్ కవర్ స్టోరీ కోసం జెలెన్స్కా, ఆమె భర్త, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలు యుద్ధ సమయంలో వారి జీవితం గురించి చెప్పారని పేర్కొంది వోగ్ మ్యాగజైన్. వారి వివాహం, చరిత్ర, ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం చేయాలనుకుంటున్న పనులు వంటివి వివరించినట్లు పేర్కొంది. అయితే.. పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ ఫోటోలను ట్రోల్ చేశారు. ఒక యాక్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే యుద్ధం సమయంలో వారి ప్రాధాన్యత ఇలానే ఉంటుంది అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
వివాహం అవసరమా.. మలాలాపై విమర్శలు
లండన్: తమ ఆంక్షలు లెక్కచేయకుండా చదువుకుంటుందని.. 13 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు బలయ్యింది. అయినా బెదరకుండా ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తూ.. నోబెల్ బహుమతి అందుకుంది పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్. తాజాగా మరోసారి అరుదైన గౌరవం అందుకుంది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్జైన్ వోగ్ తన జూలై ఎడిషన్ కవర్ మీద మలాలా ఫోటో ప్రచురించింది. ఈ సందర్భంగా మలాలా రాజకీయాలు, సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ఈ క్రమంలో వివాహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వివాహం గురించి మలాలా చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలాలా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను పెళ్లికుమార్తెగా చూడాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది తమ సంబంధాల కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Sad to know about Malala;s thoughts.😢#MalalaOnMarriage pic.twitter.com/vLUujigsW5 — S A M R E E N 🍁 (@SamreeenSohail) June 3, 2021 మలాలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్’’.. ‘‘నువ్వు ఇలాంటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలతో యువతను పెడదోవ పట్టిస్తున్నావ్.. ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్’’.. ‘‘నీ వ్యాఖ్యాలు విచారకరం.. ఈ విషయంలో నీకు మద్దతు తెలపడం లేదు’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’ -
Sita Vasuniya: చేనేత సీతమ్మ
ఫ్యాషన్ ప్రపంచం ప్యారిస్ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్ ఉంది. ‘వోగ్ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షో కేస్ డిజైన్ అయింది! సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్ స్టైల్. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు. ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు. ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు. ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ధార్ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్ జిల్లాలోని పనల గ్రామ్ సీతది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్ చేసుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్. మండులోని రాణి రూపమతి మహల్ మ్యూజియం ఫొటో షూట్ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది! ‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ట్, బాగ్ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సలోనీ సిదానా. -
‘ఏంటా ఫొటో.. అసలేం చెప్పదలచుకున్నారు’
వాషింగ్టన్: ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రమాణాలు పాటించకుండా ప్రముఖుల ఫొటోలను వాడుతూ.. వారిని అగౌరవ పరిచేలా వ్యవహరించడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాట్ కమలా హారిస్ కవర్ ఫొటోతో వోగ్ ఫిబ్రవరి సంచికను తెస్తోంది. ‘‘ప్రజల చేత, ప్రజల కోసం, అమెరికా ఫ్యాషన్’’ అనే క్యాప్షన్‌తో కమల నిలబడి ఉన్న ఈ ఫొటోలో.. ఆమె మేని ఛాయను కాస్త తెలుపుగా మార్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వోగ్‌పై విమర్శలకు కారణమైంది. (చదవండి: ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్) కాగా అగ్రరాజ్య చరిత్రలో తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా, అందునా ఈ పదవిని అధిరోహించిన తొలి నల్లజాతీయురాలిగా కమల చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జమైకా- భారత్ మూలాలున్న ఆమె సాధించిన ఈ విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శ్వేతజాతీయేతరురాలిగా ఆమె దక్కించుకున్న ఘనతపై అభినందనల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కమల ఫొటోలో ఆమె రంగు పట్ల వోగ్ వ్యహరించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘‘రంగు మార్చడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి. అసలేం చెప్పదలచుకున్నారు’’ అని కొంతమంది ప్రశ్నిస్తుండగా.. ‘‘బహుశా ఇది ఫేక్ ఫొటో అయి ఉంటుందని, మీకు కావాలంటే మా ఫోన్లలో ఇంతకంటే మంచి ఫొటోలు ఉన్నాయి పంపిస్తాం’’ అని కామెంట్లు చేస్తున్నారు. Kamala Harris is about as light skinned as women of color come and Vogue still fvcked up her lighting. WTF is this washed out mess of a cover? pic.twitter.com/5O2q0axA0G — E. Vaughan (@HypeVaughan) January 10, 2021 -
ఎంత కాలం ‘సింగిల్’గా ఉంటావ్..
పారిస్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో పెరిగిన ప్రముఖ ఆంగ్ల నటి, మోడల్, సామాజిక కార్యకర్త ఎమ్మా వాట్సన్‌కు పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు దేశాల నుంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చినా ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్న విషయం తెల్సిందే. 30 ఏళ్ల వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎంత కాలం ‘సింగిల్’గా ఉంటావని ఆమెను ఇటీవల ‘వోగ్’ పత్రిక ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, పెళ్లి మాటను పక్కన పెట్టి ‘సింగిల్’ మాటకు ఆమె కొత్త భాష్యం చెప్పడంతోపాటు కొత్త ప్రత్యామ్నాయ పదాన్ని సూచించారు. ‘నన్ను సింగిల్ మహిళగా పిలవద్దు. నేను స్వీయ భాగస్వామిని (సెల్ఫ్ పార్టనర్డ్)’ అని వాట్సన్ సూచించారు. ఈ రోజుల్లో 25 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని యువతులను ‘సింగిల్ విమెన్’ అని పిలుస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దంలో పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోని యువతులను ‘స్పిన్స్టర్’ అని పిలిచే వారు. అంతకుముందు ‘ఓల్డ్ మెయిడ్స్’ అని, ‘వర్జిన్’ అని లేదా ‘ప్యుయెల్లా (స్పానిష్‌లో బాలిక అని అర్థం)’ అని పిలిచేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాల్లో పాతికేళ్ల లోపే మహిళలు పెళ్లి చేసుకునే వారు. అది 18వ శతాబ్దంలో పెళ్లి చేసుకునే సరాసరి సగటు వయస్సు పాతికేళ్ల నుంచి 30వ దశకంలో పడగా, ఇప్పుడది 40వ దశకంకు చేరింది. పెళ్లితో పాటు కొత్తింట్లో ప్రవేశించాలనే లక్ష్యం యువతీ యువకులు పెట్టుకోవడంతోనే మహిళల పెళ్లీడు కాస్త 40వ దశకంకు క్రమేణ చేరుకుందని ‘నార్త్ వెస్టర్న్ యూరోపియన్ మ్యారేజ్ ప్యాటర్న్’ పరిశోధనాత్మక పుస్తకం రాసిన జాన్ హజ్నాల్ తెలిపారు. దాంతో ఆయా దేశాల్లో పెళ్లి చేసుకోకున్నా కలసి సహజీవనం చేయడం మొదలయింది. దాంతో మొదట్లోనే ‘వర్జిన్’ అనే పదం కాలగర్భంలో కొట్టుకుపోయింది. ఆర్థిక కారణాల వల్ల 19వ శతాబ్దంలో యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోగా, 20–21వ శతాబ్దం సంధికాలంలో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోయే ‘సింగిల్ విమెన్’ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్న మహిళల సంఖ్య ఆశ్చర్యంగా 30 శాతానికి చేరుకుంది. పెళ్లి చేసుకోకపోతే కోతులు కొడతాయి! 17వ శతాబ్దానికి ముందు సంప్రదాయం పేరిట పెళ్ళిళ్లు ఎక్కువగా జరిగేవి. పెళ్లి చేసుకోని మహిళలను అపవిత్రులని, అంటరాని వారని అసహ్యించుకునేవారు. వాళ్లంతా నరకంలోకి వెళతారని, పెళ్లి చేసుకోనందుకు నరకంలో వారిని కోతులు కొరడాలు పట్టుకొని హింసిస్తాయనే నమ్మకాలు కూడా ఎక్కువగా ప్రచారంలో ఉండేవి. 17వ శతాబ్దంలో యూరప్‌లో శాస్త్రీయ విజ్ఞానం పెరగడం, ఆర్థిక కారణాల వల్ల మహిళలు పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో 1690–1700 సంవత్సరాల కాలంలో ఒక్కసారిగా ఇంగ్లండ్‌లో జనాభా పెరుగుదల నిష్పత్తి హఠాత్తుగా పడిపోయింది. దాంతో అప్పటి ఇంగ్లీషు పాలకులు పెళ్లి చేసుకోని వారిపై ‘మ్యారేజ్ డ్యూటీ ట్యాక్స్’ విధించారు. అమెరికాలో కూడా.... బ్రిటన్ దేశంలోలాగా కాకపోయినా అమెరికాలో యువతీ యువకుల పెళ్లీడు వయస్సు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో యువతుల పెళ్లీడు వయస్సు 28 కాగా, యువకులు పెళ్లీడు వయస్సు 30 ఏళ్లుగా ఉంది. గతంలో అక్కడ యువతుల సరాసరి పెళ్లీడు వయస్సు 20 కాగా, యువకుల వయస్సు 22గా ఉండింది. ఇంతకు పెళ్లిపై వాట్సన్ మాటేమిటీ! సమాజంలో పేరు ప్రఖ్యాతులతోపాటు ఆస్తిపాస్తులు కూడా ఉన్నందున 30 ఏళ్ల ఒడిలో కూడా ఎందుకు ఒంటరిగా ఉంటున్నారని ‘వోగ్’ పత్రిక ఎమ్మా వాట్సన్‌ను ప్రశ్నించింది. ‘నేను ఒంటరిగా ఉన్నానని ఎవర న్నారు. నేను స్వీయ భాగస్వామిని. నా మీద నేను దష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా లక్ష్యాలు, నా అవసరాలు సాధించడం నాకు ముఖ్యం. మరో వ్యక్తి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ ఆమె పెళ్లి మాటను ఆమె పక్కన పడేశారు. -
అలాంటి వాళ్లంటే నాకు నచ్చదు: ఇషా అంబానీ
ముంబై: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి, పిరమాల్ సంస్థకు వారసుడైన ఆనంద్ పిరమాల్‌కు అంగరంగ వైభవంగా వివాహమైన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ ఈ మధ్య వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చారు. తన భర్తకు ఆనంద్ పిరమాల్‌కు మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉందని, తనను బాగా నవ్విస్తారని చెప్పుకొచ్చారు. ఆహారం వృథా చేసేవారు తనకు నచ్చరని తెలిపారు. తాను సంప్రదాయ దుస్తుల్నే(కాటన్ సల్వార్ కమీజ్స్) ధరిస్తానని తెలిపారు. తాను ఎక్కువగా ఎవరితోనూ కలవలేనని, బాగా ఆలోచించి జడ్జ్ చేస్తానని చెప్పుకొచ్చారు. -
మోడల్‌గా వందేళ్ల భామ్మ
లండన్: అంగంగాలను ప్రదర్శించే అందమైన భామల ఫొటోలను కవర్ పేజీలుగా ప్రచురించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న బ్రిటన్ ఫ్యాషన్ పత్రిక ‘వోగ్’ మొట్టమొదటి సారిగా ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఫ్యాషన్ బైబిల్‌గా ప్రసిద్ధి చెందిన వోగ్ మేగజైన్ వందేళ్ల వార్శికోత్సవాన్ని పురస్కరించుకొని కవర్ పేజీ వందేళ్ల బామ్మ బో గిల్బర్ట్ ఫొటోను ఫ్యాషన్ దుస్తుల్లో ప్రచురించింది. వందేళ్ల మేగజైన్‌కు సందర్భోచితంగా ఉంటుందనే ఉద్దేశమే కాకుండా ఫ్యాషన్‌కు వయస్సుతో నిమిత్తం లేదనే విషయాన్ని నిరూపించడం కోసం కూడా ఈసారి వందేళ్ల భామ్మను మోడల్‌గా ఎంపిక చేసుకున్నామని మేగజైన్ ప్రచురణకర్తలు తెలియజేశారు. హైహీల్స్, మేకప్ లేకుండా ఎన్నడూ ఇంటి గడపదాటని బర్మింగమ్కు చెందిన గిల్బర్ట్ నల్లటి దుస్తులపై తెల్లటి ప్యాంటు, పైన గులాబీ రంగు కోటు, మెడలో లాన్విన్ నెక్లెస్, కళ్లకు వాలెంటినో గ్లాసెస్ ధరించి టీవీగా దిగిన ఫొటోను మేగజైన్ కవర్ పేజీగా వేశారు. ఎన్నో మేగజైన్లకు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఫిల్ పాయింటర్ గిల్బర్ట్ మోడలింగ్ ఫొటోలను తీశారు. వందేళ్ల భామ్మ ఫొటోను ప్రచురించిన జూన్ సంచిక ‘వోగ్’ వచ్చేవారం మార్కెట్లోకి వస్తోంది. తనకు చిన్నప్పటి నుంచి నచ్చిన దుస్తులను ధరించడమే తనకు ఇష్టమని, డీసెంట్‌గా కనిపించే దుస్తులనే ఎప్పుడూ ధరిస్తానని చెప్పారు. యాభై ఏళ్లప్పుడు ఓ మహిళ ప్యాంట్ ధరించడం చూసి తనకు ముచ్చటేసిందని, అప్పటి నుంచి ప్యాంట్లు ధరించడం కూడా తనకు ఇష్టమేనని భామ్మ గిల్బర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలనాటి హాలివుడ్ తార ఆడ్రీ హెప్బర్న్ తన ఫ్యాషన్ ఐకానిక్ అని, ఆమె ఎప్పుడు కూడా యువకులను ఆకర్షించడం కోసం దుస్తులు వేసుకోలేదని, అలాగే తాను కూడా ఎన్నడూ యువకులను ఆకర్షించడం కోసం దుస్తులను ధరించలేదని తెలిపారు. ఈ వయస్సులో ఓ మోడల్‌గా ఫొటోలకు ఫోజులివ్వడం నిజంగా తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని గిల్బర్ట్ అన్నారు. -
వోగ్ మ్యాగజైన్ పై కరీనా హల్ చల్!
వోగ్ ఇండియా మార్చి సంచికపై బాలీవుడ్ తార కరీనా కపూర్ ఖాన్ హడావిడి చేస్తోంది. వోగ్ ముఖచిత్రంపై ఎరుపు రంగు దుస్తుల్లో కరీనా పువ్వుల రాణిగా దర్శనమిచ్చింది. తుక్రల్ అండ్ తగ్రా భాగస్వామ్యంతో వెలువడిన ప్రత్యేక సంచిక కోసం ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్ లో కరీనా హాట్ హాట్ ఫోజులతో అభిమానులను ఆలరించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తో పెళ్లి తర్వాత కూడా కెరీర్ గ్రాఫ్ కు ఎలాంటి ఢోకా లేదని వోగ్ ఇండియా సంచికపై కరీనా ముఖ చిత్రంగా రావడంతో ప్రూవ్ అయింది. వోగ్ ఇండియా ముఖ చిత్రంపై ఫోటో కోసం దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనుష్క శర్మలు వేచి చూస్తున్నారు. Photo Courtesy: Vogue India