ముంబై: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి, పిరమాల్ సంస్థకు వారసుడైన ఆనంద్ పిరమాల్‌కు అంగరంగ వైభవంగా వివాహమైన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ ఈ మధ్య వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చారు.
తన భర్తకు ఆనంద్ పిరమాల్‌కు మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉందని, తనను బాగా నవ్విస్తారని చెప్పుకొచ్చారు. ఆహారం వృథా చేసేవారు తనకు నచ్చరని తెలిపారు. తాను సంప్రదాయ దుస్తుల్నే(కాటన్ సల్వార్ కమీజ్స్) ధరిస్తానని తెలిపారు. తాను ఎక్కువగా ఎవరితోనూ కలవలేనని, బాగా ఆలోచించి జడ్జ్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment