కీవ్: ప్రఖ్యాత వోగ్ మేగజీన్ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. యుద్ధ పరిస్థితులకు దర్పణం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ ఒలేనా మరికొన్ని ఫొటోలు దిగారు. అయితే, రష్యాతో యుద్ధంతో దేశం రావణకాష్టంగా రగిలిపోతుంటే తాపీగా సతీమణితో మేగజైన్‌లకు పోజులిస్తున్నాడని జెలెన్‌స్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. జెలెన్‌స్కీ దంపతుల చర్యను సమర్థిస్తూ కూడా చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు.
ప్రత్యేక డిజిటల్ కవర్ స్టోరీ కోసం జెలెన్‍స్కా, ఆమె భర్త, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలు యుద్ధ సమయంలో వారి జీవితం గురించి చెప్పారని పేర్కొంది వోగ్ మ్యాగజైన్. వారి వివాహం, చరిత్ర, ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం చేయాలనుకుంటున్న పనులు వంటివి వివరించినట్లు పేర్కొంది. అయితే.. పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ ఫోటోలను ట్రోల్ చేశారు. ఒక యాక్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే యుద్ధం సమయంలో వారి ప్రాధాన్యత ఇలానే ఉంటుంది అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
Comments
Please login to add a commentAdd a comment