ఫ్రాన్స్ మహిళా మంత్రి కవర్ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.
వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఈ సందర్భంగా మర్లీన్.. ప్లేబాయ్ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అని అన్నారు. మహిళల హక్కులను డిఫెండ్ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు.
ఇక, మర్లీన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు.
Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls
— Jeanne Baron (@jeannebarontv) April 2, 2023
Comments
Please login to add a commentAdd a comment