emanuel macron
-
ప్లేబాయ్ కవర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. పొలిటికల్ ప్రకంపనలు!
ఫ్రాన్స్ మహిళా మంత్రి కవర్ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఈ సందర్భంగా మర్లీన్.. ప్లేబాయ్ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అని అన్నారు. మహిళల హక్కులను డిఫెండ్ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇక, మర్లీన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls — Jeanne Baron (@jeannebarontv) April 2, 2023 -
మెస్సీ హీరోనే.. నువ్వేమీ తక్కువ కాదు! గర్వపడేలా చేశావు! బాధపడకు..
Kylian mbappe Beats Messi Win Award: ‘‘మెస్సీ ఈ విజయానికి నూటికి నూరుపాళ్లు అర్హుడే.. అయితే, ఎంబాపే మాత్రం ఓటమికి అర్హుడు కాదు’’... ఆదివారం నాటి ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం చూసిన సగటు అభిమాని కనీసం ఒక్కసారైనా మనసులో ఈ మాట అనుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్.. విజయం అంచుల దాకా వెళ్లే వరకు అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించిందంటే అదంతా కెప్టెన్ కైలియన్ ఎంబాపే చలవే! అప్పటి దాకా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంబాపె.. రెండో అర్ధ భాగంలో ఒక్కసారిగా విజృంభించాడు. 97 సెకన్ల వ్యవధిలో చకచకా రెండు గోల్స్ చేసి అర్జెంటీనాకు షాక్ ఇచ్చి... అభిమానుల గుండె వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు సమం(2-2) చేసిన ఫ్రాన్స్ జోరు పెరిగింది. అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ను పదే పదే అటాక్ చేసింది. హోరాహోరీ పోరు.. దీంతో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరు జట్ల స్కోరు సమంగా ఉండటంతో అదనపు సమయం కేటాయించారు. అప్పటికే గోల్‌తో మెరిసిన మెస్సీ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు.. గోల్ కొట్టి అర్జెంటీనాను ముందుకు తీసుకువెళ్లాడు. తన చిరకాల కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేశాడు. కానీ, ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఎంబాపె తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ప్రేక్షకులు ఉత్కంఠతో మునివేళ్ల మీద నిల్చునేలా చేశాడు. అదనపు సమయం ముగిసే సరికి కూడా 3-3తో అర్జెంటీనా- ఫ్రాన్స్ సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. అయితే, షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో పెనాల్టీ తీసుకున్న గొంజాలో మోంటీల్ విజయవంతంగా గోల్ కొట్టడంతో ఎంబాపె బృందం ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మెస్సీ సేన వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. అంచనాలు తలకిందులు చేసి ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్రపంచకప్ సాధించాలన్న 35 ఏళ్ల మెస్సీ ఆశయం నెరవేరగా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను మరోసారి విజేతగా నిలపాలన్న 23 ఏళ్ల ఎంబాపె కల చెదిరిపోయింది. నిజానికి ఆరంభంలోనే పట్టు సాధించిన అర్జెంటీనా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించినా.. ఆ అంచనాలు తలకిందులు చేశాడు ఎంబాపె. మెస్సీని వెనక్కినెట్టి... ఏదేమైనా తాను అనుకున్న ఫలితం రాబట్టలేకపోయినా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ మెరిసిన ఎంబాపె.. మెస్సీతో పాటు తానూ హీరోనే అనిపించుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 8 గోల్స్ చేసి మెస్సీని దాటుకుని గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఫైనల్ మ్యాచ్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ఆట తీరుతో అలరించిన ఎంబాపె ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సాకర్ అభిమానులు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) మెస్సీనే.. అయినా నువ్వేమీ తక్కువ కాదు ఎంబాపె. మెస్సీ ట్రోఫీ గెలిచి మా హృదయాలు పులకింపజేశాడు.. నువ్వు కూడా నీ పోరాటపటిమతో మా మనసులు గెలిచావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా కూర్చున్న ఎంబాపె వద్దకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘బాధపడకు మిత్రమా.. మెస్సీ ఒక్కడే కాదు నువ్వు కూడా విజేతవే!’’ అంటూ ఎంబాపెకు విషెస్ తెలియజేస్తున్నారు. చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే.. Won our hearts #mbappe 💙🐐 pic.twitter.com/I1SAhvFPvH — Eddy Kenzo (@eddykenzoficial) December 19, 2022 What. A. Player. #mbappe pic.twitter.com/gavhNfdKrB — Piers Morgan (@piersmorgan) December 18, 2022 Mbappé is next Ronaldo, Messi whoever you support now. Only a few people support you in the journey. But when you get success they all will cheer you up. #ArgentinaVsFrance #Mbappe #WorldCupFinal pic.twitter.com/hhVjk9GuNz — Navin Depan (@DepanNavin) December 19, 2022 #EmmanuelMacron @KMbappe #Mbappe Well played and Congratulations for Golden Boot. French President @EmmanuelMacron consoled Mbappe, this shows how this country and president support and love their team. pic.twitter.com/iFlvwk4BhG — Neo007 (@neo007navin) December 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫ్రెంచ్ పోరులో చిచ్చర పిడుగు!
ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి మే7న జరిగే నిర్ణాయక, తుది దశ ఎన్నికల్లో ఎన్ మార్చ్(ముందడుగు) పార్టీ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రాన్ గెలుస్తారని సర్వేలన్నీ సూచిస్తూన్నా మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాదిరిగా అంచనాలు తారుమారవుతాయేమోననే భయాలు కూడా ఫ్రెంచి ప్రజలను వెంటాడుతున్నాయి. విదేశీయులు, వలసదారులను తీవ్రంగా ద్వేషించే మితవాద పక్షం నేషనల్ ఫ్రంట్(ఎఫ్ఎన్) అభ్యర్థి మరీన్ లాపెన్ విజయం సాధిస్తారేమోననే అనుమానం పూర్తిగా పోలేదు. మొదటి దశ ఎన్నికల్లో మరీన్ 21.4 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు ఖాయమనుకుంటున్న మాక్రాన్ 23.9 శాతం ఓట్లతో మొదటి స్థానం సాధించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం తొలిదశ ఎన్నికల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన ప్రధాన అభ్యర్థులే తుది ఎన్నికల్లో పోటీ పడతారు. మరీన్ గెలిస్తే ఈయూకు గుడ్‌బై! యూరోపియన్ యూనియన్(ఈయూ)లో కొనసాగే విషయంపై తాను గెలిస్తే బ్రెగ్జిట్ తరహా జనాభిప్రాయసేకరణ(రెఫరెండం) జరిపిస్తానని మరీన్ చెబుతున్నారు. మరీన్ గత రెండు దశాబ్దాలుగా జాత్యహంకార మాటలతో శ్వేతేతర జాతులవారిని భయపెడుతున్న జీన్ లాపెన్ కూతురు. ఆమెకు ట్రంప్ పరోక్షంగా మద్దతు ఇస్తుండగా, ఆయన విధానాలను మరీన్ సమర్ధిస్తున్నారు. కిందటేడాది ఆగస్టు వరకూ పాలకపక్షం సోషలిస్ట్పార్టీలో, ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగి, రెండింటి నుంచి వైదొలిగిన 39 ఏళ్ల మాక్రాన్ ‘ఎన్ మార్చ్’ అనే లిబరల్ పార్టీ స్థాపించి అధ్యక్ష ఎన్నికల రంగంలోకి దూకారు. తనకన్నా వయసులో పాతికేళ్లు పెద్దదైన తన మాజీ టీచర్ బ్రిజెట్ను పెళ్లాడి 9 ఏళ్ల క్రితం ఆయన సంచలనం సృష్టించారు. మాక్రాన్దే గెలుపంటున్న సర్వేలు! ప్రఖ్యాత బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది ఇండిపెండెంట్’ జరిపించిన సర్వే ప్రకారం మాక్రాన్ 63.1 శాతం ఓట్లతో మరీన్(36.9 శాతం)పై భారీ విజయం సాధిస్తారని అంచనావేశారు. మరో పోలింగ్ సంస్థ హారిస్– మాక్రాన్ 64 శాతం, మరీన్ 36 శాతం ఓట్లు సాధిస్తారని తెలిపింది. తొలిదశ పోరులో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య తేడా కేవలం 2.3 శాతమేగాని ‘ఫైనల్ వార్’లో మాక్రాన్ గెలుపునకు తిరుగులేదని ఫ్రెంచ్ రాజకీయ పండితులు భావిస్తున్నారు. మే 7లోగా మాక్రాన్‌కు సంబంధించిన ‘భారీ కుంభకోణం’ ఏదైనా బయటిపడి బద్దలైతే తప్ప ఆయన సునాయాసంగా గెలుస్తారని అత్యధిక పరిశీలకులు నమ్ముతున్నారు. ‘‘మరీన్ ప్రజలను జాతి, రంగు వంటి అంశాలతో చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే గెలుపునకు అవసరమైన మెజారిటీ ప్రజల మద్దతు ఆమెకు దక్కదు’’అని ఫ్రాన్స్ రాజకీయాలను క్షుణ్నంగా గమనించే లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రెయిన్బో మరి చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలన్నీ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారని చెప్పగా, చివరికి ఎలక్టొరల్ కాలేజీ విధానం ఫలితంగా ట్రంప్ గెలిచినట్టు ఫ్రెంచ్ తుది పోరు కూడా దిగ్భ్రాంతి కలిగించే తీర్పుకు దారితీస్తుందేమోనని కొందరు భయపడుతున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)