Women Ministers
-
ప్లేబాయ్ కవర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. పొలిటికల్ ప్రకంపనలు!
ఫ్రాన్స్ మహిళా మంత్రి కవర్ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఈ సందర్భంగా మర్లీన్.. ప్లేబాయ్ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అని అన్నారు. మహిళల హక్కులను డిఫెండ్ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇక, మర్లీన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls — Jeanne Baron (@jeannebarontv) April 2, 2023 -
రక్షాబంధన్: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కేబినెట్ విస్తరణ: నిర్మలా సీతారామన్ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జంబో కేబినెట్ విస్తరణలో మహిళా మంత్రుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా సహచరులతో దిగిన ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోవైరల్గా మారింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సహా మొత్తం తొమ్మిది మందితో కలిసి దిగిన ఫోటోను ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త కేబినెట్లో మహిళలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త మహిళా మంత్రులకు అభినందనలు తెలుపుతూ బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా సహా పలువురు మహిళా దిగ్గజాలు, ఇతర ప్రముఖులు కూడా ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం. With Minister @smritiirani and the ministers who were sworn in today. From left @DarshanaJardosh @PratimaBhoumik @ShobhaBJP @bharati_mp @M_Lekhi @AnupriyaSPatel @Annapurna4BJP Grateful to National President @JPNadda for graciously joining us. pic.twitter.com/ghoW6t7sTX— Nirmala Sitharaman (@nsitharaman) July 7, 2021 దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్ లోని సూరత్ నుండి లోక్‌సభకు ఎంపికయ్యారు. బీజేపీ తరపున ఆమె మూడో సారి ఎంపీగా ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఈమె వృత్తిరీత్యా వ్యాపారవేత్త . ప్రస్తుతం వస్త్రాలు, రైల్వే సహాయమంత్రి. ప్రతిమా భౌమిక్ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్ త్రిపుర వెస్ట్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖా సహాయ మంత్రి శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన శోభ వరసగా రెండోసారి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రి. భారతి ప్రవీణ్ పవార్ (42): మహారాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన డా. భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి (54): సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త లేఖి ఎన్డీఎంసీ సభ్యురాలు కూడా న్యూఢిల్లీ నుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, సంస్కృతి మంత్రి అనుప్రియ సింగ్ పటేల్ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్(సోనేలాల్) పార్టీ అధ్యక్షురాలు.మీర్జాపూర్ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. వాణిజ్యం & పరిశ్రమల మంత్రిగా నియమితులయ్యారు. అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్‌లోని నార్త్‌ఛోతంగపూర్‌కు చెందిన అన్నపూర్ణ దేవి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జార్ఖండ్ మంత్రిగా పనిచేశారు. తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. విద్యాశాఖ సహాయ మంత్రిగా ఎంపికయ్యారు. కాగా రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తన తొలి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్ లాంటి కీలక మంత్రులకు అనూహ్యంగా ఉద్వాసన పలకడం చర్చకు దారి తీసింది. ఒక దశలో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు ఉద్వాసన తప్పదనే వాదన కూడా వినిపించింది. కొత్త మంత్రులంతా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.నేడు (గురువారం) దాదాపు అందరూ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. -
ఆమె ఓ ఐటెం..!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ఇమార్తీ దేవిపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నవంబర్ 3వ తేదీన రాష్ట్రంలోని 28 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఇమార్తీదేవి కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కమల్‌నాథ్.. తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి కాగా, ప్రత్యర్థి (బీజేపీకి చెందిన ఇమార్తీ దేవి) ‘ఐటెం’ అంటూ తూలనాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. దళిత మంత్రిని కించపరిచేలా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కమల్ వ్యాఖ్యలకు నిరసనగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సిందియా తదితరులు సోమవారం రెండు గంటల మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌పై చర్య తీసుకోవాలని సీఎం చౌహాన్.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. దళిత మహిళల హక్కుల కోసం తరచూ గళమెత్తుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కమల్‌నాథ్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు. హరిజన మహిళను గౌరవించడం తెలియని కమల్‌నాథ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఇమార్తీ దేవి కాంగ్రెస్ పార్టీని కోరారు. సీఎం పదవి కోల్పోయాక కమల్ మతి తప్పిందని ఇమార్తీ అన్నారు. కమల్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. ఆయనకు నోటీసులు జారీ చేయడంతోపాటు తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. సమగ్ర నివేదిక కోరిన ఈసీ ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. ‘ఈ అంశంపై మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇప్పటికే నివేదిక అందజేశారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. మంగళవారం అందే నివేదికను బట్టి ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం పరిశీలిస్తాం’అని తెలిపింది. -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎమ్మెల్యేలు
-
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్లో వైఎస్ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. సీఎం సమక్షంలో కేక్ కట్ చేసిన బాలినేని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సచివాలయంలోని సీఎం చాంబర్లో జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
మంత్రివర్గంలో ఆమె లేకుంటే ఎలా?
మోదీ కొత్త కేబినెట్లో 10 శాతానికి పైగా మహిళా మంత్రులు ఉన్నప్పటికీ... అదా విషయం! ఆరుని మూడుకు తగ్గించడం గురించి కదా.. మరో సుష్మను కేబినెట్ హోదాలోకి తీసుకోకపోవటం గురించి కదా.. ఇప్పుడు మాట్లాడుకోవలసింది! మాధవ్ శింగరాజు రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మహిళల్లో సుష్మా స్వరాజ్ లేరు! మంత్రివర్గంలో ఆమె లేకపోవడం ఏంటని కాదు ఆశ్చర్యం. ఆమె లేకుండా ఎలా అని! ‘మిస్ యూ సుష్మాజీ’ అని పార్టీలతో నిమిత్తం లేకుండా దేశ నాయకులు, దేశ ప్రజలు ఆమెకు ఇప్పటికీ ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే సుష్మను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినప్పటికీ అది ఏమాత్రం సంభవించవలసిన పరిణామం కాదనే భావన ఈ దేశ ప్రజలు, పూర్వపు మంత్రి వర్గ సహచరులలోనూ ఉంది.మోదీ కొత్త ప్రభుత్వంలో శుక్రవారం నాడు విదేశాంగ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘సుష్మాజీ అడుగుజాడల్లో నడవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మంత్రిగా ఆయన పెట్టిన తొలి ట్వీట్ అది. ప్రస్తుత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్ కూడా ఉండి ఉంటే మోదీ రెండో ఆలోచన లేకుండా ఆమెకు విదేశాంగ శాఖనే ఇచ్చి ఉండేవారు. గత ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మ భారతదేశ దౌత్య సంబంధాలను చక్కబరచడం ఒక్కటే అందుకు కారణం కాదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలతో కలిసి ఎన్నారై బాధిత భార్యల కోసం ఆమె చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ ఉన్న భార్యలు చేసిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తల్ని పట్టి తేవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ‘దేశ ప్రజల ప్రియతమ మంత్రి’ అనే గుర్తింపునిచ్చా యి. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసులో 2016 నవంబరులో మధుమేహం తీవ్రం కావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రిలో సుష్మ అడ్మిట్ అయ్యారు. ఆ వివరాలను ట్వీట్ చేస్తూ.. కిడ్నీ ఫెయిల్ అవడంతో తనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని ఆమె వెల్లడించినప్పుడు అనేక మంది తమ కిడ్నీ ఇస్తామని ముందుకు వచ్చారు! ‘మేడమ్.. మీకు సమ్మతమైతే నా కిడ్నీని డొనేట్ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశానికి మీ సేవలు అత్యవసరం’ ఒక యువకుడు ట్వీట్ చేశాడు. జమ్మూలో ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల ఖేమ్రాజ్ శర్మ అయితే తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను ఆమె కాపాడారు. ఆదివారాలు కూడా ఆమె మంత్రిత్వ శాఖ కార్యాలయం తెరిచే ఉండేది. సుష్మ చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా నేను నా కిడ్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాను’’ అని శర్మ బీబీసీ ప్రతినిధితో అన్నారు. వాటన్నిటికీ ఒకే సమాధానంగా.. ‘‘ఫ్రెండ్స్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మాటలు రావడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సుష్మ ట్వీట్ చేశారు. ఆ ఏడాది డిసెంబరులో సుష్మకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగింది. మరింత ఆరోగ్యకరమైన పరిసరాల పరిశుభ్రత అనివార్యం కావడంతో తనిక పోటీ చేయబోవడం లేదని ఎన్నికలకు కొన్ని నెలల ముందే సుష్మ ప్రకటించారు. సర్జరీ తర్వాత కూడా రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన సుష్మ.. విదేశాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, సహాయం కోసం చేతులు చాచిన ఎందరినో ఒక తల్లిలా జన్మభూమి ఒడిలోకి తీసుకున్నారు. సుష్మ ఇంతగా తన ప్రభావాన్ని చూపించబట్టే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మహిళలకు దక్కని సముచిత స్థానం గురించి కాకుండా, మంత్రివర్గంలో సుష్మ లేకపోవడం అనే విషయమే ప్రాముఖ్యాంశం అయింది. 78 మంది మహిళా ఎంపీలు ఉన్న ప్రస్తుత లోక్‌సభలో మహిళలకు మోదీ ఇచ్చిన కేబినెట్ హోదాలు మూడంటే మూడు మాత్రమే! స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్. ఈ ముగ్గురూ గత లోక్‌సభలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నవారే. అప్పట్లో వీరితో పాటు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమాభారతి.. మొత్తం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ఉండేవారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సహాయ మంత్రులుగా ఉండేవారు. మొత్తం ఎనిమిది మంది. ఆరు కేబినెట్ హోదాలు. రెండు సహాయ పదవులు. అదిప్పుడు మూడు కేబినెట్ హోదాలు, మూడు సహాయ పదవులుగా కుదించుకుపోయింది. 64 మంది మహిళా ఎంపీలు ఉన్న గత లోక్‌సభతో పోలిస్తే అంతకంటే పద్నాలుగు మంది మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత లోక్‌సభలో ఉండాల్సిన మహిళా మంత్రుల సంఖ్య మరీ ఆరైతే కాదు. గత లోక్‌సభలో సుష్మతో సమానంగా మహిళా సంక్షేమం కోసం పని చేసిన మేనకా గాంధీని ప్రస్తుతానికి మోదీ పక్కన ఉంచారు. గంగాజల ప్రక్షాళన సేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఉమాభారతి తనంతట తనే తప్పుకున్నారు. సహాయమంత్రి అనుప్రియా పటేల్ మళ్లీ అదే హోదాలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. సహాయ హోదాలోకి మునుపు అదే హోదాలో ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొత్తగా రేణుకా సింగ్ సరితను, దేవశ్రీ చౌదరిని తీసుకున్నారు. పాత లోక్‌సభలో 6+2 గా ఉన్న మహిళా మంత్రులు కొత్త లోక్‌సభలో 3+3 అయ్యారు. జాతీయవాద మోదీ ప్రభుత్వానికి ‘మానవీయ’ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో లేని కారణంగా ఆమెపై పడుతున్న ఫోకస్.. మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య సగానికి సగం తగ్గడం అనే అంశాన్ని అవుట్ ఫోకస్ చేస్తోందని చెప్పడం కాదిది. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మహిళా ఎంపీలలో సుష్మాస్వరాజ్‌లు లేకుండా పోరు. లేకున్నా, బాధ్యతలు అప్పగిస్తే తయారవుతారు. 1977లో దేవీలాల్ సుష్మపై నమ్మకం ఉంచి పాతికేళ్ల వయసులో ఆ కొత్తమ్మాయికి కేబినెట్ బాధ్యతలు అప్పగించినట్లే మోదీ కూడా కొత్త మహిళా ఎంపీలలో కనీసం మరో ముగ్గురికైనా కేబినెట్ హోదాను ఇస్తే దేశ ప్రయోజనాలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు నిరూపితం కావా! 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 80 వరకు మంత్రుల్ని తీసుకోవచ్చు. కేబినెట్లో ఇప్పుడు 58 మంది ఉన్నారు. ఫస్ట్ టైమ్ మహిళా ఎంపీలలో సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రేణుకా సింగ్, దేవశ్రీ చౌదరి, కాకుండా బీజేపీలో ఫస్ట్ టైమ్‌లు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్లు కాకున్నా సీనియర్లు ఉన్నారు. వాళ్లలోంచి తీసుకోవచ్చు. తీసుకుం టారా?! ∙ -
మోదీ కేబినెట్లో ముగ్గురు మహిళలు
న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సారి మోదీ కేబినెట్లో మహిళలకు చోటు దక్కింది. నిర్మలా సీతారామన్, స్మతి ఇరానీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్, దేబశ్రీ చౌదరి కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ పదవి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
కేబినెట్లోకి ఇద్దరు మహిళలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు రుణమాఫీ చెక్కులు... కేంద్రం పీఎం–కిసాన్ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్సైట్ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్‌బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్‌లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్డేట్ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. అమెరికా అప్పులున్న దేశం కూడా! ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్ జీఎస్డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం... మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్‌లో ఐదు ఔటర్ రింగ్‌రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్‌జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్‌లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్‌ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్–జూలైలలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం. రైతు అంటే ఎవరు? ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్ దేశంలో నేచురల్ హ్యాపినెస్ అంటూ శ్రీధర్‌బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు. రెండు బిల్లులకు ఆమోదం... శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
ఒకరికి కాదు ఇద్దరికి అవకాశం.. కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గత హయాంలోని తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ విషయంలో విమర్శలు వచ్చినా.. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈసారి మొదటి విస్తరణలోనూ కేబినెట్లో మహిళకు అవకాశం దక్కలేదు. గత మంగళవారం 10మంది మంతులతో కేబినెట్‌ను కేసీఆర్ విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హయాంలోనైనా మహిళా మంత్రులు ఉంటారా? అసలు కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తుందా? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయమై ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టత నిచ్చారు. కేబినెట్లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేబినెట్లో మహిళకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరగా.. ఒక్కరికి కాదు ఇద్దరికి అవకాశం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళలు అధికంగా ఓట్లు వేయడంతోనే తాము భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చామన్నారు. -
‘మిగిలింది కలెక్టర్ గారు చదువుతారు’
భోపాల్ : ‘మిగిలినవి.. కలెక్టర్ గారు చదువుతారు. నాకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. కావాలంటే మా డాక్టర్ని అడగండి. మరేం పర్లేదు. నాకు బదులుగా కలెక్టర్ ప్రసంగాన్ని పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించిన మహిళా మంత్రి ఇమర్తీ దేవిపై నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే కార్యక్రమానికి ఎందుకు హాజరు అయ్యారు. అయినా చదవడం రాకపోతే హుందాగా తప్పుకొని ఉండాల్సింది. చిన్నపిల్లల్లా ఇలా సాకులు చెప్పడం దేనికి మేడమ్’ అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. మధ్యప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ఇమర్తీ దేవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో జెండా ఎగురవేశారు. అనంతరం ఉపన్యాసం ఇచ్చేందుకు ఉపక్రమించారు. పేపర్‌పై రాసుకున్న అక్షరాలను చదివే క్రమంలో ఆమె తడబడ్డారు. వెంటనే పక్కనే ఉన్న కలెక్టర్ భరత్ యాదవ్‌కు తన బాధ్యతను అప్పగించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక.. పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 25న మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. ఇద్దరు మహిళలు విజయలక్ష్మీ సాధూ, ఇమర్తీ దేవీలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. #WATCH Madhya Pradesh Minister Imarti Devi in Gwalior asks the Collector to read out her #RepublicDay speech pic.twitter.com/vEvy1YVjRM — ANI (@ANI) January 26, 2019 -
ఆకాశంలో సగం.. కానీ.. ఇక్కడ కాదు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సమాన అవకాశాలు.. మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇది వినేందుకు బాగున్నా.. చట్టసభల్లో మహిళలకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదనే భావన వ్యక్తమవుతోంది. ఆకాశంలో సగమంటున్నా.. రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చట్టసభలకు ఎంపికవుతున్న మహిళల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2004, 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మహిళలు లేకపోగా.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపికై జిల్లా రాజకీయ చైతన్యానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారు. 1957 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జిల్లాలో వివిధ రాజకీయ పక్షాల నుంచి మహిళలు పోటీ చేయడం.. వారిలో కొందరు విజయం సాధించి.. తమ హక్కులపై చట్టసభల్లో వాణి వినిపించి రాజకీయ చతురతను ప్రదర్శించిన ఘనత అనేక మంది ఎమ్మెల్యేలకు ఉంది. శాసనసభ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత టి.లక్ష్మీకాంతమ్మ విజయం సాధించి.. జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అప్పుడు కీలక నేతగా వ్యవహరించి.. తర్వాత మూడుసార్లు ఎంపీగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 1972లో జరిగిన సాధార ణ ఎన్నికల్లో మధిర నుంచి కాంగ్రెస్ తరఫున దుగ్గినేరి వెంకటరావమ్మ విజయం సాధించి.. మహిళల సమస్యలపై గళం విప్పిన నేతగా గుర్తింపు పొందారు. తర్వాత రెండు, మూడుసార్లు శాసనసభకు ఎన్నికలు జరిగినప్పటికీ ఒకరిద్దరు మహిళలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా విజయం సాధించలేదు. ఆ తర్వాత రేణుక.. ఇప్పటివరకు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున టి.లక్ష్మీకాంతమ్మ మూడు పర్యాయాలు విజయం సాధించగా.. అదే రాజకీయ పరంపరను కొద్దికాలం తర్వాత కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కొనసాగించారు. 1999లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేణుక అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమెపై టీడీపీ తరఫున జిల్లాలో డీఆర్డీఏలో పనిచేస్తున్న మద్దినేని బేబి స్వర్ణకుమారి పోటీ చేశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన స్వర్ణకుమారి, రేణుకాచౌదరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు ఆయాచితం నాగవాణి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి రేణుకాచౌదరి విజయం సాధించారు. 2009 ఎన్నికల నాటికి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వామపక్షాలతో సహా అన్ని రాజకీయ పక్షాలు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన బానోతు చంద్రావతి విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కుంజా సత్యవతి గెలుపొందారు. దీంతో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలు అయిన ఘనత ఉమ్మడి జిల్లాకు దక్కింది. ఇక నామినేటెడ్ పదవుల విషయానికొస్తే.. మద్దినేని బేబి స్వర్ణకుమారి రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా కొద్దికాలం పనిచేశారు. 2014లో పాలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన స్వర్ణకుమారి, ఇల్లెందు నుంచి పోటీ చేసిన బాణోతు హరిప్రియ, కాంగ్రెస్ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేసిన కుంజా సత్యవతి ఓటమి చెందగా.. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బానోతు చంద్రావతికి సీపీఐ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె టీఆర్ఎస్లో చేరి వైరా నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో నలుగురు మహిళలు పోటీ చేయగా.. ఈసారి ఆయా రాజకీయ పక్షాలు ఎంతమందికి అవకాశం కల్పి స్తాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అవకాశమివ్వని ‘గులాబీ’.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో మహిళలకు చోటు దక్కలేదు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఈసారి మహిళలు ఎక్కువగానే ఉన్నారు. ఖమ్మం నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, అశ్వారావుపేట నుంచి సున్నం నాగమణి, బానోతు పద్మావతి, పినపాక నుంచి అజ్మీరా శాంతి, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియ వంటి నేతలు ఈసారి టికెట్లు ఆశిస్తున్నారు. ఇక పాలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు మద్దినేని బేబి స్వర్ణకుమారి మరోసారి ప్రయత్నం చేస్తుండగా.. గత ఎన్నికల్లో భద్రాచలం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ ప్రభుత్వ అధికారి ఫణీశ్వరమ్మ ఈసారి ఏపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి నుంచి సీపీఎం మహిళా అభ్యర్థి గా మాచర్ల భారతిని అధికారికంగా ప్రకటించింది. ఈసారి బీజేపీ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఉప్పల శారద టికెట్ ఆశిస్తుండగా.. వైరా నుంచి బీజేపీ తరఫున సినీ నటి రేష్మా, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున కర్రెద్దుల కమలకుమారి విజ యం సాధించి, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి టీడీపీ ఎంపీగా మేరీ విజయకుమారి విజ యం సాధించారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం లభించిందన్న సంతృప్తి ఉన్నా.. ఇదే సంప్రదాయం ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగడం లేదన్న అసంతృప్తి ఆయా రాజకీయ పార్టీల్లోని మహిళా నేతల్లో కొంత నెలకొంది. స్థానిక సంస్థల్లో ఇలా.. స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికి మూడుసార్లు ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్ పదవిని మహిళలు చేపట్టారు. 1980లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా భద్రాచలంకు చెందిన వాణి రమణారావు పనిచేయగా.. 2008 జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలు పొందిన గోనెల విజయలక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వెంకటాపురం నుంచి గెలుపొందిన గడిపల్లి కవిత టీడీపీ తరఫున జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్లో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందగా.. అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున సుచరితారెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. 2007లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి సీపీఎం తరఫున బుగ్గవీటి సరళ పోటీ చేసి ఓటమి చెందారు. అలాగే 2009లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున చండ్ర అరుణ పోటీ చేయగా.. పాలేరు నుంచి ఝాన్సీ పోటీ చేశారు. 2014లో అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా న్యూడెమోక్రసీ తరఫున సంధ్య ఎన్నికల బరిలోకి దిగారు. -
అది చాలా బాధాకరం: ఎంపీ కవిత
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం బాధకరమని, ఈ విషయంలో తాను కూడా ప్రశ్నించే వారిలో ఒకరిగా ఉంటానని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో శుక్రవారం ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో జరిగిన ‘భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళల ప్రాతినిథ్యం లేదంటూ ఓ ఫిక్కీ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు కవిత ఈ విధంగా స్పందించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న రాష్ర్టంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని, దీనికితోడు అన్ని సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కలేదని చెప్పారు. అయితే ఇది కొంత బాధించదగ్గ విషయమేనన్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. ముఖ్యమైన కార్పొరేట్, రాజకీయ పదవుల్లో మహిళలు కీలకస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. భారత్‌లో మహిళల సంఖ్య అధికంగా ఉందని, అందులో 21 సంవత్సరాలలోపు ఉన్న మహిళల సంఖ్య 20 శాతం ఉందన్నారు. ఇంకా పలువురు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ సామియాఆలంఖాన్‌తోపాటు సభ్యులు పింకీరెడ్డి, పార్వతిరెడ్డి, రేఖారెడ్డి, కామిని షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు 8 మందే !
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొత్తగా ఈరోజు జరిగిన విస్తరణలో ఒక్క మహిళకే చోటు దక్కింది. యూపీకి చెందిన ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి మండలిలో సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, మేనకా గాంధీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మతీ ఇరానీ కేబినెట్ హోదా మంత్రులుగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రిగా ఉన్నారు. కేబినెట్లోని అత్యంత పెద్ద, పిన్న వయస్కులు మహిళలే కావడం విశేషం. ఎక్కువ వయసు ఉన్న మంత్రి నజ్మా హెప్తుల్లా కాగా, తక్కువ వయసు ఉన్న మంత్రి స్మతి ఇరానీ కావడం గమనార్హం. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మొత్తం 66 మంది సభ్యులు ఉండగా, 8 మంది మహిళలకు మాత్రమే స్థానం లభించింది. ** -
సబితా ఇంద్రారెడ్డి ఒక్కరే...
ఎంతలో ఎంత మార్పు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు. నోరు తెరిచి టిక్కెట్ అడిగినా అధిష్టానం ఆమెను కరుణించలేదు. తనతో పాటు పనిచేసిన మహిళా మంత్రులందరూ తిరిగి పోటీ చేస్తున్నా సబితకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. సబితతో పాటు మంత్రులుగా పనిచేసిన వి.సునీత లక్ష్మారెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె. అరుణ.. కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తున్నారు. గల్లా అరుణకుమారి మాత్రం టీడీపీ తరపున బరిలో ఉన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నుంచి వి.సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ) స్థానం నుంచి జె.గీతారెడ్డి అసెంబ్లీకి పోటీకి పడుతున్నారు. డి.కె. అరుణ మహబూబ్‌నగర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గద్వాల్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ కూడా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఈసారి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మహిళా మంత్రుల్లో ఒక్క సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఈసారి పోటీలో లేరు. కుమారుడి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తన ఉనికిని చాటు ప్రయత్నం చేస్తున్నారీ మహిళా మాజీ హోంమంత్రి.