మహిళలు 8 మందే ! | Women representation in Modi ministry goes upto 8 | Sakshi
Sakshi News home page

మహిళలు 8 మందే !

Published Mon, Nov 10 2014 3:06 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

సాధ్వి నిరంజన్ జ్యోతి - Sakshi

సాధ్వి నిరంజన్ జ్యోతి

 న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొత్తగా ఈరోజు జరిగిన విస్తరణలో ఒక్క మహిళకే చోటు దక్కింది.   యూపీకి చెందిన  ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు   సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి మండలిలో  సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, మేనకా గాంధీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, స్మతీ ఇరానీ  కేబినెట్ హోదా మంత్రులుగా ఉన్నారు.  

నిర్మలా సీతారామన్ స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రిగా ఉన్నారు.  కేబినెట్‌లోని అత్యంత పెద్ద, పిన్న వయస్కులు మహిళలే కావడం విశేషం. ఎక్కువ వయసు ఉన్న మంత్రి నజ్మా  హెప్తుల్లా కాగా, తక్కువ వయసు ఉన్న మంత్రి స్మతి ఇరానీ కావడం గమనార్హం. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మొత్తం 66 మంది సభ్యులు ఉండగా, 8 మంది మహిళలకు మాత్రమే స్థానం లభించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement