'నరేంద్ర మోదీ యుగపురుషుడు' | Modi is a 'yug purush', says Sadhvi Niranjan Jyoti | Sakshi
Sakshi News home page

'నరేంద్ర మోదీ యుగపురుషుడు'

Published Sun, Dec 14 2014 9:57 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'నరేంద్ర మోదీ యుగపురుషుడు' - Sakshi

'నరేంద్ర మోదీ యుగపురుషుడు'

గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంసలు కురిపించారు. ఆయనను 'యుగపురుషుడు' అని కీర్తించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ కు వచ్చిన ఆమె ఆదివారం గాంధీనగర్ లో విలేకరులతో మాట్లాడారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మ గాంధీ, యుగపురుషుడు... ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలను గుజరాత్ కు చెందిన వారని సాధ్వి నిరంజన్ అన్నారు.

రామమందిరం నిర్మాణం గురించి ప్రశ్నించగా... 'వారు మందిరం నిర్మిస్తారు. మేము నిర్మించబోం' అని సమాధానమిచ్చారు. దీనిపై ఇంకా మాట్లాడేందుకు నిరాకరించారు. ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఆమె చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement