
న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సారి మోదీ కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కింది. నిర్మలా సీతారామన్, స్మతి ఇరానీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్‌లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్, దేబశ్రీ చౌదరి కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ పదవి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment