ఎఫ్హెచ్ఎం కవర్ పేజీపై నేహాశర్మ హాట్ పోజు | neha sharma appears on fhm cover page | Sakshi
Sakshi News home page

ఎఫ్హెచ్ఎం కవర్ పేజీపై నేహాశర్మ హాట్ పోజు

Published Fri, Aug 8 2014 4:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఎఫ్హెచ్ఎం కవర్ పేజీపై నేహాశర్మ హాట్ పోజు

ఎఫ్హెచ్ఎం కవర్ పేజీపై నేహాశర్మ హాట్ పోజు

బాలీవుడ్లో కాస్త గౌరవప్రదంగా నటిస్తుంది అని చెప్పుకోదగ్గ వాళ్లలో నేహా శర్మ ఒకరు. అయితే.. ఇప్పుడు ఆమె కూడా హాట్ హాట్ ఫొటో పోజులు ఇస్తూ వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా ఎఫ్హెచ్ఎం మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం నేహా శర్మ నల్లటి దుస్తుల్లో హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ పత్రిక కవర్పేజీపై నేహా శర్మ సెక్సీఫొటో దర్శనమిచ్చింది.  దాంతో ఇక నేహాశర్మకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని, మంచి మంచి పాత్రలు వస్తాయని అంటున్నారు.

నేహా మొట్టమొదటే ఇమ్రాన్ హష్మితో కలిసి క్రూక్ అనే సినిమాలో చేసింది. ఆ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఆ తర్వాత బాలాజీ టెలిఫిలింస్ బ్యానర్లో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమా చేసినా, దాంతోనూ పెద్దగా లాభం రాలేదు. ఆ తర్వాత చేసిన యంగిస్థాన్ సినిమాతో మాత్రం ఆమె కాస్తంత వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఎఫ్హెచ్ఎం లాంటి మ్యాగజైన్ కవర్ పేజి మీద రావడంతో సినిమాల్లో సైతం అలా కనిపించడానికి అభ్యంతరం లేదన్న సందేశాన్ని నేహ ఇచ్చిందనే అందరూ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement