మ్యాగజైన్ కవర్‌పేజీపై గిలుజోసెఫ్
తిరువనంతపురం : సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కవర్ పేజీపై 27 ఏళ్ల మోడల్ గిలుజోసెఫ్ ఒక బిడ్డకు స్తన్యమిస్తున్న ఫొటోను ప్రచురించారు. అయితే ఈ మ్యాగజైన్‌పై సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాగజైన్‌తో చనుబాలపై మరోసారి చర్చ మొదలైందని కొందరు ప్రశంసిస్తుండగా.. పెళ్లి కాని మోడల్‌ను ఫోటో కవర్ పేజీపై వినియోగించడం ఏమిటని మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మ్యాగజైన్‌పై వివాదం చెలరేగి కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది.
ఇక నటి గిలుజోసెఫ్‌పై పరుష పదజాలంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం ఏంటని మండిపడ్డారు. పెళ్లి కాని నటివి ఇటువంటి ఫొటో షూట్‌లు చేయవచ్చా అని నిలదీసారు. ఇదంతా పబ్లిక్ స్టంట్‌లో భాగమేనని విరుచుకుపడ్డారు. ఈ విమర్శలపై నటి గిలు జోసెఫ్ ఓ జాతీయ చానెల్‌తో ఘాటుగా స్పందించారు.
‘ఆ ఫొటో షూట్‌కు ఒక్క పైసా కూడా తీసుకోలేదని అలాంటప్పుడు అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుంది. పత్రికలు, టీవీల్లో వచ్చే గ్రాఫిక్ ఫొటోలను చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టంతోనే గృహలక్ష్మీ చేపట్టిన చనుబాల ఆవశ్యకత ప్రచారంలో భాగస్వామినయ్యాను. తల్లులు వారి బిడ్డలకు దైర్యంగా పాలివ్వాలనే లక్ష్యంతో ఈ ప్రచారం మొదలెట్టాం. అంతే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా కొనియాడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారు’ అని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment