పట్నా: బిహార్‌లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్‌లెట్ కవర్‌పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్‌లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది.
పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్‌లెట్‌లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్‌లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment