booklet
-
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్ లెట్ ఆవిష్కరణ
-
మోదీ తొమ్మిదేళ్ల పాలనపై... కాంగ్రెస్ 9 ప్రశ్నలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. మోదీ తొలిసారిగా ప్రధాని పదవి స్వీకరించి శుక్రవారానికి తొమ్మిదేళ్లయ్యాయి. తప్పుడు హామీలతో జాతిని దగా చేసినందుకు ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘నౌ సాల్, నౌ సవాల్ (తొమ్మిదేళ్లు, తొమ్మిది ప్రశ్నలు)’ పేరుతో మోదీకి 9 ప్రశ్నలు సంధిస్తూ బుక్లెట్ విడుదల చేశారు. కోట్లాది మంది నిరుద్యోగ యువత నుంచి తొమ్మిదేళ్లుగా మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, విద్వేషం, నిరుద్యోగానికి మోదీయే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. మోదీకి కాంగ్రెస్ సంధించిన 9 ప్రశ్నలు... 1. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజా ఆస్తుల్ని మోదీ స్నేహితులకి ఎందుకు విక్రయిస్తున్నారు? 2. సాగు చట్టాల రద్దు ఒప్పందాలను ఎందుకు గౌరవించడం లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లేదేం? 3. మీ స్నేహితుడు అదానీ లబ్ధి కోసం ఎల్ఐసీ, ఎస్బీఐలలో ప్రజలు కష్టించి దాచి పెట్టుకున్న డబ్బుని ఎందుకు ప్రమాదంలో పడేశారు? 4. మీరు క్లీన్చిట్ ఇచ్చిన చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటోందేం? 5. ఎన్నికల ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలతో సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు ? 6. సామాజిక న్యాయ పునాదుల్ని ధ్వంసం చేస్తున్నారెందుకు? అణగారిన వర్గాలపై అరాచకాలపై మౌనమెందుకు? 7. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్య సంస్థల్ని ఎందుకు బలహీనపరుస్తున్నారు? విపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలెందుకు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ధనబలంతో ఎందుకు కూలదోస్తున్నారు? 8. పేదల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి ఎందుకు బలహీనపరుస్తున్నారు? 9. కోవిడ్‌తో 40 లక్షల మంది పై చిలుకు మరణించినా వారి కుటుంబసభ్యులకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు? -
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో.. పోలీసు కానిస్టేబుల్స్ బుక్లెట్.. ఈజీగా అర్థమయ్యేలా..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది. ఈ పోలీసు ఉద్యోగం సాధించాలంటే సరైన ప్రిపరేషన్ ఉండాలి. అలాగే పోలీసు ఉద్యోగ పరీక్షలకు పుస్తకాల ఎంపిక కూడా విజయానికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో 17 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. చదవండి: TS: రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇలాంటి కీలకమైన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో బుక్‌లెట్‌ను ప్రిపేర్ చేయించింది. పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చూస్తూ.. ఈజీగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని సాక్షి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పుస్తకం మీ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అత్యంత తక్కువ ధరకే ఈ బుక్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ కావాల్సిన వారు 18004259899 నెంబర్‌కు ఫోన్ చేసి పొందవచ్చు. సాక్షి ఏజెంట్‌ను లేదా మీ దగ్గర్లోని బుక్స్టాల్ని సంప్రదించి తీసుకొవచ్చు. -
ఇకపై ఇలాంటి పదాలు పార్లమెంట్లో నిషిద్ధం.. కాదని మాట్లాడితే..
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కుదరదు. అభ్యంతరకర పదాలు వాడితే చర్యలు తప్పవు. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలు వాడడానికి వీల్లేదు. వీటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ విడుదల చేసింది. లోక్‌సభ, రాజ్యసభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దని ఎంపీలకు సూచించింది. బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, చంచా, చంచాగిరి, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్లీడ్, లై, అన్ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార్, గిర్గిట్, గూన్స్, అప్మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, బాల్బుద్ధి వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
గాడ్సే – సావర్కర్ల సంబంధం!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ అనుబంధ ‘సేవాదళ్’ పేర్కొనడంపై బీజేపీ, శివసేన మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్ గురించి కాంగ్రెస్ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. సావర్కర్‌పై వికృతబుద్ధితో చేసిన అర్థపర్థం లేని వ్యాఖ్యలు అవని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వీర్ సావర్కర్: కిత్నే ‘వీర్’! పేరుతో సేవాదళ్ ఆ బుక్లెట్ విడుదల చేసింది. -
గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
ఆ ఆరు ప్రశ్నలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో పేపర్ బుక్లెట్ కోడ్–బిలోని ఆరు ప్రశ్నలను తొలగించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలను తొలగించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ఈ ఆరు ప్రశ్నల నిర్మాణం సక్రమంగా లేదని, అలాగే వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సక్రమంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆరు ప్రశ్నలు తొలగించాక తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించింది. తిరిగి అర్హుల జాబితా రూపొందించేటప్పుడు, ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించాలని పేర్కొంది. తాజా జాబితాలో హాల్ టికెట్ నంబర్ ఎదురుగా అభ్యర్థి మార్కులు పొందుపరచాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో 1,217 ఎస్సై పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది మే 31న నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఆగస్టు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ బుక్లెట్–బి కోడ్‌లోని ఆరు ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, దీని వల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్లగొండకు చెందిన డి.ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. అభ్యర్థులకు లబ్ధి.. పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ, 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు తప్పని, అలాగే వీటికి ఇచ్చిన సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్నంబర్ల ఎదురుగా మార్కులు పొందుపరచాల్సి ఉన్నా, అది కూడా చేయలేదని తెలిపారు. మార్కులు ప్రచురించి ఉంటే, తుది కీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఓఎంఆర్ కాపీతో పోల్చిచూసుకునే అవకాశం అభ్యర్థులకు ఉండేదని కోర్టుకు నివేదించారు. దీని వల్ల అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అభ్యర్థులు నిర్ణయించజాలరు.. ఈ వాదనలను రిక్రూట్మెంట్ బోర్డు తరఫున స్పెషల్ జీపీ ఎస్.శరత్‌కుమార్ తోసిపుచ్చారు. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదన్నారు. జేఎన్టీయూ నిపుణుల ద్వారా ప్రశ్న పత్రం రూపొందించామని తెలిపారు. ఆ ఆరు ప్రశ్నలు, సమాధానాల్లో ఎలాంటి తప్పులు, సందిగ్ధత లేదన్నారు. ఏది తప్పో, ఏది ఒప్పో అభ్యర్థులు నిర్ణయించజాలరన్నారు. హాల్ టికెట్ ఎదురుగా మార్కులు పొందుపరచడం సాధ్యం కాదని, యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీలు కూడా ఈ విధానాన్ని అనుసరించట్లేదని చెప్పారు. పారదర్శకతకు ఆస్కారం ఉంటుంది.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు అభ్యర్థులకు లేదన్న బోర్డు వాదనను తోసిపుచ్చారు. మార్కులు ప్రచురించడం ద్వారా మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందన్నారు. దీని వల్ల అభ్యర్థులకు కూడా మార్కుల విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలవుతున్న కాలంలో ప్రతీది పారదర్శకంగా ఉండాల్సిన అవసరముందని వివరించారు. ఓఎంఆర్ షీట్లను కంప్యూటర్ల ద్వారా మూల్యాంకనం చేయిస్తున్నప్పుడు, మార్కులను వెల్లడించడం కష్టసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఆరు ప్రశ్నలు ఏ రకంగా తప్పో పిటిషనర్లు స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఆ వివరణలతో ఏకీభవిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
బిహార్ బుక్లెట్పై పాకిస్తాన్ బాలిక
పట్నా: బిహార్‌లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్లెట్ కవర్‌పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది. పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్లెట్లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు. -
ముందే బుక్లెట్ లాక్కున్నారు
* ఇంటర్ విద్యార్థులు ఆవేదన * వనస్థలిపురం మాస్టర్ మైండ్ కాలేజీలో ఘటన సాక్షి, హైదరాబాద్: ‘పరీక్షకు సకాలంలో చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించం’ అనే నిబంధన బాగానే ఉంది. కానీ ఈ నిబంధన సమాధాన పత్రాలు తీసుకునే ముందు వర్తించదా? అని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలో సమయం ముగియక ముందే సమాధానాల బుక్లెట్ని ఇన్విజిలేటర్ లాక్కున్నాడు. ఈ ఘటన వనస్థలిపురంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల సెంటర్లో జరిగింది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధిత విద్యార్థులు ‘సాక్షి’ కి చెప్పారు. సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి సరిపోయింది.. ఇతర సబ్జెక్టులైతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్ఐఓ హన్మంత్‌రెడ్డిని వివరణ అడగగా.. ‘నిర్దిష్ట సమయం పూర్తికాకముందే బుక్లెట్ లాక్కోవడం క్షమించరాని విషయం. ఈ ఘటనపై విచారణ చేసిన తర్వాత ఇన్విజిలేటర్‌పై చర్యలు తీసుకుంటా’మని సమాధానమిచ్చారు. -
మార్కెట్లోకి ‘సాక్షి ఫారెస్ట్ ఆఫీసర్స్ స్పెషల్’ బుక్లెట్
వెల రూ.50 మాత్రమే సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది ఉద్యోగార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన స్పెషల్ బుక్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రొఫెసర్లు, అధ్యాపకులు రూపొందించిన ఈ పుస్తకం వెల రూ.50 మాత్రమే. ఉద్యోగాన్ని సులువుగా దక్కించుకునేందుకు అవసరమైన ప్రిపరేషన్ ప్లాన్, మార్చి, 2013 నుంచి మార్చి, 2014 వరకు తాజా కరెంట్ అఫైర్స్‌ను ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచాం. అలాగే 25 కిలోమీటర్ల నడకలో విజయం సాధించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనరల్ స్టడీస్(హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, పాలిటీ...) సమగ్ర సమాచారం, జనరల్ ఎస్సేలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అనుసరించాల్సిన మెలకువలు, నిపుణులు రూపొందించిన మోడల్ పేపర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్పెషల్ బుక్‌లెట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రముఖ పుస్తక కేంద్రాల్లోగానీ మీ సమీప సాక్షి ఏజెంట్నుగానీ సంప్రదించవచ్చు.