న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కుదరదు. అభ్యంతరకర పదాలు వాడితే చర్యలు తప్పవు. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలు వాడడానికి వీల్లేదు. వీటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్ విడుదల చేసింది. లోక్‌సభ, రాజ్యసభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దని ఎంపీలకు సూచించింది.
బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, చంచా, చంచాగిరి, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార్, గిర్గిట్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, బాల్‌బుద్ధి వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment