unparliamentary words
-
షాకింగ్.. రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయిన నటి.. ఎందుకంటే?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయింది ప్రముఖ నటి, షీ-హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడింది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని, అదృష్టం కొద్ది ప్రధాని అయ్యారని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఎందుకీ విమర్శలు..? బ్రిటన్‌లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిల్ మండపడింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది. ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక సాయం అందక నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిలియనీర్ రిషి సునాక్ వాళ్ల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, దీన్ని తాము ఎంత మాత్రమూ సహించబోమని జమీలా హెచ్చరించింది. బ్రిటన్ వలసదారులపై రిషి సునాక్ విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. బ్రిటన్ కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపొద్దని హితవు పలికింది. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
మర్యాద మంటగలుస్తోంది.. నోరు.. జారిపోతున్నాం!
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. తమ పూర్వీకులను అంతమాట అన్నా.. ‘నేను సాధారణ ప్రజల మనిషిని అని ఇన్నాళ్లుగా చెప్తునే ఉన్నాను. ఇప్పటికైనా గౌరవనీయ సభ్యుడు ఈ విషయాన్ని అంగీకరించారు’ అన్నారు నెహ్రూ నవ్వుతూ.. అది 1962.. చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది.. ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ‘అది చాలా చిన్న భాగం అక్కడ గడ్డి కూడా మొలవదు. వ్యర్థ భాగమే’.. ఆ నిరసనకు అప్పటి ప్రధాని నెహ్రూ సమాధానం. ‘మరి నా తలపై కూడా ఏమీ మొలవట్లేదు. అది కూడా వ్యర్థమేనా?’.. స్వపక్షమే అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీ మహవీర్ త్యాగి చురక .. నెహ్రూ సహా అంతా ఘొల్లుమని నవ్వారు.. ►ఇక కొద్దికాలం క్రితం రాజ్యసభలో చర్చ.. ‘విదేశాలన్నా, వారి తెల్ల తోలు అన్నా భారతీయులకు మోజెక్కువ. తెల్లని వధువే కావాలనుకుంటారు..’ అంటూ వెటకారంతో దక్షిణాది మహిళల శరీరం, వారి ఛాయపైనా రాజ్యసభలో కామెంట్లు.. నిజానికి ఇక్కడ చర్చ అంశం ‘బీమాలోకి విదేశీ పెట్టుబడులు...’. కానీ కామెంట్స్ చేసినది స్త్రీలు, వారి శరీరాలపై.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఓ బిహార్ ఎంపీ తీరు ఇది.. ఈ వ్యాఖ్యలపై మహిళా సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తన ‘మాట’ను వెనక్కి తీసుకోవడానికి ఆయన మొరాయించారు. ..ఇదీ ఇప్పటి పెద్దల సభలో మర్యాద. ►ఇక ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాల (అమర్యాద నుంచి అసభ్యందాకా అర్థం రూపాంతరం చెందింది) గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. లోక్‌సభ ‘అన్‌పార్లమెంటరీ’ పుస్తకంలో కొత్తగా ‘కోవిడ్ వ్యాప్తి కారకుడు, సిగ్గుచేటు, వంచకుడు, అవినీతి పరుడు, అసమర్థుడు, కపటబుద్ధి’లాంటివి చేర్చారు. ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన జుమ్లా అనే పదాన్ని (మన స్థానిక నేతల నోటి నుంచి తరచూ వింటున్నాం) కూడా నిషేధించారు. ►‘మేం కొత్తగా చేర్చిందేమీ లేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో వద్దనుకుని తొలగించిన పదాలనే ఇప్పుడు మేమూ అన్‌పార్లమెంటరీ పదాల్లో చేర్చాం. 1954 నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది..’అని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా చెబుతున్నారు.. అన్నీ మాట్లాడుకోవచ్చు, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డేమీ ఉండదని అంటున్నారు. అమర్యాద.. బాగా పెరిగింది..! ►1954 నుంచి చేర్చుతూ పోతూంటే అన్‌పార్లమెంటరీ పదాలు, నిబంధనలు గట్రా కలిసి ఇప్పటికి ఏకంగా 900 పేజీల పుస్తకంగా తయారైంది. ఈ కరదీపిక మన రాజకీయ ఔన్నత్యానికి సూచికలాంటిది. పదునైన మాటలు, భావాలతో కూడిన ఈ పట్టిక రాజకీయ నేతల హుందాతనానికి ప్రతీక అనుకుందాం. కొంచెం అటు ఇటుగా అసెంబ్లీలు, శాసన మండళ్లకూ ఇవి వర్తిస్తాయి. ►‘పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?’’.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న జోక్. మన నేతలు మాటలతో సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఇదీ.. ►‘పెద్ద మగాడివా.. నోర్మూస్కో.. చెయ్యి తీస్తా.. నీయవ్వ.. గాజులు వేసుకోలే.. నాలుక కోస్తా..’.. ఇవన్నీ వీధి చివర గలాటాలోనో, రచ్చబండ దగ్గర గొడవలోనో వినిపిస్తున్నవి కాదు. అచ్చంగా మనం ఓట్లేసి.. ‘మా బతుకులు మార్చండి. మీరు చర్చలు చేసుకుని, మాట్లాడుకుని మా భవిష్యత్తు తీర్చిదిద్దండి’అంటూ చట్టసభలకు పంపిన గౌరవనీయ ప్రజాప్రతినిధులే చర్చలను ఇలాంటి మాటలతో రచ్చ చేస్తున్నారు. చదవండి: అన్పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. విపక్షాల సెటైర్లు అవినీతీ.. అమర్యాదే.. సమాజంపై వీటి ప్రభావం వంటి విషయాలు వదిలేసి ‘పొలిటికల్’గా చూస్తే.. ఈ అమర్యాద, అసభ్య (అన్‌పార్లమెంటరీ) పదాల లిస్టులు ఎందుకు పెరుగుతాయి? ‘పాలక పక్షం’అవసరం కోసమే కదా! లేటెస్ట్ లిస్టు చూడండి. ‘అవినీతిపరుడు.. అసమర్థుడు.. కపట బుద్ధి.. నియంత.. సిగ్గుచేటు’ఇలాంటి పదాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ‘‘ఈ పదాలు లేకుండా విపక్షాలు ఏం మాట్లాడుతాయి? ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పనులే ఇవి కదా! వీటి గురించి మాట్లాడకుండా నోరు మూస్తే ఎలా?’’ అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ‘జై మోదీ’ తప్ప అన్నీ అన్‌పార్లమెంటరీ పదాలేనా అని విమర్శిస్తున్నాయి. ‘మీ అసమర్థతను, అవినీతిని, అబద్ధాలను ప్రజలకు చెప్పొద్దా? మేం అనొద్దా’అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇలా వేటినైతే నిషేధిస్తూ వెళుతున్నారో.. అవే పదాలు పాలక, ప్రతిపక్ష రాజకీయాలకు పర్యాయపదాలు కావడం ‘అమృతోత్సవ భారతా’నికి గొంతులో గరళమే.. మరి పాలక పక్షాలు ఇలా తమకు అనువైన పదాల ‘లిస్టు’ను నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడే జరిగిందా..? ►2012లో యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అప్పట్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తరచూ మాట్లాడే ‘అలీబాబా 40 దొంగలు, బద్మాష్, బ్లాక్మెయిల్..’వంటి పదాలను అన్ పార్లమెంటరీ లిస్టులో పెట్టింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మర్యాద పూర్వకంగా అమర్యాదకర లిస్టులు మారుతాయన్నమాట. ►మాటలు బుక్కుల్లోకి చేరుతున్నాయి.. కానీ బయటికి రాకుండా ఆగుతున్నాయా? అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది. పార్లమెంటులో మాటలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు. కానీ లోక్‌సభలో స్పీకర్, పెద్దల సభ చైర్మన్ వాటిని కంట్రోల్ చేయవచ్చు. మాటలను వెనక్కి తీసుకోవాలని సభ్యులను ఆదేశించవచ్చు. తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. రికార్డుల్లోంచి తొలగించవచ్చు. కానీ ఈ మాట చూడండి.. ►‘మీరు నిషేధించిన మాటలే వాడుతాను. కావాలంటే నన్ను సస్పెండ్ చేసుకోండి..’ అని టీఎంసీ నేత ఓబ్రియాన్ అంటున్నారు. ‘తగ్గేదేలే’అనే మన రాజకీయ వ్యవస్థకు, మనం పైన వేసుకున్న ప్రశ్నకు చక్కని సమాధానం ఇది. అయితే.. అసాధారణంగా స్వయంగా ప్రధాని మోదీ మాటలనే రాజ్యసభలో రికార్డుల నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. ►సభ్యులు మాట్లాడే మాటలను పార్లమెంట్ సిబ్బంది రాసుకుని, అందులో అభ్యంతరకరమైన మాటలను స్పీకర్‌కు ఇవ్వడం, స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించడం ఒకప్పుడయితే ఓకే.. ఇప్పుడంతా లైవ్.. రికార్డుల నుంచి తొలగించేలోపే జనంలో ఆ మాటలన్నీ రికార్డయిపోతాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఓ కుర్రాడి మాట.. ‘సభల్లో ఫైట్లే లైవ్‌లో చూస్తున్నాం.. ఇక తిట్లెందుకు కంట్రోల్ చెయ్యడం. సరదాగా ఉంటుందని కానీయండి..’అని.. చదవండి: ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్ ఇది బాగుంది ‘ఖలిస్తానీ, చెంచా, చెంచాగిరీ, పిరికివాడు, క్రిమినల్, గాడిద, అహంకారి..’సభలో ఇలాంటివి మరొక వ్యక్తిని అనకూడదు. ఎవరిని వారే అనుకుంటే తప్పులేదట.. ఓ వెసులుబాటు ఇది బాగుంటుంది అధ్యక్షా.. మీ సభల్లోనే కాదు. మా వీధుల్లో కూడా.. ‘బట్టేబాజ్, బచ్చా, సన్నాసి, బేవకూఫ్, సాలే, గూట్లే, లఫంగి’వంటి పదాలు మారుమోగుతున్నాయి. ఇవి ఆపడానికి నిబంధనలు పెట్టండి.. మరిన్ని కరదీపికలు వేయండి.. ఓ విన్నపం మాటలకు ‘కట్టడి’ఉంది! రాజ్యాంగంలోని 105 (2) ఆర్టికల్ ప్రకారం.. ‘పార్లమెంటు సభ్యులు సభల్లో మాట్లాడే అంశాలపై ఏ కోర్టులో, ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదు’.. అంటే పార్లమెంటులో సభ్యులు మాట్లాడే మాటలకు రాజ్యాంగ రక్షణ ఉంది. కానీ చట్టసభల నిర్వహణ నిబంధనలు ఆయా సభల్లో సభ్యులు ‘సరిగా’ ప్రవర్తించేలా, ‘సరిగా’ మాట్లాడేలా చూసుకునే బాధ్యతను, అధికారాన్ని లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో చైర్మన్‌కు దఖలుపర్చాయి. లోక్‌సభ నియమావళిలోని రూల్ 380, 381 ప్రకారం.. ‘సభలో జరిగే చర్చల్లో ఏవైనా మాటలు ఎవరినైనా అగౌరవపర్చేలా, అసభ్యంగా ఉంటే.. స్పీకర్ ఆ పదాలను సభ రికార్డుల నుంచి తొలగించవచ్చు’. 400 ఏళ్ల నాటి నుంచే ‘అన్ పార్లమెంటరీ’ గొడవ చట్ట, ప్రజాప్రతినిధుల సభల్లో ‘అన్ పార్లమెంటరీ’పదాల గొడవ ఈనాటిదేమీ కాదు. బ్రిటిష్ చరిత్రకారుడు పాల్ సీవార్డ్ రాసిన వివరాల ప్రకారం.. 1604వ సంవత్సరంలోనే సభ్యుల మాటలను తొలగించే ‘పని’ మొదలైంది. నాటి బ్రిటిష్ సభలో అంతకుముందు రోజు జరిగిన చర్చలో లారెన్స్ హైడ్ అనే న్యాయవాది వాడిన ‘అభ్యంతరకర’మాటలపై.. మరునాడు చర్చించి రికార్డుల నుంచి తొలగించారు. అప్పుడే ‘సభలో చర్చ జరిగే విషయాన్ని వదిలేసి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడకుండా స్పీకర్ నియంత్రించాలి’అని నిబంధననూ పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతినిధుల సభలో ‘అబద్ధాలకోరు (లైయర్), మూగ (డంబో)’పదాలను ‘అన్ పార్లమెంటరీ’గా ప్రకటించుకుంది. ‘చిన్నపిల్లల్లా వ్యవహరించడం (చైల్డిష్నెస్)’అనే పదాన్నీ నిషేధించుకుంది. న్యూజిలాండ్ చట్టసభల్లో ‘కమ్మో (కమ్యూనిస్టు అనే పదానికి షార్ట్‌కట్)’పదాన్ని అనుమతించరు. కెనడాలో అయితే మరో అడుగు ముందుకేసి.. ‘దుష్ట మేధావి (ఈవిల్ జీనియస్), కెనడియన్ ముస్సోలిని (ముస్సోలిని అనేది ఒకప్పటి ఇటలీ నియంత పేరు), జబ్బుపడ్డ జంతువు (సిక్ యానిమల్)’వంటి పదాలూ నిషేధిత జాబితాలో పెట్టుకున్నారు. ఇవేకాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల చట్టసభల్లో పాలకవర్గాలు ‘అన్ పార్లమెంటరీ’మాటలను లిస్టుల్లో పెట్టేసుకుంటూనే ఉన్నాయి. నోటికి బట్టకట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. -సరికొండ చలపతి చదవండి: సభా విలువలు కాపాడాలి -
సాక్షి కార్టూన్ 15-7-2022
మన గొంతు నొక్కారు! మాట్లాడటానికేం మిగిలింది! -
అన్పార్మమెంటరీ పద జాబితాపై కాంగ్రెస్ విమర్శలు
-
అన్‌పార్లమెంటరీ బుక్లెట్ వివాదంపై స్పీకర్ ఓంబిర్లా వివరణ
-
ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్
న్యూఢిల్లీ: రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కొన్ని పదాలను తొలగించామని, తొలగించబడిన పదాల సంకలనం మాత్రమే జారీ చేయబడిందని, అంతేగానీ ఎలాంటి పదాలను నిషేధించలేదని పేర్కొన్నారు ఆయన. గురువారం సాయంత్రం ఆయన ఈ విషయంపై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ సెక్రటేరియెట్ బుక్‌లెట్‌లో అన్‌పార్లమెంటరీ పదాలపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ‘‘ఏ పదం నిషేధించబడలేదు, 1954 నుండి కొనసాగుతున్న పద్దతి ప్రకారమే.. పార్లమెంటు కార్యకలాపాల సమయంలో తొలగించాం అని స్పష్టత ఇచ్చారు స్పీకర్. ఇంతకుముందు ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాల పుస్తకం విడుదలైంది... పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో పెట్టాం. పదాలు నిషేధించబడలేదు, తొలగించబడిన పదాల సంకలనాన్ని మేము జారీ చేశాం. వారు (ప్రతిపక్షాలు) ఈ 1,100 పేజీల నిఘంటువు (అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన) చదివారా? చదివి ఉంటే... అపోహలు వ్యాపించవు... ఇది 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో విడుదలైంది. 2010 నుంచి వార్షిక ప్రాతిపదికన విడుదల చేయడం ప్రారంభించింది. దయచేసి.. నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ ఆయన విపక్షాలను కోరారు. లోక్‌సభ సెక్రటేరియెట్ తాజాగా రిలీజ్ చేసిన పదాల జాబితాలో జుమ్లాజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ స్పెడర్, స్నూప్‌గేట్, అషేమ్డ్, ఎబ్యూజ్డ్, బెట్రేయ్డ్, కరప్ట్, డ్రామా, హిపోక్రసీ, ఇన్కాంపీటెంట్.. తదితర పదాలను అన్‌పార్లమెంటరీ జాబితాలో చేర్చారు. లోక్‌సభ, రాజ్యసభకు రెండింటిలో ఇది వర్తించనుంది. అయితే ఈ లిస్ట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు విపక్షాలు.. నిషేధం విధించారంటూ విమర్శలు గుప్పిస్తోంది కేంద్రంపైన. -
అన్పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఎంపీల నిషేధిత పదాల జాబితాపై విస్తృత స్థాయి చర్చ నడుస్తోంది ఇప్పుడు. లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన బుక్‌లెట్‌లో.. జుమ్లాజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్, అరాచకవాది, శకుని, నియంత, నియంతృతత్వం, తానాషా, తానాషాహి, వినాశ్ పురుష్, ఖలీస్థానీ.. ఇలాంటి పదాలెన్నింటినో లిస్ట్‌లో చేర్చారు. జులై 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల కోసం ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఈ పదాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. అన్‌పార్లమెంటరీగా నిర్వచనం.. అంటూ న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారో.. సరిగ్గా ఆ అంశంపై చర్చలకు, ఉపన్యాయాలకు సరిపోయే పదాలనే ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటున్నారు. వాటిని నిషేధించారు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పదాలన్నింటితో కలిపి ఒక సెంటెన్స్‌ను సైతం ఉదాహరణగా పేర్కొన్నారు. New Dictionary for New India. pic.twitter.com/SDiGWD4DfY — Rahul Gandhi (@RahulGandhi) July 14, 2022 పై లిస్ట్పదాలతో పాటు.. పార్లమెంట్ చర్చల్లో తరచూ వినిపించే సిగ్గుచేటు, మోసం, అవినీతి, వెన్నుపోటు, డ్రామా, హిప్పోక్రసీ లాంటి పదాలను సైతం అన్‌పార్లమెంటరీ లిస్ట్‌లో చేర్చారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ మాత్రం ఆ పదాలను ఉపయోగించే తీరతానని, సస్పెండ్‌చేస్తే చేసుకోండంటూ సవాల్ విసిరారు. Session begins in a few days GAG ORDER ISSUED ON MPs. Now, we will not be allowed to use these basic words while delivering a speech in #Parliament : Ashamed. Abused. Betrayed. Corrupt. Hypocrisy. Incompetent I will use all these words. Suspend me. Fighting for democracy https://t.co/ucBD0MIG16 — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) July 14, 2022 All words used by the Opposition to describe the reality of Modi Sarkar now to be considered ‘unparliamentary’. What next Vishguru? pic.twitter.com/lx7MqIVutw — Jairam Ramesh (@Jairam_Ramesh) July 14, 2022 -
ఇకపై ఇలాంటి పదాలు పార్లమెంట్లో నిషిద్ధం.. కాదని మాట్లాడితే..
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కుదరదు. అభ్యంతరకర పదాలు వాడితే చర్యలు తప్పవు. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలు వాడడానికి వీల్లేదు. వీటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ విడుదల చేసింది. లోక్‌సభ, రాజ్యసభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దని ఎంపీలకు సూచించింది. బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, చంచా, చంచాగిరి, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్లీడ్, లై, అన్ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార్, గిర్గిట్, గూన్స్, అప్మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, బాల్బుద్ధి వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
‘చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు’
న్యూఢిల్లీ: చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు లోకేష్, బోండా ఉమ, దేవినేని ఉమ, పట్టాభి వ్యాఖలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పై అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించామని తెలిపారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోని.. ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరామన్నారు. రాజ్యంగా బద్ధంగా జరిగే ఎన్నికలలో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదని మండిపడ్డారు. కాగా, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై కేసులు పెడితే తప్పేంటని ఎన్నికల సంఘం ప్రశ్నించిందని అన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నంబర్లను పంపాలని ఈసీ కోరిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి -
అసెంబ్లీలో ‘పప్పూ’ ‘దొంగ’ పదం నిషేధం
భోపాల్: వాస్తవంగా నాలుగు నెలలకోసారి చట్టసభల సమావేశాలు జరగాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయాలతో చట్టసభల ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి. ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఒక్కనాడు కూడా సక్రమంగా జరగవు. ఈ సమావేశాల్లో వాగ్వాదాలు ఏర్పడి ఒక్కోసారి తీవ్రస్థాయిలో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో పచ్చిబూతులు కూడా వస్తుంటాయి. స్పీకర్ వాటిని వినలేకపోతుంటారు. తూక్కెత్తా అంటే తూక్కెత్తా అంటూ మాటల దుమారం ఏర్పడుతుంది. ఇలా సభలో అన్‌పార్లమెంటరీ భాష వినియోగం అధికమవుతుండడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సభలో కొందరు సభ్యులు పలికిన పదాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆ విధంగా నిషేధించిన పదాల వివరాలతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో పప్పూ అనే పదం కూడా నిషేధం ఉండడం గమనార్హం. ఈ పదంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఒకరు గుర్తుకు వస్తుంటారు. తమ నేతను ఆ పదంతో సంబోధిస్తున్నారనే ఉద్దేశంతో ఈ పదాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. మొత్తం 38 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 1,161 పదాలు నిషేధంలో ఉన్నాయి. దొంగ, చెడిన, అవినీతిపరుడు, నియంత, గూండా, వ్యభిచారి, అబద్ధాలకోరు, మామ తదితర పదాలు నిషేధం. ఈ పుస్తకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ పుస్తకాలను అసెంబ్లీ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులు సంయమనంతో సభలో పాల్గొనేలా ఆ పుస్తకం మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విలువలతో విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. -
నా భార్యను, కోడలిని బండబూతులు తిట్టారు
► అన్నదానం చేసిన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు ► నా చేతులు నరికేసినట్లు అయింది ► ఒంట్లో రక్తం లేదు.. పౌరుషం లేదు.. అంతా సెలైన్ నీళ్లే ► వాళ్లకు భగవంతుడు శాస్తి చేసేవరకు మా ఇంట్లో పండగలు చేసుకోం ► ఆస్పత్రిలో నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు ► టీవీ, సెల్‌ఫోన్, పేపర్ కూడా అందుబాటులో ఉంచలేదు ► కిర్లంపూడిలో దీక్ష విరమించిన ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి ► బంధువులను అవమానించారంటూ కన్నీటి పర్యంతమైన పద్మనాభం కిర్లంపూడి ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే.. మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగలగొట్టుకుని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్యను రెండు రెక్కలు పట్టుకుని బూతులు తిడుతూ తీసుకెళ్లి.. ఎత్తి బస్సులో పారేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తన కోడలిని, బావమరిది భార్యను, తన కొడుకును కూడా బండబూతులు తిడుతూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆయన చెప్పారు. కొడితే దిక్కెవడురా అంటూ నానా తిట్లూ తిట్టారన్నారు. 14 రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షను ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగ్రామంలో విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మన పరిపాలన ఇలా ఉందని, ముఖ్యమంత్రి పాలనలో ఇది కూడా ఒక భాగంగానే భావిస్తున్నానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... మాట్లాడేందుకు కూడా ఓపికలేదు.. ఉద్యమ విషయం అందరికీ తెలుసు ఆ సందర్భంలో కేసుల విషయంలో లోతైన దర్యాప్తు చేస్తే తప్ప అరెస్టుల పర్వం ప్రారంభించమని ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టారు మేమూ ముద్దాయిలమే అరెస్టు చేసుకోమని 7వ తేదీన పోలీసు స్టేషన్‌కు వెళ్లాం 9వ తేదీన టీవీలో 69 కేసులు నామీద పెట్టారని చెప్పడం విన్నాను అదనపు ఎస్పీ నన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్నారు.. సమన్లు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పించమంటే ఏవీ లేవని అవమానించడానికే వచ్చినట్లుగా ప్రవర్తించారు మీరంతా చూస్తారన్న ఉద్దేశంతో మీడియాను బయటకు పంపి, తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు సాధారణంగా దీక్ష ప్రారంభించిన నాలుగు, ఐదు, ఆరో రోజు పరిస్థితి తీవ్రంగా ఉంటే అలా చేయడం పద్ధతి గానీ మొదటిరోజే, అది కూడా మూడు గంటలకే తలుపులు పగలగొట్టారంటే కక్ష సాధించడానికే అన్నట్లు ఉంది కానిస్టేబుల్ మొదలు డీజీపీ వరకు ఎంతోమంది ఆఫీసర్లకు నా చేత్తో కాఫీ ఇచ్చాను, టిఫిన్, భోజనాలు పెట్టాను వాళ్ల ఎంగిలి ఆకులు కూడా తీసిన రోజులు ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది మా ఇంట్లో భోజనాలు చేశారు పోలీసు స్టేషన్లో ఫంక్షన్ ఉందంటే వాళ్లకు కావల్సినవన్నీ సమకూర్చేవాళ్లం స్టేషన్ కు పెద్దసారు వచ్చారంటే మేమే చేయాల్సి వచ్చేది అలా అన్నదానం చేసిన ఈ ఊరి ప్రజానీకానికి, కొద్దోగొప్పో అన్నం పెట్టిన నాకు చేతులు నరికేశారు అన్నదానం చాలా తప్పు అని చెప్పినట్లయింది అన్నం పెట్టిన మనిషిని కొట్టడం, తిట్టడం ఇక్కడ చేయరు అలాంటి కుటుంబాన్ని బూతులు తిట్టించుకునే దౌర్భాగ్యం నాకు కలిగింది అయినా పోలీసు వాళ్ల పట్ల నాకు ఎలాంటి కోపం లేదు ఎవరిమీదా చర్యలు కోరుకోవట్లేదు ఎవరినీ సస్పెండ్ చేయాలని, బదిలీ చేయాలని గానీ, చెవిలో పువ్వులు పెట్టే విచారణలు గానీ వద్దని చెప్పాను నా పాట్లు నేను పడతాను ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికీ ఇలాంటి అవమానం జరిగి ఉండకపోవచ్చు మా తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశా అయినా ఇలా అవమానించడం... చెప్పడానికి మాటలు రావడంలేదు ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాను అప్పటివరకు మా ఇంట్లో ఏ పండగ చేసుకోం ఇప్పుడు నా శరీరంలో రక్తం లేదు, పౌరుషం, పట్టుదల లేవు.. సెలైన్ నీళ్లు మాత్రమే ఉన్నాయి ఎవరైనా దారిలో వెళ్తూ చెప్పుతో కొట్టినా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఎవరినీ ఏమీ చేయలేని అల్పుడిని, అనాధను అని భావిస్తున్నాను పోరాడే శక్తి కోల్పోయాను.. కొంచెం ఊపిరి ఉంది. దాన్ని జాతికోసం, నన్ను నమ్ముకున్న ఇతరుల కోసం ఉపయోగిస్తాను ఇంత అవమానం జరిగినా.. మరింత పోరాడాలని ఉంది కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదలకూడదని కోరుతున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అడుగుతున్నాను తప్ప కొత్తదేమీ అడగలేదు ఇచ్చిన హామీ అమలుచేయాలంటే సీఎంకు కోపం వస్తోంది.. ఎందుకో తెలియడంలేదు నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు సెల్ ఫోను, టీవీ కూడా అందుబాటులో లేకుండా చూశారు. సెంట్రల్ జైల్లో ఉన్న మనిషికి పేపర్ అయినా ఇస్తారు. నాకు అది కూడా ఇవ్వలేదు నన్ను కూడా బూటుకాలుతో తన్నినా బాధపడను.. రిజర్వేషన్లు ఇవ్వండి చాలు నావల్ల నా సోదరులు, బంధువులు, అభిమానులు ఎంతోమంది అవమానపడ్డారు.. అందరికీ తలవంచి క్షమాపణలు చెబుతున్నాను రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది పెద్దపెద్ద నాయకులు సంఘీభావం ప్రకటించారని చెబితే విన్నాను వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు