ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది ఉద్యోగార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన స్పెషల్ బుక్‌లెట్ మార్కెట్లోకి వచ్చేసింది.
వెల రూ.50 మాత్రమే
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది ఉద్యోగార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన స్పెషల్ బుక్‌లెట్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రొఫెసర్లు, అధ్యాపకులు రూపొందించిన ఈ పుస్తకం వెల రూ.50 మాత్రమే. ఉద్యోగాన్ని సులువుగా దక్కించుకునేందుకు అవసరమైన ప్రిపరేషన్ ప్లాన్, మార్చి, 2013 నుంచి మార్చి, 2014 వరకు తాజా కరెంట్ అఫైర్స్‌ను ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచాం. అలాగే 25 కిలోమీటర్ల నడకలో విజయం సాధించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనరల్ స్టడీస్(హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, పాలిటీ...) సమగ్ర సమాచారం, జనరల్ ఎస్సేలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అనుసరించాల్సిన మెలకువలు, నిపుణులు రూపొందించిన మోడల్ పేపర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్పెషల్ బుక్‌లెట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రముఖ పుస్తక కేంద్రాల్లోగానీ మీ సమీప సాక్షి ఏజెంట్‌నుగానీ సంప్రదించవచ్చు.