ముందే బుక్‌లెట్ లాక్కున్నారు | Inter students Concerns | Sakshi
Sakshi News home page

ముందే బుక్‌లెట్ లాక్కున్నారు

Published Fri, Mar 4 2016 1:34 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Inter students Concerns

* ఇంటర్ విద్యార్థులు ఆవేదన
* వనస్థలిపురం మాస్టర్ మైండ్ కాలేజీలో ఘటన

సాక్షి, హైదరాబాద్: ‘పరీక్షకు సకాలంలో చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించం’ అనే నిబంధన బాగానే ఉంది. కానీ ఈ నిబంధన సమాధాన పత్రాలు తీసుకునే ముందు వర్తించదా? అని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జరిగిన ఇంటర్  పరీక్షలో సమయం ముగియక ముందే సమాధానాల బుక్‌లెట్‌ని ఇన్విజిలేటర్ లాక్కున్నాడు. ఈ ఘటన వనస్థలిపురంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల సెంటర్‌లో జరిగింది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధిత విద్యార్థులు ‘సాక్షి’ కి చెప్పారు.

సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి సరిపోయింది.. ఇతర సబ్జెక్టులైతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్‌ఐఓ హన్మంత్‌రెడ్డిని వివరణ అడగగా.. ‘నిర్దిష్ట సమయం పూర్తికాకముందే బుక్‌లెట్ లాక్కోవడం క్షమించరాని విషయం. ఈ ఘటనపై విచారణ చేసిన తర్వాత ఇన్విజిలేటర్‌పై చర్యలు తీసుకుంటా’మని సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement