
ఉద్యాన‘వన’ మయూరాలు..
నిరంతరం రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే మెట్రో నగరంలో వనచరాలైన మయూరాలు కనిపించడం అరుదైన దృశ్యం.
నిరంతరం రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే మెట్రో నగరంలో వనచరాలైన మయూరాలు కనిపించడం అరుదైన దృశ్యం. వన మయూరాలు కాకుంటేనేం..? ఉద్యాన‘వన’ మయూరాలు కెమెరా కంటికి చిక్కాయి. కేబీఆర్ పార్కులోని పచ్చని పరిసరాల్లో చెట్లపై వాలుతూ, నేలపై నడయాడుతూ రాజసంగా సంచరిస్తున్న నెమళ్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.