కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంపై సర్వే
బంజారాహిల్స్: ట్రాఫిక్ కష్టాలు లేకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వైపు రయ్ రయ్‌మంటూ వాహనాలు దూసుకెళ్లేందుకే ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిరి్మంచేందుకు పచ్చజెండా ఊపిని విషయం విదితమే. ఇప్పటికే ఎక్కడెక్కడ అండర్‌పాస్ స్టార్ట్ అవుతుంది.
ఎక్కడి నుంచి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు అనే విషయాలపై ప్రాజెక్టŠస్ అధికారులు భారీ మ్యాప్‌లు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మ్యాప్‌ల ఆధారంగా ఇప్పుడు జలమండలి, అర్బన్ బయో డైవర్సిటీ, జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. జలమండలి, యూబీడీ అధికారులు సర్వే పూర్తయిన తర్వాత పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇక్కడ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టినట్లు అవుతుంది.
ఆరు జంక్షన్లలో పైప్‌లైన్లపై...
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 మీదుగా సాగే ఈ అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిరి్మంచే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ మంచినీటి పైప్‌లైన్లతో పాటు మరికొన్ని చోట్ల సీవరేజి లైన్లు ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ వచ్చే ఆరు జంక్షన్లలో ఎక్కడెక్కడ ఏఏ లైన్లు ఉన్నాయో వాటిని సర్వే చేసే పనిలో జలమండలి జీఎం హరి శంకర్ ఆయా సెక్షన్ల మేనేజర్లు, ఇంజనీర్లతో సమీక్షిస్తున్నారు. ఈ జంక్షన్ల ప్రాంతంలో 1200, 1000, 900 ఎంఎం ఎంఎస్ వ్యాసార్థంలో భారీ మంచినీటి పైప్‌లైన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఆయా జంక్షన్ల నుంచి పక్కకు తప్పించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దీనికి తోడు వెంకటగిరి నుంచి తట్టికాన వాటర్ సెక్షన్‌కు నీళ్లు పంపింగ్ చేసే భారీ పైప్‌లైన్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. మ్యాప్‌ల ఆధారంగా ఇక్కడున్న మంచినీటి భారీ లైన్లు ఏ విధంగా ఎటు వైపు మారిస్తే బాగుంటుంది అనే అంశంపై ఇప్పటికే అధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment