
మయూరం.. వయ్యారం
సాయంకాలం.. చుట్టూ పంట పొలాలు.. రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు.. ఆకాశంలో కమ్మకున్న మేఘాలు.. దోబూచులాడుతూ మబ్బుల మాటున సూరీడు.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మయూరం తుర్రుమంటూ రోడ్డుకు అడ్డంగా ఇలా ఎగురుకుంటూ వెళ్లింది. శుక్రవారం శంషాబాద్ మండలం నర్కూడ సమీపంలో షాబాద్ రోడ్డుపై గాలిలో ఎగురుతూ నాట్యమయూరాన్ని 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది...
- శంషాబాద్ రూరల్