సాధారణంగా పెళ్లి వేడుకల్లో వివాహం చేసుకునే జంట అందమైన, రంగురంగుల ఆకృతిలో ఉండే కేకులను కట్ చేసి తమ అనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఈ క్రమంలోనే జార్జియాకు చెందిన రెనా డేవిస్ అనే పెళ్లి కూతురు తన వివాహ వేడుకకు నెమలి ఆకారంలో ఉన్న కేకును 300 డాలర్లు ఖర్చు చేసి మరి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. కేకు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన తాను కేకు వచ్చాక దాన్ని చూసి షాక్‌కు గురైంది.
ఆ కేకు పూర్తిగా తాను పంపించిన నెమలి ఆకారానికి భిన్నంగా ఉండటంతో సదరు పెళ్లి కూతురు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. తాను వృత్తాకారంలో ఉండే పదార్థం మీద కూర్చున్న నెమలి.. తన పింఛము కన్నులు నీలం, ఆకుపచ్చ రంగులతో చిన్న బుట్ట కేకులుగా ఉండే కేకును ఆర్డర్ చేసింది. అయితే అందమైన కేకు కోసం వేచి చూసిన రెనాకు చేదు అనుభవం ఎదురైంది.
వింత ఆకారంలో తయారు చేయబడిన కేకును రేనా వదిన అన్నెట్ హిల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘కేకును తయారు చేసే పదార్థం తెల్లగా లేదు. కుష్టి రోగం వచ్చిన నెమలి లేదా ఓ టర్కీ కోడిలా కేకు మాకు దర్శనమిచ్చిందని వ్యంగ్యంగా తెలిపారు. కనీసం ఆ పక్షికి తోక కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఎటునుంచి చూసినా ఆ పక్షి ఆకారం తాము ఆర్డర్ చేసిన నెమలి ఆకృతిలో మాత్రము లేదని’ హిల్ పేర్కొన్నారు. ఇంత వికృతంగా తయారుచేయబడిన ఈ కేకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చివరగా సంబంధిత బేకరీ సిబ్బంది కేకు డబ్బులను తిరిగి ఇచ్చినట్టు హిల్ తెలిపారు.
నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!
Published Mon, Oct 14 2019 8:07 PM | Last Updated on Mon, Oct 14 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment