
చెర్రీ.. సరదాగా కాసేపు..!
ప్రస్తుతం సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవుతున్న రామ్ చరణ్ కాలీ సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా తన ఫాంలో టైం పాస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ను అనుకోని అతిథి పలకరించింది. మన జాతీయ పక్షి నెమలి చరణ్ ఫాంలో దర్శనమిచ్చింది. ఆ నెమలి చరణ్ గడిపిన సరదా సమయాన్ని తన అభిమానుల కోసం వీడియో రూపంలో ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు చరణ్.
ధృవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ యువ నటుడు వైభవ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ ఈ నెల 20న సెట్స్ మీదకు వెళ్లనుంది.