వడదెబ్బకు ముగ్గురి మృతి
ఎండ@ 42.4
నేలకొరిగిన నెమలి, పలు పావురాలు
సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. నగరంలో పగటిపూట నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. నగరంలో శనివారం 42.4 డిగ్రీల గరిష్ట, 28.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతకు వడగాల్పులు తోడవడంతో నగరవాసి తట్టుకోలేక పోతున్నాడు. గ్రేటర్‌లో శనివారం ఒక్క రోజే ముగ్గురు మృతి చెందగా, ఒక నెమలి సహా పలు పావురాలు నేలకొరిగాయి. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఓ గుర్తుతెలియని వృద్ధురాలు(60), మలక్‌పేటలోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తు న్న గోపాలు(80) వడదెబ్బతో వృతి చెందారు. పంజగుట్ట గాంధీతాతా నగర్‌కు చెందిన ఇరుగుల లక్ష్మయ్య (50) కూలి కోసం వెంకటరమణకాలనీ అడ్డాలో నిలబడి ఉన్నాడు. ఉద యం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి వుృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయపక్షి అయిన నెమలి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నాంపల్లి రైల్వేస్టేషన్, అబిడ్స్, చార్మినార్, మక్కామసీదు పరిసరాల్లో పావురాలు భారీగా వుృతి చెందారుు. వడగాల్పులకు ఉక్కపోత తోడవడంతో మధ్యాహ్నం సమయంలో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. సాధారణంగా ఈ సమయంలో 45-48 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరగాల్సి ఉండగా, ఈ ఏడాది ఎండ తీవ్రత వల్ల రోజువారి విద్యుత్ వినియోగం 52-54 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఒత్తిడికి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్నాయి.