transport office
-
దోచుకున్నోళ్లకు దోచుకున్నంత
సాక్షి, కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలో దళారుల దందా మళ్లీ మొదలైంది. పనులు జరగాలంటే పైసలు ముట్టజెప్పాల్సిందే. పని ఏదైనా ఆమ్యామ్యాలు అప్పచెబితే క్షణాల్లో పనులు చేసి పెడతారు. లేదంటే రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి కళుకలదుటే కనిపిస్తోంది. ఒకప్పుడు కార్యాలయ ఆవరణంలో తిరగాలంటే భయపడే దళారులు ఇప్పుడు అక్కడే తిష్ట వేసి దోపిడీకి దారులు తీస్తున్నారు. జిల్లా ఉప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న బసిరెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీ కావడంతో దళారులు అడ్డంగా దొరికిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ఆయన బదిలీపై వెళ్లిన వెంటనే ఎక్కడో ఉన్న దళారులు కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో పనులు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. గతంలో ఉన్న డీటీసీ బసిరెడ్డి రవాణాశాఖ కార్యాలయంలో ఎక్కడా కూడా దళారుల జాడ లేకుండా చేసి ప్రజలే స్వయంగా వచ్చి పనులు చేసుకునేలా వీలు కల్పించారు. రవాణాశాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. దాదాపు ఆయన పని చేసిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో దళారుల ఊసే లేకుండా ఉండింది. ఆయన బదిలీ అనగానే దళారులు ఇక్కడి సిబ్బందితో సంప్రదింపులు జరిపి తమ వ్యాపారం మొదలు పెట్టారు. ఎల్ఎల్ఆర్ నుంచి డ్రైవింగ్ టెస్టింగ్ వరకు రేట్లను నిర్ణయించారు. కార్యాలయంలో పని చేసే హోంగార్డు నుంచి పైస్థాయి సిబ్బంది వరకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. దళారులకు అడ్డాగా ఆన్లైన్ సెంటర్లు ఆన్లైన్ సెంటర్లు దళారులకు అడ్డాగా మారాయి. కొందరు దళారులు రింగు రోడ్డు, నగరంలో ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎల్ఎల్ఆర్ కావాలంటే దళారులు ఇచ్చే సింబల్ ప్రకారం రవాణాశాఖ కార్యాలయ అధికారులు ఎల్ఎల్ఆర్ పాస్ చేసి పంపుతున్నారు. దళారీ ద్వారా కాకుండా నేరుగా ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరైతే వారిని ఫెయిల్ చేసి పంపుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. టెస్టింగ్ కేంద్రం వద్ద ఆ దళారిదే ఇష్టారాజ్యం వాహనాల డ్రైవింగ్ టెస్టింగ్ వద్ద చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీకి చెందిన ఓ దళారీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. టెస్టింగ్ పాస్ కావాలంటే టూ వీలర్‌కు రూ.600 నుంచి రూ.800, ఫోర్ వీలర్, టూవీలర్ పాస్ కావాలంటే రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నాడు. ఇదంతే అక్కడున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు తెలియదంటే పొరపాటే. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎదురుగా వసూలు చేస్తున్నా వారు నోరు మెదపకుండా మిన్నకుండి పోతున్నారు. ప్రత్యక్షమవుతున్న దళారులు రవాణా శాఖ కార్యాలయంతో పాటు రింగురోడ్డు సర్కిల్ పరిసర ప్రాంతంలో సంచరిస్తూ కార్యాలయానికి వచ్చే వారిని తమ పనులు క్షణాల్లో చేస్తామంటూ వారి నుంచి రేటు నిర్ణయించుకొని పనులు చేసి పంపుతున్నారు.ఈ విషయమై ఇన్చార్జ్ డీటీసీ శాంతకుమారిని వివరణ కోరగా దళారులను కార్యాలయంలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. దళారులకు సిబ్బంది సహకారం అందిస్తే అలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రవాణాశాఖ కార్యాలయంలో దళారుల నివారణే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. -
క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు
సాక్షి, అమరావతి : విజయవాడలో గత శనివారం ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో క్యాషియర్‌పై కర్రలతో దాడి చేసి నగదును కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి పథక రచన చేసిన సూత్రధారితోపాటు దోపిడీలో పాల్గొన్న ముగ్గురిని 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సూర్యారావుపేట స్టేషన్ కార్యాలయంలో డీసీపీ–2 విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. స్నేహితుడే కానీ.. విజయవాడ నగరం 2వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజా సెంటర్, పాడి వీధిలో ప్రగతి ట్రాన్స్‌పోర్టును సంతోష్ కుమార్ త్రిపాఠి నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్‌గా త్రిపాఠి స్నేహితుడు ఎదుబోస్లే వేణుగోపాల్ పనిచేస్తుండేవాడు. కొంత కాలం తర్వాత వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చి వేణుగోపాల్ త్రిపాఠి వద్ద పనిచేసి సొంతంగా మరొక కంపెనీ ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహించాడు. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో తన స్నేహితుడు త్రిపాఠిపై వేణుగోపాల్ కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో వేణుగోపాల్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ సమయంలో ప్రగతి ట్రాన్స్‌పోర్టులో దొంగతనం చేయాలని పథకం వేశాడు. ఇందుకు తన భార్య అక్క కొడుకు విశాల్ రాజ్‌కుమార్ కోయిల్ సాయం తీసుకున్నాడు. విశాల్ ప్రగతి ట్రాన్స్‌పోర్టులోనే కిరాయి ఆటోను పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. పక్కా స్కెచ్.. ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో రోజూ రూ.5 లక్షలకు పైగా నగదు ఉంటుందనే విషయాన్ని గ్రహించారు. ముందుగానే పథక రచన చేశారు. క్యాషియర్‌గా పని చేస్తున్న ప్రదీప్ పాండే ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో రాత్రి 9.30 గంటల అనంతరం ఒక్కడే ఉండే విషయాన్ని తెలుసుకొని కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. దోచుకోవడం విశాల్ ఒక్కడి వల్ల కాదనే భావనతో అతడి స్నేహితులైన మహారాష్ట్ర లాథూర్ జిల్లా దేవిని మండలం బొరొల్ గ్రామానికి చెందిన కోపె మాధవ్ త్రయంబక్, సందీప్ పాండురంగ యంకురేలను నగరానికి రప్పించాడు. ఈనెల 13వ తేదీ రాత్రి దోపిడీకి సిద్ధమయ్యారు. విశాల్ స్నేహితులు కొత్తపేట చేపల మార్కెట్ వద్ద ఉన్న షాదీఖానా ప్రాంతంలోని మేదర్ల వద్ద రెండు వెదురు కర్రలు కొన్నారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ట్రాన్స్ పోర్టులో ఉన్న సిబ్బంది కూడా వెళ్లి పోయిన తర్వాత కార్యాలయంలోకి చొరబడి క్యాషియర్‌పై కర్రలతో దాడి చేసి రూ. 3.50 లక్షల నగదును దోచుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా.. దోపిడీ జరిగిన తర్వాత క్యాషియర్ ప్రదీప్పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ తీరును పరిశీలించారు. ఆధారాలను సేకరించారు. అలాగే ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలోకి నిందితులు చొరబడిన తీరు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నమోదైంది. దాని ఆధారంగా విశాల్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో సూత్రధారి వేణుగోపాల్‌ను.. దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం మహారాష్ట్రకు ప్రత్యేక బృందాన్ని పంపించి వారిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారి వద్ద నుంచి రూ. 3.50 లక్షల నగదుతోపాటు దోపిడీకి వినియోగించిన బైక్, వెదురు కర్రలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు అభినందనలు.. దోపిడీ జరిగిన వెంటనే రెండు రోజుల్లోనే కేసును ఛేదించడమే కాకుండా మహారాష్ట్రకు వెళ్లి నిందితులను అరెస్టు చేసిన ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్‌తోపాటు వెస్ట్‌జోన్ ఏసీపీ సుధాకర్, టూటౌన్ సీఐ ఉమర్, ఎస్ఐలు కృష్ణ, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఖాదర్, నాంచారయ్య, అజయ్, రాజేష్‌లను డీసీపీ విజయరావు అభినందించారు. -
క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ
సాక్షి, విజయవాడ: లారీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలోని క్యాషియర్‌పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి రూ.నాలుగు లక్షల నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజా సెంటర్లోని ఇస్లాంపేటలోని ఓ ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో అలహాబాద్‌కు చెందిన ప్రదీప్ పాండే రెండేళ్లగా క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటాడు. శనివారం కావడంతో వారంలో ఎక్కువ మొత్తం కలెక్షన్ రావడంతో ఆ డబ్బులు లెక్కించుకునే క్రమంలో రాత్రి ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల సమయంలో బయట వర్షం కురుస్తున్న తరుణంలో ముగ్గురు వ్యక్తులు కార్యాలయం లోపలకు వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి ఉండటం, చేతిలో కర్రలో ఉండటంతో పాండే గట్టిగా కేకలు వేశాడు. అప్పటికే లోపలకు వచ్చిన ఆ యువకులు పాండేపై దాడి చేసి క్యాష్ కౌంటర్లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బాధితుడిపై దాడి చేసే క్రమంలో కార్యాలయంలోని సామగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. ముసుగు వ్యక్తుల దాడిలో తీవ్రగాయాలైన పాండే వెంటనే కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా నిందితులు ధైర్యంగా లోపలకు ప్రవేశించి దాడి చేయడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయం గురించి బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పని చేసే 12 మంది సిబ్బంది వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విజయవాడలో రెచ్చిపోయిన ముసుగుదొంగలు
-
రవాణా శాఖలో దళారుల దందా
⇒ వాహనదారుల్ని బ్రోకర్ల వద్దకు పంపుతున్న కార్యాలయ సిబ్బంది ⇒ నేరుగా కార్యాలయాల్లో బేర సారాలు సాగిస్తున్న వైనం నగరంపాలెం (గుంటూరు): గుంటూరు రవాణాశాఖ కార్యాలయం దళారుల కనుసన్నల్లో నడుస్తోంది. బ్రోకర్లు కిందిస్థాయి సిబ్బంది మిలాఖత్ అయి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాహనదారుడు కొత్త వాహనం కొన్నదగ్గర్నుండి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్.. ఇలా అన్ని పనులకు ఒక రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. సదరు అధికారులే దళారుల్ని పిలిపించి బేరసారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటనే. పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి టాక్సు చెల్లించడానికి రాగా సిబ్బంది చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు కొంత డబ్బు ఇవ్వాలని పీడించి వసూలు చేసి పని చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరాసరి దళారుల వద్దకే.. పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. సదరు వాహనం రిజిస్ట్రేషన్ ట్యాక్సీ పేరుతో ఉండటంతో నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనంగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 1న గుంటురు ఉప రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. వివరాలు ఎవరిని అడగాలో తెలియక గంటల పాటు ఇబ్బంది పడ్డాడు. చివరికి ట్యాక్సీ క్యాబ్‌లో సెక్షన్ సిబ్బందిని విచారించగా సదరు వ్యక్తులు సరాసరి దళారుల వద్దకు వెళితే పని అవుతుందని సూచించగా వాహనదారుడు అవాక్కయ్యాడు. హెల్ప్ డెస్క్ నుంచే దందా షురూ.. రవాణా శాఖ కార్యాలయం సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ అధికారులే బ్రోకర్లను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసేటప్పుడు అవగాహన లేక ఎంతో మంది ఇలా మోసపోతూనే ఉన్నారు. గట్టిగా నిలదీస్తే చేయాల్సిన పనిని ఆపి నెలల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రతి పనీ సెప‘రేటు’.. కార్యాలయంలో ఓ దళారి తాను ఎంవీఐ డ్రైవర్‌నని పరిచయం చేసుకొని లైఫ్ టాక్స్ రూ.23 వేలతో పాటు మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని సూచించాడు. సదరు వాహనదారుడు చేసేందేంలేక అందుకు ఒప్పుకున్నాడు. వాహనాన్ని బ్రేక్ వద్దకు తీసుకెళ్లి దళారే కార్యాలయంలో గుమస్తాలతో దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేయించాడు. ఇతర దళారులకు ఇదే పని నెల రోజులు పడుతుందని, తాను మూడు రోజుల్లోనే చెప్పి లైఫ్ ట్యాక్స్ కాక అదనంగా అడిగిన నగదు తీసుకున్నాడు. అప్పటి నుంచి పనిని వాయిదా వేస్తూ 24వ తేదీన ఫోన్లో సంప్రదించగా లైఫ్ టాక్స్ రూ.28 వేలు అని, మరో రూ. 5 వేలు ఇస్తే తప్ప పని జరగదని చెప్పాడని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేంలేక ఉసూరుమంటూ నగదు చెల్లించాడు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం కొన్నే..! -
ట్రాన్సుపోర్టు కార్యాలయంలో భారీ చోరీ
విజయవాడ : విజయవాడ నగరంలో ప్రైవేట్ ట్రాన్సుపోర్టు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని పాడి వీధిలో ఉన్న బాంబే-ఆంధ్ర ట్రాన్సుపోర్టు కంపెనీ కార్యాలయం తలుపులు పగులగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.10 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. కొత్తపేట పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బకు ముగ్గురి మృతి
ఎండ@ 42.4 నేలకొరిగిన నెమలి, పలు పావురాలు సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. నగరంలో పగటిపూట నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. నగరంలో శనివారం 42.4 డిగ్రీల గరిష్ట, 28.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతకు వడగాల్పులు తోడవడంతో నగరవాసి తట్టుకోలేక పోతున్నాడు. గ్రేటర్లో శనివారం ఒక్క రోజే ముగ్గురు మృతి చెందగా, ఒక నెమలి సహా పలు పావురాలు నేలకొరిగాయి. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఓ గుర్తుతెలియని వృద్ధురాలు(60), మలక్‌పేటలోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తు న్న గోపాలు(80) వడదెబ్బతో వృతి చెందారు. పంజగుట్ట గాంధీతాతా నగర్‌కు చెందిన ఇరుగుల లక్ష్మయ్య (50) కూలి కోసం వెంకటరమణకాలనీ అడ్డాలో నిలబడి ఉన్నాడు. ఉద యం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి వుృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయపక్షి అయిన నెమలి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నాంపల్లి రైల్వేస్టేషన్, అబిడ్స్, చార్మినార్, మక్కామసీదు పరిసరాల్లో పావురాలు భారీగా వుృతి చెందారుు. వడగాల్పులకు ఉక్కపోత తోడవడంతో మధ్యాహ్నం సమయంలో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. సాధారణంగా ఈ సమయంలో 45-48 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరగాల్సి ఉండగా, ఈ ఏడాది ఎండ తీవ్రత వల్ల రోజువారి విద్యుత్ వినియోగం 52-54 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఒత్తిడికి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్నాయి. -
రవాణాశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి
విజయవాడ : విజయవాడ నగరంలోని రవాణాశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక విభాగం అధికారులు గురువారం ఉదయం సోదాలు జరిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎంవీఎస్ఎస్ నాయుడు సహా ఏడుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం సమీపంలోనే ఉన్న బ్రోకర్ల అడ్డాపైనా దాడి చేసి, రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు సందర్బంగా బ్రోకర్ల ద్వారా కార్యాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు అందటంతో దాడులు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. -
రవాణాశాఖలో ‘ఫోర్జరీ’ కలకలం
నెల్లూరు (టౌన్) : రవాణాశాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. సిబ్బంది చేతులు తడిపితే చాలు ఒరిజనల్ ధ్రువపత్రాలు లేకపోయినా పని క్షణాల్లో అయిపోతుంది. ఏజెంట్లను ఆశ్రయిస్తే క్షణాల్లో పనిచేసి చేతిలో కాగితాన్ని పెడతారు. ఇందుకు కావాల్సిన సరంజామా అంతా వారి దగ్గర రెడీగా ఉంటుంది. ఇదంతా రవాణా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. తాజా గా ఆర్టీఓ సంతకం ఫోర్జరీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి బ్యాడ్జీ కోసం దరఖాస్తు చేయగా పత్రాల్లో ఆర్టీఓ సంతకాన్ని ఓ ఏజెంట్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం సంబంధిత పత్రాలను పరిశీలించి ఫోర్జరీ జరిగిందని నిర్ధారించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. ఇది జరిగిందీ... రవాణా వాహనం నడిపేందుకు హెవీ లెసైన్స్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. ఇది కావాలంటే బ్యాడ్జీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాడ్జి పొందాలంటే 8వ తరగతి ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్‌ను ఇవ్వాలి. ఓ ఏజెంట్ సదరు సర్టిఫికెట్తో పాటు దరఖాస్తు, రూ.90లు చలానాను ఎల్ఎల్ఆర్ సెక్షన్లో ఇచ్చాడు. అయితే ఆర్టీఓ సంతకం దరఖాస్తులో ఉండగా, రిజిస్టర్లో లేకపోవడంపై ఆ సెక్షన్ ఉద్యోగికి అనుమానం రావడంతో వెంటనే ఆర్టీఓను సంప్రదించారు. ఫైల్‌ను పరిశీలించిన ఆర్టీఓ తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇంత పెద్ద విషయం జరిగినా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయంశమైంది. ఏజెంట్లు చేతికి కార్యాలయ ఫైళ్లు రవాణాశాఖలో కొందరు ఏజెంట్లు కార్యాలయ ఫైళ్లను తమవద్ద ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా సంఘటనతో ఈ వ్యవహారం బయట పడింది. ఏజెంట్ 8వ తరగతి సర్టిఫికెట్ నకిలీదనే విషయం తెలిసిపోతుందని ఏకంగాకార్యాలయ ఫైల్‌ను తీసుకుని ఆర్టీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగికి ఇచ్చా డు. దొంగ సర్టిఫికెట్‌ను పట్టించుకోకుం డా లెసైన్స్ జారీ చేసేందుకు రూ.10 నుం చి రూ.15వేలు లంచంగా ముట్టజెప్పుతారని ఆరోపణలున్నాయి. 2011 జనవరి లో ఇదే ఏజెంట్ అప్పటి ఆర్టీఓ రాంప్రసా ద్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నకిలీ సర్టిఫికెట్లను పెట్టి సుమారు 50కి పైగా లెసైన్సులు ఇప్పించినట్లు సమాచారం. ఏసీబీ కార్యాలయంలో పనిచేసే ఓ కాని స్టేబుల్ సదరు ఏజెంట్‌కు అండదండలు అందిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఏసీబీ పేరుతో బెదిరింపులు రవాణాశాఖ కార్యాలయంలో జరిగే అక్రమాలన్నీ ఏజెంట్లు తెలుస్తుండటంతో అధికారులు వీరిని ఏమీ అనలేకపోతున్నారు. మేం చెప్పినట్లు వినకపోతే ఏసీబీకి పట్టిస్తామని గతంలో ఏజెంట్లు అధికారులను బెదిరించారని తెలిసింది. ఏసీబీ రవాణాశాఖ కార్యకలాపాలపై దృష్టిసారించకపోవడంతో అక్రమాలకు అంతేలేకుండా పోతుంది. ఫోర్జరీ జరిగింది వాస్తవమే: ఆర్టీఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. ఆర్టీఓ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఆయన నా దృష్టికి తీసుకొస్తే ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. - శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్ -
ఆయిల్ కార్పొరేషన్ ట్యాంకర్ బోల్తా
విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున నాపయ్యపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. గ్యాస్ లారీ కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడపడమేనని పోలీసుల సమాచారం. (గాజువాక) -
అంగట్లో బాల్యం
ఏలూరు సిటీ :అది ఏలూరు రవాణా కార్యాలయం. దానికి కూతవేటు దూరంలో గుడారాలు. అందులో ఓ బృందం. వారిమధ్య ఓ బాలుడు. ఆ చిన్నారిని చూసిన ఓ అధికారి ఎక్కడినుంచి వచ్చావని ప్రశ్నించారు. బాలుడు నీళ్లు నమిలాడు. ఆ బృంద సభ్యులు కృష్ణాజిల్లా నూజివీడు నుంచి వచ్చిన వలస జీవులమని చెప్పుకున్నారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం అధికారులు అక్కడికెళ్లారు. ఆ బాలుడిని ప్రశ్నిం చారు. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తనను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని, తల్లిదండ్రులు లేరని చెప్పాడు. మరో ఘటనలో.. నిడదవోలు రైల్వేస్టేషన్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ సూయిజ్ స్వయంగా ముగ్గురు బాలికలను పట్టుకున్నారు. ఇంకో వైపు కృష్ణాజిల్లానుంచి వచ్చిన ఆరు కుటుంబాల వారు చంటి బిడ్డలతో భిక్షాటన చేయిస్తున్నారు. బాలల సంక్షేమాధికారులు వారిని అదుపులోకి తీసుకోగానే ఓ ప్రజాప్రతినిధి వారిని వదిలేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. అధికారులు విస్తుపోయూరు. చేసేదేమీ లేక వారిని వదిలేశారు. ఇలాంటి వ్యవహారాల వెనుక ఓ ముష్టి మాఫియూ పనిచేస్తోందని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అధికారుల చొరవతో జిల్లాలో ఇప్పటివరకూ 41 భిక్షాటన కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిపై చర్యలు చేపట్టారు. ఇదో మాఫియూ కృష్ణాజిల్లా విజయవాడ నగరంలో ముష్టి మాఫియా వేళ్లూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాఫియా కార్యకలాపాలు పశ్చిమగోదావరి జిల్లాకూ విస్తరించటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పట్టణాలు, నగరాలపైనే ఈ మాఫియా దృష్టి కేంద్రీకరించింది. ప్రకాశం జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏలూరులో భిక్షాటన చేయించారు. సెప్టెంబర్‌లో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో పదిమందితో కూడిన భిక్షాటన బృందాన్ని బాలల సంరక్షణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉండికి చెందిన ఓ మహిళ చిన్నారితో భిక్షాటన చేరుుస్తూ పట్టుబడింది. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌లో ఇద్దరు పిల్లలతో భిక్షాటన చేయిస్తుండగా బాలల సంక్షేమ కోర్టు చైర్మన్ టీఎన్ స్నేహన్ పట్టుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అదేవిధంగా అరకు నుంచి వచ్చిన ఓ కుటుంబం పిల్లలను వదిలేసి పారిపోగా ఆ పిల్లలను తీగలవంచలోని కోళ్లఫారంలో పనికి పెట్టుకున్నారు. దాన్ని సాకుగా చూపించి కొందరు వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా జిల్లాలో అనేక ఘటనలు చోటు చేసుకోవటం ఆందోళనకు గురిచేస్తోంది. పసి మొగ్గలను చిదిమేస్తున్నారు చిన్నారులను రోడ్ల వెంబడి తిప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. కేవలం భిక్షాటనతోనే బాలలను వదిలేయకుండా అసాంఘిక కార్యకలాపాలకూ వాడుతున్నట్లు తెలుస్తోంది. మానసిక వికలాంగులను కూడా భిక్షాటనకు వినియోగిస్తున్నారని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటూ చంటిపిల్లలను చంకన బెట్టుకుని మరీ భిక్షాటన చేస్తున్నారు. ఏలూరులో 36కేసులు, కొయ్యిలగూడెంలో 16, నిడదవోలులో 8, గోపాలపురంలో 6, భీమవరంలో 6, తాడేపల్లిగూడెంలో 24, తణుకులో 2 ఇలా కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు బాలకార్మికులు 40మంది, అనాధలు 10మంది, వీధిబాలలు 32మంది, అ త్యాచారాలకు గురైన బాలికలు 74మంది, మానసిక వికలాంగులు 20మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు బాలల న్యాయ చట్టంలోని సెక్షన్-24 ప్రకారం బాలలను భిక్షాటనకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్ని విచారిస్తే వీటి వెనుక మాఫియా ఉందనే అనుమానం వస్తోంది. కొందరు నాయకులు కూడా వారికోసం ఒత్తిడి తేవటం పరిస్థితికి అద్దం par పడుతోంది.ఙ- టీఎన్ స్నేహన్, చైర్మన్, జిల్లా బాలల కోర్టు సామాజిక రుగ్మతే విద్య, సామాజికపరంగా వెనుకబాటుకు గురైన వ్యక్తుల కుటుంబాల్లో ఎక్కువగా భిక్షాటన కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరమే. కొన్ని కేసులు పరిశీలిస్తే పిల్లలను వేధిస్తూ భిక్షాటన చేయిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు par తప్పవు.ఙ- పి.విజయనిర్మల, మేజిస్ట్రేట్; బాలల సంక్షేమ కోర్టు అవగాహన కల్పించాలి జిల్లాలో అన్ని పట్టణాలతోపాటు ఏలూరు నగరంలోనూ బాలల సంరక్షణా బృంధాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారుు. వీధి బాలలు, అనాథలు, భిక్షాటన చేసే వారిని అదుపులోకి తీసుకుని సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నాం. - సీహెచ్.సూర్యచక్రవేణి, జిల్లా బాలల రక్షణాధికారి -
జోరుగా నకిలీ నోట్ల చెలామణి
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీ నోట్లను వారికి అంటగడుతున్నారు. నిత్యకృత్యంగా ఈ దందా సాగుతున్నా పోలీసు యంత్రాంగం అరికట్టలేకపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలా సాగుతోంది... బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వ్యాపారపరంగా బెల్లంపల్లి పురోగమిస్తోంది. ఇక్కడ అనేక వ్యాపారాలు జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు భారీ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తుంటారు. తాండూర్లోని ఐబీ కేంద్రం అంగడికి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రతి శనివారం మేకల వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోపక్క బొగ్గు ట్రాన్స్‌పోర్టు కార్యకలాపాలు ఐబీ కేంద్రం నుంచే సాగుతున్నాయి. ఆ రకంగా బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో రోజువారీగా సుమారు రూ.కోటికిపైగా వ్యాపారం జరుగుతుందనేది అంచనా. అందువల్లే ఆ రెండు ప్రాంతాలను నకిలీ నోట్ల చెలామణిదారులు అడ్డాలుగా మలుచుకున్నారు. ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను ప్రజలకు అంటగట్టి గుట్టుగా దందా నిర్వహిస్తున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను జోరుగా చెలామణి చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బయటపడిన సంఘటనలు ఇటీవల ఓ మెడికల్ షాపుకు వెళ్లి కొద్ది మొత్తం మందులు కొ నుగోలు చేసి రూ.500 నకిలీ నోటును ఓ వ్యక్తి అప్పగించి వె ళ్లిపోయాడు. కాల్‌టెక్స్‌లో మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఓ వ్యక్తి రూ.1,000 నకిలీ నోటును అంటగట్టాడు. బేకరీ షాపులోనూ నకిలీ నోటు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆం ధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకులకు రోజువారీగా ఒకటి, రెండు నకిలీ నోట్లు రావడం సర్వసాధారణంగా మారింది. బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను చించివేయడం చేస్తున్నారు. మహిళలు వీటిని తీసుకువస్తుండటంతో సిబ్బంది ఏమి చేయలేకపోతున్నారు. దం దా నిర్వహిస్తున్న వ్యక్తులు ఏమాత్రం అనుమానం రాకుండా మహిళలకు నకిలీ నోట్లు అప్పగిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చేతికి కూడా నకిలీ నోటు వచ్చింది. చిల్లర మార్పిడి, సరుకుల కొనుగోలులో నకిలీ నోట్లు సునాయాసంగా చెలామణి చేస్తున్నారు. నోట్లను క్షుణ్ణంగా పరిశీలించకపోవడంతో అసలు నోటుగా భావించి అమాయకులు నకిలీ నోట్లను తీసుకుంటున్నారు. నకిలీ నోట్లను ఇలా గుర్తించాలి * అసలు నోటు పత్తితో చేయబడిన కాగితంతో తయారు చేస్తారు. ఇది ప్రత్యేకమైన పెళపెళ శబ్ధం చేస్తుంది. * నకిలీ నోటు తయారీకి వాడే కాగితం సాధారణ వెదురు గుజ్జుతో తయారవుతుంది. అందువల్ల ఆ నోటు దళసరిగా, నున్నగా ఉంటుంది. * అసలు నోటులో కొన్ని భాగాల్లో ప్రింట్ ఉబ్బెత్తు(ఇంటాగ్లియో)గా ఉంటుంది. * దొంగనోట్లలో ఉబ్బెత్తు ప్రింట్ కనిపించదు. * అసలు నోటులో మహాత్మాగాంధీ వాటర్ మార్కును ఎలక్ట్రోలైటు వాటరు మార్కును, సెక్యూరిటీ దారాన్ని లైటుకు ఎదురుగా పెట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. * దొంగనోట్లలో వాటరు మార్కును కూడా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు నోటులో ఉండే సూక్ష్మాంశాలను అనుకరించలేకపోతున్నారు. నకిలీ నోటును వెలుతురుకు ఎదురుగా పెట్టకపోయిన వాటర్ మార్కు కనిపిస్తుంది. సెక్యూరిటీ దారాన్ని కూడా నకలు చేసే ప్రయత్నం చేసినా అది మొరటుగా ఉంటుంది. * అసలు నోటులో నంబర్ ప్యానెల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుంది. * దొంగనోటులో నంబర్ ప్యానెల్ ఒక క్రమంలో ఉండదు. సాధారణంగా నంబర్లు అసలు నోట్లలోని నంబర్లకన్నా చిన్నగా ఉంటాయి. * అసలు నోటులో మహాత్మాగాంధీ బొమ్మ తలకు వెనుక ఆకుపచ్చ ప్యానెల్‌కు వెనుక సూక్ష్మమైన ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్‌పై సూక్ష్మంగా ఆర్బీఐ అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. అలాంటి అక్షరాలను భూతద్దం ద్వారా స్పష్టంగా కనపడుతుంది. * నకిలీ నోట్లలో సూక్ష్మాక్షరాలు ఉండవు. మైక్రో ప్రింటింగ్‌లోని నాణ్యత, స్పష్టత దొంగనోట్లలో ఉండదు. -
‘మెట్రో’ రాకతో సీన్ మారింది..!
సాక్షి, ముంబై: ఇటీవల ప్రారంభమైన మెట్రోరైలు పుణ్యమా అని ఆటో డ్రైవర్ల పెత్తనానికి పుల్‌స్టాప్ పడింది. మొన్నటి వరకు ఆటోల కోసం ప్రయాణికులు పడిగాపులు కాసేవారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. అప్పుడు ఇష్టమున్నట్లు చార్జీలు వసూలు చేసిన ఆటోవాలాలు ఇప్పుడు ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నిర్దేశించిన మీటరు ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నా గిరాకీలు దొరకడం కష్టంగా మారిపోయింది. మొన్నటివరకు ఘాట్కోపర్ లేదా అంధేరిలో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు తమ కార్యాలయాలకు చేరుకోవాలంటే ఆటో లేదా బెస్ట్ బస్సు ఎక్కాల్సిందే. కిక్కిరిసిన బెస్ట్ బస్సుల కంటే షేర్ ఆటోలో వెళ్లడమే నయమని భావించే చాలామంది ఆటోలనే ఆశ్రయించేవారు. దీన్ని అదనుగా చేసుకుని అటోవాలాలు అడ్డగోలుగా వసూలు చేసేవారు. ఎవరైనా ఆటోలో ఒంటరిగా వెళ్లాలనుకుంటే ఇక వారి జేబుకు చిల్లిపడ్డట్లే.. మీటరు వేయకుండానే ఇష్టానుసారం డిమాండ్ చేసేవారు. అదేమని నిలదీస్తే మరో ఆటో చూసుకోవాలని పెత్తనం చెలాయించేవారు. దీంతో కార్యాలయానికి చేరుకోవాలనే తొందరలో డ్రైవర్లతో ఎవరూ వాగ్వాదానికి దిగేవారు కాదు. ఇప్పుడు సీను మారింది.. మెట్రో రైలు రావడంతో అంధేరి, ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య ఉన్న కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూల్‌గా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మెట్రోలోనే ప్రయాణించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీలు దొరకడం కష్టతరంగా మారింది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంవల్ల ఇక్కడ పనిచేసే అన్ని వర్గాల ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది.