విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున నాపయ్యపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. గ్యాస్ లారీ కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడపడమేనని పోలీసుల సమాచారం.
(గాజువాక)
ఆయిల్ కార్పొరేషన్ ట్యాంకర్ బోల్తా
Published Tue, Feb 17 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement