gas tanker
-
గ్యాస్ ట్యాంకర్ ఎంత పని చేసింది?
కర్ణాటక: ధార్వాడ సమీపంలో భారీ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అండర్‌పాస్ కింద ఇరుక్కుపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో డ్రైవర్లు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 16 గంటలు శ్రమించి ట్యాంకర్‌ను బయటకు తీయడంతో హైడ్రామా సమాప్తమైంది. ఏం జరిగిందంటే వివరాలు... ధార్వాడ నగర సమీపంలో హైవే– 4లో హైకోర్టు బెంచ్ వద్ద ఒక అండర్ పాస్‌లో బుధవారం సాయంకాలం 7 గంటలప్పుడు ట్యాంకర్ చిక్కుకుపోయింది. ట్యాంకర్ డ్రైవర్ అవగాహన లేకుండా అవతలి వైపునకు వెళ్లగా, ట్యాంకర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో అండర్‌పాస్ పైకప్పుతో రాపిడి జరిగి ఇరుక్కుంది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు, వెనక్కు కదల్లేకపోయింది. ముమ్మరంగా సహాయక చర్యలు విషయం తెలిసిన తరువాత జిల్లాధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది క్రేన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. గ్యాస్ లీకై ఒక్క రవ్వ నిప్పు పడినా భస్మీపటలం సంభవిస్తుందనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల కరెంటును నిలిపివేశారు. ఎవరూ ఇళ్లల్లో అగ్గిపెట్టె వాడరాదని, వంటలు చేయరాదని ప్రకటించారు. బెళగావి నుంచి ధార్వాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. వేరే ట్యాంకర్‌ను తెప్పించి అందులోకి గ్యాస్‌ను డంప్ చేశారు. తరువాత ఖాళీ ట్యాంకర్‌ను క్రేన్లతో బయటకు లాగారు. ప్రజలు సహకరించారని జిల్లా ఎస్పీ డాక్టర్.సంజీవ్ పాటిల్ తెలిపారు. మొత్తానికి 16 గంటల పాటు అందరిని టెన్షన్ పెట్టిన గ్యాస్ ట్యాంకర్ ఉదంతం గురువారం మధ్యాహ్నంకల్లా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గంటల కొద్దీ వాహనాలను బంద్ చేయడంతో ప్రజలు, ఉద్యోగులు కాలినడకన సంచరించారు. ఇళ్లల్లో ప్రజలు వంటలు చేసుకోక ఆకలి బాధ అనుభవించారు. -
దక్షిణాఫ్రికాలో గ్యాస్ ట్యాంకర్ పేలి.. 9 మంది సజీవ దహనం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది సహా 9 మంది సజీవ దహనమయ్యారు. గౌటెంగ్ ప్రొవెన్షియల్ బోక్స్‌బర్గ్‌లోని రైల్వే వంతెన వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వంతెన కింది నుంచి వెళ్తున్న ట్యాంకర్‌కు పైకప్పు తాకడంతో అక్కడే నిలిచిపోయింది. దానికి అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే క్రమంలో పేలిపోయింది. -
విశాఖ: పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. గ్యాస్ లీక్..
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ ట్యాంకర్‌ను లిప్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిప్ట్ చేస్తుండగా ట్యాంకర్‌కు రంథ్రం ఏర్పడింది. ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్ సరాఫరా నిలిపివేశారు. ట్యాంకర్ పడిన ప్రాంతంలో కంపెనీలను అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో -
ఘోరం ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం
పోర్ట్–ఔ–ప్రిన్స్: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్–హైతియన్ నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనార్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!! -
ఘోర ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
క్రిష్ణగిరి: కృష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీని కారు ఢీనడంతో ఏడాది చిన్నారితో పాటు ఐదుగురు మృతి చెందారు. వివరాల మేరకు... బెంగళూరుకు చెందిన రమేష్ కుటుంబ సభ్యులు 8 మంది కలిసి తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో బంధువుల శుభకార్యానికి కారులో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం ఉదయం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. క్రిష్ణగిరి-హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద కారు అదుపుతప్పి పక్కనే నిలిపి ఉన్న ఖాళీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడాది బాలిక అంజలితో పాటు ఐదుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా డీఎస్పీ రాజు, రవాణాశాఖాధికారి బాలమురుగన్, కందికుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి గ్యాస్ ట్యాంకర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ బంక్ వద్ద పేలుడు.. 35మంది మృతి
అబుజా: ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ట్యాంకర్లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న కారు ఇద్దరి మృతి
వేలూరు: గ్యాస్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మురుగేషన్(60). ఇతని భార్య కోకిల. దంపతులు ఇద్దరు, వీరి బంధువులు రాజలింగం, ప్రేమ్‌తో కలిసి సేలం జిల్లా వెంకటగిరి ప్రాంతంలోని దేవి కరుమారియమ్మన్ ఆలయ దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం శనివారం ఉదయం సొంత గ్రామానికి కారులో బయలు దేరారు. ఆంబూరు సమీపంలోని చిన్న కామేశ్వరం వద్ద జాతీయ రహదారిలో కారు వెళుతుండగా అదుపుతప్పి ముందు వెళుతున్న గ్యాస్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో మురుగేషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రాజలింగంను సీఎంసీ ఆస్పత్రికి, ప్రేమ్, కోకిలను ఆంబూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రేమ్ మృతిచెందాడు. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. భయాందోళనలో వాహనదారులు
పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. కరీంనగర్-రాయపట్నం రహదారిలో విశాఖ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ ట్యాంకర్(కేఏ 01 ఏజీ 3552) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్లకు గాయాలు కాగా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
గ్యాస్ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో జాతీయరహదారిపై రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ట్యాంకర్లో ఉన్నది ఎల్పీజీ అని చెబుతున్నారు. అది లీకైతే పెను ప్రమాదం సంభవించి ఉండేది. డబుల్ లైన్ల రోడ్డు కావటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన ప్రజలు
గొల్లప్రోలు(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. గ్యాస్ లీక్ అవుతుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి సమీపంలోని గుమ్మళ్లదొడ్డి హెచ్‌పీ గ్యాస్ ఫిల్లింగ్‌స్టేషన్‌కు గ్యాస్ తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగనట్లు తెలిసింది. -
యా అల్లా.. ఏమిటీ ఘోరం!
అమ్మానాన్న.. చెల్లీతమ్ముళ్లకు టాటా చెప్పి.. వణుకుపుట్టిస్తోన్న ఉదయపు చలిలోనే రిక్షాలో స్కూల్ కు బయలుదేరారు 10 మంది చిన్నారులు. సందులో నుంచి మెయిన్ రోడ్డుపైకి వచ్చాక కుదుపులు లేకుండా సాఫీగా సాగుతున్న ఆ చిన్నారుల ప్రయాణం.. రోడ్డుకు అడ్డంగా పడిఉన్న ట్యాంకర్ దగ్గర ఆగింది. ఏం జరిరిగి ఉంటుందోనని ఊహించేలోపే అగ్గిరాజుకోవటం, భారీ శబ్ధంతో ట్యాంకర్ పేలిపోవడం.. మంటల్లో ఆరుగురు చిన్నారులు సహా 13 మంది సజీవదహనమైపోవడం క్షణాల్లో జరిగిపోయింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ షేక్ పూరాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పదుల మందిని పొట్టనపెట్టుకుంది. మొదట ఓ ఎస్సై, కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్నకారు.. ఎదురుగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ కూడా బోల్తాకొట్టి, కొద్ది సేపటికే పేలిపోయింది. ఆ సమయంలో ట్యాంకర్ పక్కనుంచి బైక్ రిక్షాలో స్కూలుకు వెళుతోన్న చిన్నారులు సహా 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన పొగమంచువల్లే ఎస్సై కారు డ్రైవర్ గ్యాస్ ట్యాంకర్ ను గమనించలేకపోయాడని, పొగమంచువల్లే రోడ్డుపై పడిఉన్న ట్యాంకర్ ను రిక్షా డ్రైవర్ గుర్తించలేకపోయాడని జిల్లా అత్యవసర అధికారి ఆజం చెప్పారు. పేలుడుతో భారీగా ఎగిసిపడ్డ మంటలను ఫైరింజన్లతో ఆర్పేశామని, ఆంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ 20 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు వెల్లడించారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా : ముగ్గురు మృతి
భువనేశ్వర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ ట్యాంకర్ లోని వాయివులు పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో కిలోమీటరు మేర నివాసం ఉంటున్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అనంతరం గ్యాస్ ట్యాంకర్‌ను రహదారిపై నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
గ్యాస్ ట్యాంకర్ పేలి... 100 మందికిపైగా మృతి
-
విశాఖ శివారులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
గ్యాస్ ట్యాంకర్ బీభత్సం...
- బైక్, కారు, రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసం - కూలిన ప్రహరీ - ఐదుగురికి గాయాలు - స్తంభించిన ట్రాఫిక్ బాలానగర్: గ్యాస్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది... అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని, కారును, రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొని తర్వాత ఓ ప్రహరీని గుద్దుకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం కారణంగా సుమారు 5 గంటల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడుకు చెందిన ఎల్పీ గ్యాస్ ట్యాంకర్ (టీఎన్88ఏ 5706) జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వెళ్తోంది. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ నర్సాపూర్ చౌరస్తా చిత్తారమ్మ బస్తీ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద అదుపుతప్పి.. ముందు వెళ్తున్న యాక్టివా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ బండిపై వెళ్తున్న అశోక్‌పాండే కిందపడిపోయాడు. ట్యాంకర్ మరికాస్తా ముందుకు వెళ్లి ఒక కారుతో పాటు ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందుకు వెళ్లి రోడ్డుపై నిలిపి ఉన్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎన్ఆర్ఎస్సీ ప్రహరీ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రహరీ కూలిపోయింది. కాగా, ప్రమాదం జరిగినప్పడు బస్సు లో ఉన్న 20 మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్పాండేకు తీవ్రగాయాలు కావడం తో బాలానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్యాంకర్లో ఎల్పీ గ్యాస్ ఉందని, ప్రమాదం జరిగినప్పడు గ్యాస్ లీక్ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐదు గంటలు ట్రాఫిక్ జామ్.... ఈ ప్రమాదం కారణంగా జీడిమెట్ల నుంచి బాలానగర్ వచ్చే వాహనాలు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రెండు ప్రొక్లైనర్లతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి
-
గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి
వెల్డింగ్ పనులు చేస్తుండగా ఘటన ముంబై: గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ట్యాంకర్ రెండు ముక్కలైపోయి చెల్లాచెదురైంది. వివరాల్లోకెళితే.. చెంబూర్ గడ్కరీ మార్గంపై ఉన్న ఓ గ్యారేజీలో మంగళవారం పేలుడు సంభవించింది. గ్యాస్ రవాణా చేసే ఖాళీ ట్యాంకర్‌కు మరమ్మతు పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో పేలిపోయింది. వెల్డింగ్ పనులు చేస్తున్న షఫిక్ షేక్(18) అనే వ్యక్తితోపాటు మరో 45 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్యారేజీలో పనిచేసే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. టాంకర్లో కొంచెం గ్యాస్ మిగిలిపోవడంతో వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పంటుకుని ట్యాకర్ పేలిపోయిందని బీఎంసీ డి జాస్టర్ కంట్రోల్ సంస్థ తెలిపింది. ఈ ఘటనలో చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదు. టాటాపవర్‌కు చెందిన పవర్‌లైన్ ఓవర్‌హెడ్‌కు నష్టం జరిగినట్లు పేర్కొంది. తృటిలో తప్పిన పెను ముప్పు ట్యాంకర్ పేలుడు జరిగిన స్థలానికి సమీపంలోనే హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీకి చెందిన స్టోరీజీ సెంటర్ ఉంది. అక్కడ వేల లీటర్ల పెట్రోల్ స్టోర్ చేస్తుంటారు. పేలుడు జరిగినపుడు అగ్నికీలలు అక్కడివరకు చేరుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండేది. -
ఆయిల్ కార్పొరేషన్ ట్యాంకర్ బోల్తా
విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున నాపయ్యపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. గ్యాస్ లారీ కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడపడమేనని పోలీసుల సమాచారం. (గాజువాక) -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా డ్రైవర్ మృతి
విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ని ఆసుపత్రి తరలిస్తుండగా మరిణించాడు. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని సోమవారం తెల్లవారుజామున ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. -
ట్యాంకర్ కిందపడి మహిళ మృతి
గ్యాస్ ట్యాంకర్ కిందపడి ఒక మహిళ మృతిచెందిన సంఘటన హైదరాబాద్‌లోని మౌలాలిలో జరిగింది. మౌలాలిలోని ఓ పెట్రోలు బంకు వద్ద గ్యాస్ ట్యాంకర్ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు చక్రాల కిందపడి మీణమ్మ(55) మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మీణమ్మ మౌలాలీలోని హనుమాన్‌నగర్ నివాసి అని వారు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టిన టిప్పర్
హైదరాబాద్:హయత్ నగర్ అబ్దుల్లాపూర్ వద్ద టిప్పర్ గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ కూడా లోపల ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.వాహనాలలోని ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఖాళీ ట్యాంకర్ అని పోలీసులు చెబుతున్నారు. గ్యాస్ లీక్ అనేది వాస్తవం కాదని చెప్పారు. -
భయం...భయం
విజయనగరం కంటోన్మెంట్/క్రైం : అందరిలో ఒకటే టెన్షన్... ఏ క్షణం ఏమవుతుందోనని భయాందోళన... ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు... బతికితే చాలు దేవుడా అంటూ ప్రార్థనలు చేశారు...పోలీసులు తీవ్ర హైరానాకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పరుగులు పెట్టారు. జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. 40 టన్నుల బరువున్న గ్యాస్ ట్యాంకర్ ఆర్అండ్బీ కూడలి వద్ద మలుపులో పెద్ద శబ్దంతో బోల్తాపడి, అందులోంచి గ్యాస్ లీక్ అవుతోందన్న సమాచారం తెలిసిన వెంటనే ఇటు పోలీసులు, అటు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను అటు వైపుగా వెళ్లకుండా నిరోధించారు. ట్యాంకర్ పేలితే సుమారు కిలోమీటర్ దూరం వరకూ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు తెలపడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను మళ్లించారు. రెవెన్యూ, అటవీ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చుట్టపక్కల ఉన్న హోటళ్లు, పాఠశాలలు, దుకాణాలు, రైతుబజార్లు, కార్యాలయాలను మూయించి వేశారు. దూరంగా వెళ్లమంటూ మైకుల్లో ప్రచారం చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలతో ప్రజలు ఏమవుతుందోనని ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. చాలా మంది బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. సంఘటన పూర్వాపరాలివి పట్టణంలోని ఆర్అండ్బీ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్యాస్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు గ్యాస్ ట్యాంకర్ సుమారు 40 టన్నుల లోడ్‌తో వెళ్తోంది. ఆర్అండ్బీ రహదారి జంక్షన్ జాతీయ రహదారి 26 మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద శబ్దంతో బోల్తాపడింది. ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.అమ్మినాయుడుకు సమాచారం అందడంతో వెంటనే ట్రాఫిక్ సీఐ ఎ.రవికమార్కు సమాచారమందించారు. ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్ వద్దకు వెళ్లి చూడగా గ్యాస్ ప్రమాణాన్ని నిర్దేశించే మీటర్ (ప్రెజర్ వాల్వ్) ఊడిపోవడంతో అందులో నుంచి గ్యాస్ లీకైంది. వేకువ జామున సమీపంలోని దుకాణం వద్ద నుంచి తెచ్చిన గోధుమపిండి ముద్దను లీకవుతున్న వాల్వ్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటించాడు. కొంతవరకు గ్యాస్ లీకవ్వడం తగ్గింది. మంగళవారం ఉదయాన్నే గ్యాస్ లీకవుతున్న ప్రాంతం వద్ద ఎంసీల్ వేశారు. ఉదయం 6 గంటలకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాద్‌రావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలు చెలరేగితే ఆర్పేందుకు ఫామ్ వాటర్‌ను సిద్ధంగా ఉంచారు. వెంటనే విశాఖపట్నంలో ఉన్న ఐఓసీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం పది గంటల వరకూ ఆ రోడ్డులో వాహనాల రాకపోక లు సాగించాయి. ఐఓసీ అధికారుల సమాచారంతో భీతిల్లిన జనం గ్యాస్ ట్యాంకర్ పెలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు చెప్పడంతో అధికారులందరూ ఒక్కసారిగా అప్రమత్తయ్యారు. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలయ్యపేట మలుపు వద్ద బోర్డులు పెట్టి వాహనాలను మళ్లించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ రవికుమార్ ఆర్అండ్బీ జంక్షన్ నాలుగు వైపుల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్అండ్బీ సమీపంలో ఉన్న వ్యాపార సముదపాయాలు, పాఠశాలలు, రైతు బజార్లను, ఇళ్లల్లో ఉన్నవారిని దూరంగా వెళ్లిపోవాలని మైకులో ప్రచారం చేశారు. ఆర్‌అండ్‌బీకి కిలోమీటర్ దూరంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్యాస్ ట్యాంకర్ పడిన ప్రాంతంలో ఎవరూ సిగరెట్ తాగరాదని, సెల్ఫోన్లు వినియోగించరాదని, నిప్పు రగిలించే ఏ వస్తువులు వాడకుండా ఉండాలని సూచించారు. ఆలస్యంగా వచ్చిన ఐఓసీ అధికారులు గ్యాస్ ట్యాంకర్‌ను పరిశీలించడానికి ఐఓసీ అధికారులు సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం 7.30 నుంచి ఐఓసీ అధికారులకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రసాద్లు ఫోన్లో సంప్రదిస్తున్నా అదిగో వస్తున్నాం..ఇదిగో వస్తున్నాం.. అంటూ కాలయాపన చేశారు. 11 గంటల ప్రాం తంలో ఐఓసీ అధికారులు శివరామకృష్ణ తదితరులు వచ్చి బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పరి శీలించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని, ఒక వేళ గ్యాస్ లీకయితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెప్పడంతో ప్రజలను దూర ప్రాం తాలకు వెళ్లాలని సూచించారు. 40 టన్నుల బరువు గ్యాస్ ట్యాంకర్ లారీ బరువు సుమారు 40 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఐఓసీ గ్యాస్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ సామర్థ్యం 32 టన్నులని అధికారికంగా చెప్పినప్పటికీ ట్యాంకర్లో అధికస్థాయిలో గ్యాస్ ఫిల్లింగ్ చేసి ఉండవచ్చని, అందుకే వేగంగా వెళ్తున్న ట్యాంకర్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడిందని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటవెంటనే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలను, సమీపంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును, తొలగించే ఏర్పాట్లు ఏవిధంగా చేస్తున్నారని డీఎస్పీ ఎస్.శ్రీనువాస్‌ను అడిగితెలుసుకున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాదరావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. ఆ శాఖకు చెందిన 40 మంది సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎన్హెచ్ఎ రోడ్ల ఎస్ఐ పి.డి.విజయ్‌కుమా ర్, ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ హేమసుందర్ ఆదేశాల మేరకు విపత్తుల నివారణ జిల్లా అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది సూర్యప్రకాష్, రామకృష్ణ, మురళీ ప్రజలను అప్రమత్తం చేశారు. పైకి ఎత్తలేకపోయిన మూడు క్రేన్లు బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పైకి ఎత్తేందుకు జిల్లా అధికారులు అందుబాటులో ఉన్న క్రేన్లను తెప్పించా రు. విజయనగరంలో ఉన్న 14 టన్నులు ఒకటి, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్లను అధికారులు రప్పించారు. ఈ మూడు క్రేన్లు బోల్తాపడిన లారీని పైకి ఎత్తలేకపోయాయి. చాలా సేపు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరీ ఎక్కువగా ప్రయత్నిస్తే స్పార్క్‌లు వచ్చే ప్రమాదం ముందని భావించిన అధికారులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. వాటిని వెనక్కి పంపించి వేసిన తరువాత విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఒక్కొక్కటీ 14 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు క్రేన్లను రప్పించి ట్యాంకర్ పైకి లేపారు. ట్యాంకర్నుపైకి లేపే సమయంలో జరగరానిది జరగుతుందేమోనని అధికారులు భయపడ్డారు. రాత్రి 7 గంటలకు ట్యాంకర్‌ను యథాతధ స్థితిలోకి తీసుకు వచ్చిన అక్కడ నుంచి కొంతదూరం తరలించారు. తప్పిన పెను ప్రమాదం.. ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయాల్లో ఎవరైన కాల్చిన సిగరేటు, నిప్పురవ్వలు లాంటికి వేస్తే ట్యాంక్ పేలి పెను ప్రమాదం సంభవించేది. అంతేగాకుండా ట్యాంకర్ లారీ బోల్తాపడిన ప్రాంతం మీదుగా మంగళవారం ఉదయం 9 వరకు అనేక వాహనాలు ప్ర యాణించాయి. వాటి నుంచి వచ్చిన నిప్పురవ్వలకు బోల్తాపడిన ట్యాంకర్ పేలితేకిలోమీటర్ వరకు తీవ్రంగా, ఐదు కిలోమీటర్ల సాధారణంగా దీని ప్రభావం ఉండేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
గ్యాస్ ట్యాంకర్ పేలి 8 మంది సజీవ దహనం
ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్‌తో నిండిన ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి. -
పేలిన గ్యాస్ ట్యాంకర్ 8మంది సజీవ దహనం
సాక్షి, ముంబై: ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్‌తో నిండిన ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. అనంతరం ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అనేకమంది ఉలిక్కిపడ్డారు. దీని నుంచి తేరుకునేలోపే అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి. -
ఆటోను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్
అశ్వాపురం, న్యూస్‌లైన్ మరో పదిహేను కిలోమీటర్లు వెళితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకుని ఉండేవారు... కానీ విధి వక్రించింది.. గ్యాస్ ట్యాంకర్ మృత్యువు రూపంలో వచ్చి ఇద్దరిని కబళించి పలువురిని క్షతగాత్రులను చేసింది. అశ్వాపురం మండలంలోని సీతారామపురం వద్ద సోమవారం ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ వేగంగా టాటా మ్యాజిక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటన స్థలంలో మృతి చెందగా మరొకరు భద్రాచలంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం రక్త సిక్తంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం నుంచి ప్రయాణికులతో మణుగూరుకు వస్తున్న టాటా మ్యాజిక్ ఆటోను మండలంలోని సీతారామపురం వద్ద మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అమ్మగారిపల్లికి పంచాయతీ బట్టామల్లయ్య గుంపునకు చెందిన బట్టా మంగయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయవాడకు చెందిన ఎస్కే ఖలీల్(28) భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిట్టగూడేనికి చెందిన తాటి ఎర్రమ్మ, మిడియం లక్ష్మి, జిమ్మా జానకమ్మ, మణుగూరు మండలం శివలింగాపురానికి చెందిన సియాల పాపరావు, తాటిగడప గ్రామానికి చెందిన దార్ల హరికృష్ణ, మ్యాజిక్ డ్రైవర్ కర్నే దిలీప్‌కుమార్, మహేష్‌లు గాయపడ్డారు. సమాచారం అందుకున అశ్వాపురం సీఐ వేణుచందర్ హుటాహుటీన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.