గ్యాస్ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గ్యాస్ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో జాతీయరహదారిపై రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ట్యాంకర్‌లో ఉన్నది ఎల్పీజీ అని చెబుతున్నారు. అది లీకైతే పెను ప్రమాదం సంభవించి ఉండేది. డబుల్ లైన్ల రోడ్డు కావటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.