
భార్య కీర్తితో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి త్రినాథరావు
సాక్షి, బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి ధుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్సై ఆర్.వాసుదేవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన అడ్డు త్రినాథరావు (30) జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీలో జవానుగా పని చేస్తునట్లు తెలిపారు. మృతునికి విజయనగరం బొగ్గులుదిబ్బలో ఉంటున్న తన అక్క కూతురైన కీర్తిని 2018 సంవత్సరంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
ఆరు రోజులు కిందట శెలవులపై వచ్చిన అతను ద్విచక్ర వాహనంపై విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు వస్తుండగా గొట్లాంకు సమీపంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు చెప్పారు. దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
చదవండి: (ఆ పతంగి దారం అతని గొంతును కోసేసింది.. అదృష్టవశాత్తు భార్యకు..)
శోక సముద్రంలో కుటుంబాలు
అటు త్రినాథరావు స్వగ్రామం నెల్లిమర్లలోని గాంధీనగర్‌లోను, ఇటు తన అక్క ఉంటున్న విజయనగరంలోని బొగ్గులదిబ్బలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రిస్మస్ పండుగకు వీలు చేసుకోని రావాలని తన తమ్ముడు, అల్లుడు అయిన త్రినాథరావుకు ఫోన్‌చేసి చెప్పినప్పటికీ శెలవులు ఇస్తే వస్తానని చెప్పిన వాడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా ఆసుపత్రి వద్ద రోదించారు.
చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)
Comments
Please login to add a commentAdd a comment