
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది సహా 9 మంది సజీవ దహనమయ్యారు. గౌటెంగ్ ప్రొవెన్షియల్ బోక్స్‌బర్గ్‌లోని రైల్వే వంతెన వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వంతెన కింది నుంచి వెళ్తున్న ట్యాంకర్‌కు పైకప్పు తాకడంతో అక్కడే నిలిచిపోయింది. దానికి అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే క్రమంలో పేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment