Burning alive
-
సూడాన్‌లో కూలిన సైనిక విమానం
కైరో: సూడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ సమీప పట్టణంలో సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. విమానం జనావాసాలపై కూలడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక యంత్రాంగం ప్రకటించింది. ఓమ్డర్మ్యాన్ సిటీకి ఉత్తరాన ఉన్న వాడీ సయిద్నా వైమానిక స్థావరం నుంచి మంగళవారం రాత్రి టేకాఫ్ అయిన ఆంటోనోవ్ రకం సైనిక విమానం కొద్దిసేపటికే కర్రారీ జిల్లాలోని జనావాసాలపై కూలింది. విమానంలో ప్రయాణిస్తున్న ఆర్మీ సీనియర్ కమాండర్ బహర్ అహ్మద్, సైనిక అధికారులతోపాటు జనావాసంలోని సాధారణ ప్రజలూ ప్రాణాలు కోల్పోయారని ఖార్టూమ్ మీడియా కార్యాలయం తెలిపింది. ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
అత్తామామల కళ్లెదుటే.. భార్యను సజీవదహనం చేసిన భర్త
ఓదెల(పెద్దపల్లి): అదనంగా రూ.5 లక్షల కట్నం తేవడం లేదనే ఆగ్రహంతో భర్త, బావ, తోటికోడలు, అత్తామామ కలిసి వివాహిత యాట లావణ్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్లు నేరం రుజు వు కావడంతో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ శనివారం తీర్పు వెలువరించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీ పీ గజ్జి కృష్ణ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామానికి చెందిన యాట కుమారస్వామి పెద్దకూతురు యాట లావణ్యను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామానికి చెందిన వీర్ల రవీందర్‌కు 2013లో ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10లక్షల కట్నం, పది తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంఛనాలు అప్పగించారు. మూడు నెలల తర్వాత అదన ంగా రూ.ఐదు లక్షల కట్నం కావాలని భర్త రవీందర్, అత్తామామలు రాజమ్మ, కొమురయ్య, బావ కు మారస్వామి, తోటికోడలు భారతి కలిసి లావణ్య ను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభిమచారు. ఈక్రమంలో 2014 మే 16వ తేదీన లా వణ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలు తల్లితండ్రులతో కలిసి కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేశారు. లావణ్యను ఇకనుంచి బాగా చూసుకుంటామని చెప్పడంతో తల్లితండ్రులు ఆమెను అత్తగారింటికి పంపారు. కొద్దికాలం త ర్వాత తనకు విడాకులు కావాలని భర్త కోర్టుకు వె ళ్లాడు. ఈక్రమంలోనే 25 సెప్టెంబర్ 2014న అదనపు కట్నం తేవాలని ఐదుగురు కలిసి లావణ్యను కొట్టారు. ఈవిషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తన తల్లిదండ్రుకు చెప్పింది. వారు వెంటనే కొలనూరు గ్రామానికి చెరుకున్నారు. ఇక్కడుంటే లావణ్య ప్రాణానికి ముప్పు ఉంటుందని భావించి, త మతో రావాలని కూతురుకు తల్లిదండ్రులు సూచించారు. లావణ్య బట్టలు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోకు వెళ్లగానే భర్త, అత్తామామ, బావ, తోటికోడలు కలిసి ఇంట్లోకి వెళ్లి లావణ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఈ అఘాయిత్యం జరిగింది. అయితే, తీవ్రంగా గాయపడిన లావణ్యను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ 28 సెప్టెంబర్ 2014న మృతిచెందింది. మృతురాలి లావణ్య తండ్రి యాట కుమారస్వామి ఫిర్యా దు మేరకు అప్పటి ఏసీపీ వేణుగోపాల్‌రావు కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాహలు చేశా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, డీసీపీ చేతన, ఏసీ పీ కృష్ణ పర్యవేక్షణలో కోర్టులో సాక్షలను ప్రవేశ పె ట్టారు. నేరం రుజువు కావడంతో భర్త, అత్తామామ, బావ, తోటికోడలుకు పదేళ్ల కారగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పు మొత్తం రూ.30వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సాక్షులను ప్రవేశపె ట్టడానికి సహకరించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీని వాస్‌ను రాంగుండం సీపీ శ్రీనివాస్ అభినందించారు. -
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కారులోనే యువకుడి సజీవ దహనం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్ధరాత్రి ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధమై యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. సూర్యపేట జిల్లా జ్యోతినగర్, నాయనగర్ ప్రాంతానికి చెందిన బడుగుల వెంకటేశ్ (25) శనివారం సాయంత్రం సూర్యపేట నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడకు కారులో బయలుదేరాడు. బొంగ్లూర్ సమీపంలోని శ్రీశ్రీ ఎరోలైట్స్ వద్దకు రాగానే కారు ఆపి సీటు వెనక్కి తీసుకొని నిద్రిస్తున్నాడు. అంతలోనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్పటికే నిద్రలో ఉన్న వెంకటేశ్ కారులోనే ఉండిపోయాడు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయని అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న వెంకటేశ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. క్లూస్ టీం సహకారంతో కారు నంబర్ గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్నది బడుగుల వెంకటేశ్(25)గా నిర్ధారించారు. వెంకటేశ్ కొద్ది రోజుల్లో ఉన్నత చదువుల నిమిత్తం కెనడాకు వెళ్లనున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు. -
టీడీపీ సర్పంచ్ చేతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. ఇటీవల కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ మూకల దాడులను మరిచిపోకముందే మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అన్నెంపున్నెం ఎరుగని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై పెట్రోల్ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చాణక్య ప్రతాప్, రుపంజయ తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సొంత అల్లుడు సంజీవ్‌కు స్వయానా బాబాయి కుమారులే కావడం గమనార్హం. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లతోనూ నిందితులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ చౌదరితోనూ పరిచయాలు ఉన్నాయి. రాజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పిలిపించి అతడిని టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు చాణక్య ప్రతాప్ సజీవ దహనం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచెమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం కుమారులు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్ తమ్ముడు రుపంజయ భార్యతో పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుపంజయ ఎలాగైనా పురుషోత్తంను మట్టుపెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నం టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, అతడి తమ్ముడు రుపంజయ.. నాగరాజు కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాగరాజు తన పొలం వద్ద ఏర్పాటు చేసిన పైపులను పగలకొట్టడం, చెట్లు నరికివేయడం, మోటార్లను కాల్చివేయడం వంటివి చేసి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తంను హతమార్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని తిరుపతి అవిలాలలో నివాసం ఉంటూ వర్క్‌ఫ్రమ్ హోం చేసుకుంటున్న నాగరాజును గోపి అనే వ్యక్తితో పిలిపించారు. దీంతో శనివారం సాయంత్రం నాగరాజు తన కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, రుపంజయ, వారి అనుచరులు గోపి, సుబ్బయ్యతోపాటు మరికొంతమంది నాగరాజుతో మాట్లాడారు. ఆ తర్వాత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గంగుడుపల్లి సమీపంలోని కురవకణం మలుపు వద్దకు తీసుకెళ్లి నాగరాజు కారులోనే అతడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఉదంతం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటరావు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, సీఐ ఓబులేసు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణక్య ప్రతాప్, రుపంజయ, గోపి, సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు రుపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టీడీపీ నేతల హస్తం! కాగా నాగరాజు హత్యలో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. హత్యకు పాల్పడిన చాణక్య ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ ఇద్దరు నేతలు హత్యకు సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం. -
చంద్రగిరి నాగరాజు ఘటన..నిజాలు బయటపెట్టిన నాగరాజు భార్య
-
కారులో సజీవ దహనం కేసులో ఊహించని ట్విస్ట్
-
ప్రమాదమా.. తగలబెట్టారా?
టేక్మాల్(మెదక్): కారులో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరపగా కారులో దహమైన వ్యక్తిని వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని బీమ్లాతండాకు చెందిన పాత్లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. అల్లాదుర్గం సీఐ జార్జ్ కథనం ప్రకారం.. పాతులోత్ ధర్మానాయక్ (48) రాష్ట్ర సచివాలయంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామం వచ్చారు. 6వ తేదీన తన మిత్రులతో కలసి బాసరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆదివారం రాత్రి భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో సోమ వారం ఉదయం గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దు స్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కారులో ధర్మానాయక్ సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవ రైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు జార్ఖండ్‌లోని ఐఐటీలో విద్యన భ్యసిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
దక్షిణాఫ్రికాలో గ్యాస్ ట్యాంకర్ పేలి.. 9 మంది సజీవ దహనం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది సహా 9 మంది సజీవ దహనమయ్యారు. గౌటెంగ్ ప్రొవెన్షియల్ బోక్స్‌బర్గ్‌లోని రైల్వే వంతెన వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వంతెన కింది నుంచి వెళ్తున్న ట్యాంకర్‌కు పైకప్పు తాకడంతో అక్కడే నిలిచిపోయింది. దానికి అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే క్రమంలో పేలిపోయింది. -
‘సజీవ దహనం’ హత్యగానే భావిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ‘ఆరుగురు సజీవ దహనం’ కేసును విచారణ చేస్తున్నాం. మా ప్రాథమిక విచారణ లో దీనిని హత్యగానే భావిస్తున్నాం. ఆ కోణంలోనే విచారణ సాగుతోంది. అందులో ఎంతమంది ఉన్నారో త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాం’ అని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామగుండం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితులు వాడిన పెట్రోల్ క్యాన్లు, పరిసర స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌రావు ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటాపూర్ (గుడిపెల్లి) ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్...: సోమవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ప్రధాన నిందితులు ముగ్గురితో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. రెండు గంటలపాటు నిందితుల సమక్షంలోనే నేరం జరిగిన తీరు తెలుసుకున్నారు. ఇల్లు కాలిపోయిన చోటికి రెండు వాహనాల్లో వెళ్లారు. ఎవరు సాయం చేశారు? పెట్రోల్ క్యాన్లను ఎలా తీసుకెళ్లారనే విషయాలను నిందితులు వివరించగా, వాటిని ఘటన స్థలంలోనే మరోమారు ధ్రువీకరించుకుని రికార్డు చేశారు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. ప్రమాద ఘటనలో క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అవ్వగా, ఆసుప్రతికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి! -
మాల్దీవుల్లో ఘోరం
మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్ పక్కన ఒక గ్యాస్ సిలిండర్ ఉంది. ఫ్లోర్ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు. -
పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది. బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్ ఎస్సై జనార్ధన్ గౌడ్ వెల్లడించారు. -
అత్యాచారం.. ఆపై నిప్పు
బండా (ఉత్తరప్రదేశ్): ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే అలాంటి దారుణం శనివారం యూపీలోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరపు బంధువు ఒకరు ఆమెను రేప్ చేసి, ఆమెకు నిప్పంటించాడు. బాధితురాలి ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను దగ్గరలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో 90% కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. -
దారుణం: వివాహిత సజీవ దహనం
సాక్షి, గాజువాక: రాజీవ్‌నగర్ దరి యాతపాలెంలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి అనుమానం రాకుండా ఉండేందుకు తగులబెట్టారా.. మరేమైనా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో పిల్లలు పక్కింట్లో ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. దువ్వాడ పోలీసుల కథనం ప్రకారం.. మిందికి చెందిన తాటిశెట్టి శ్రీనివాసరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నా డు. కూర్మన్నపాలేనికి చెందిన సరోజినిని 2012లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం రాజీవ్‌నగర్ దరియాతపాలెంలో నివాసముంటున్నారు. శ్రీనివాసరావు ఎప్పటి మాదిరిగానే శనివారం జనరల్ షిఫ్ట్ విధులకు వెళ్లాడు. తనపై ఎవరో దుప్పటి కప్పి పీక నులిమారంటూ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సరోజిని తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ఫోన్ కట్ అవడంతో అతడు తిరిగి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ కావడంతో డ్యూటీలో పర్మిషన్ పెట్టుకుని హడావుడిగా వచ్చాడు. అప్పటికే ఇంటి బెడ్రూమ్లో మంటలు వ్యాపించి ఉన్నాయి. దీన్ని గమనించిన స్థానికులు అటు పోలీసులకు, ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే గది మొత్తం దగ్ధమైంది. ఆ మంటల్లో సరోజని పూర్తిగా కాలి బూడిదైంది. ఆనవాళ్లు కూడా దొరకనంతగా కాలిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో బంగారం కోసం ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. అనే కోణంలో వివరాలు సే కరిస్తున్నారు. ఆమెను హత్య చేసి అనుమానం రాకుండా తగులబెట్టారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనం పెట్రోలు పైప్ లాగేసి ఉండటంతో ఈ అనుమానానికి బలం చేకూర్చుతోంది. ఇంట్లో బంగారం కనిపించడం లేదు. అయి తే మంటల వేడికి బంగారం కరిగిపోయిందా, లేదా బంగారం కోసమే ఈ హత్య జరిగిందా అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ సైతం భద్రంగా ఉండటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, దువ్వాడ సీఐ టి.లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకు ని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తన విచార ణ కొనసాగించింది. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ నాయకులు దామా సుబ్బారావు ఆచార్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కన్నపేగునే కబళించారు!
సాక్షి, దామెర(వరంగల్) : మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలనార్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్సై భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గ్రామస్తులు మహేశ్ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దారుణం: కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు
సాక్షి, వరంగల్ : జిల్లాలోని దామెర మండలం ముస్తాలపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని చేతులు కట్టేసి తల్లిదండ్రులే సజీవ దహనం చేశారు. కొడారి ప్రభాకర్, వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లి అయింది. కొడుకు, కూతురు ఉన్నారు. గొడవల కారణంగా కొన్నేళ్ల క్రితమే రజిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గుమాస్తాగా పనిచేస్తున్న మహేష్.. మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి చిత్రహింసలు చేయడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ క్రమంలోనే మహేష్ చేతులు కట్టేసి కిరోసిన్ పోసి తగులపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
తహశీల్దార్ హత్యపై కేసీఆర్ విచారం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
తహశీల్దార్ సజీవ దహనం : నిందితులపై కఠిన చర్యలు..
-
దారుణం; తహశీల్దార్ సజీవ దహనం
-
దారుణం; తహశీల్దార్ సజీవ దహనం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు.. తహశీల్దార్ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. -
మంటల్లో మానవత్వం!
‘తన తప్పేమీ లేకపోయినా అనుకోని ఆపదకు గురై.. అతికష్టం మీద కోలుకుని బతుకుతున్న మనిషికి తోటి వారి నుంచి ఓదార్పు అందాలి. సాంత్వన లభించాలి. అప్పుడే ఆ చేదు జ్ఞాపకాల గాయం మానుతుంది. ఆ మనిషి జీవనయానం గాడిలో పడుతుంది. కానీ అలా జరగడం లేదు. మంటల్లో చిక్కుకుని చచ్చిబతికిన మనిషి కాలిన గాయాలకు మందు పూయాల్సిన సమాజం మరింతగా ఆ మంటను రాజేస్తోంది. చీత్కారపు చూపులతో కొందరు.. అంటరానివారుగా చూస్తున్నవారు మరికొందరు. శరీరం కాలిన మనిషి బాధను రెట్టింపు చేస్తూ మనసునూకాల్చేస్తున్నారు. తమ తప్పేమీ లేకపోయినా సమాజం ఎందుకిలా ఈసడించుకుంటోంది.. తమను ఇంతలా దూరం ఎందుకు పెడుతోంది? చావకుండా బతికి ఉండడమే మా తప్పా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్నింగ్ బాధితులు. కాలిన గాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతూ సమాజం వివక్షకు గురవుతున్న వ్యధార్త జీవిత యథార్థ గాథలెన్నో.. ఎన్నెన్నో. హిమాయత్‌నగర్ :నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో హాస్టల్ ఉండటానికి అనేక ఇబ్బందులు పడ్డాను. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా నా రూమ్మేట్స్ డోర్ లాక్ చేశారు. క్యాబ్ ఎక్కేందుకు రోడ్డుపైకి వెళ్తుండగా నా ముఖ ఆకారాన్ని చూసి ఓ చిన్నపిల్లాడు రాయి తీసుకుని కొట్టాడు. ఆ సమయంలో చచ్చిపోవాలన్నబాధ కలిగింది. మాలాంటివారికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలిచ్చేందుకు సైతం వెనకాడుతుండటం వివక్షకు అద్దం పడుతోంది. ఒళ్లు కాలిన వారు మనుషులు కాదా? సాటి మనిషిని మరో మనిషిలా చూడకపోవడం, గుర్తించకపోవడం చాలా బాధగా ఉంటోంద’ని ఆవేదన వ్యక్తంచేశారు ‘బర్న్ సర్వైవర్ మిషన్, సర్వైవర్ ట్రస్ట్’వ్యవస్థాపకురాలు నిహారీ మండలి. ఉద్యోగం ఇవ్వలేమని బయటికి పంపించారు.. ఎనిమిదేళ్ల ప్రాయంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాను. శరీరం 50శాతం కాలిపోయింది. దీంతో నన్ను స్కూల్లో దగ్గరకు రానిచ్చేవాళ్లు కాదు. కాలేజీలో అసహ్యంచుకునే వాళ్లు. అన్నీ ఎదుర్కొని మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేసి ప్రొద్దుటూరు నుంచి హైదరాద్‌కు వచ్చాను. ఓ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాను. అన్ని రౌండ్స్‌లో సక్సెస్ అయ్యాను. ఇంటర్వ్యూ సమయంలో నేను ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నాను. అపాయిట్మెంట్ లెటర్ చేతికి ఇచ్చే సమయంలో స్కార్ఫ్ తీయమన్నారు. నా ముఖం చూసిన తర్వాత ‘సారీ నీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేం. ఇస్తే మిగతా వాళ్లు చేయలేరు’ అంటూ బయటకు పంపించారు. – వరప్రసన్న లక్ష్మి, ప్రొద్దుటూరు దేశవ్యాప్తంగా ప్రతి ఏటా పది లక్షల మంది అగ్ని ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో కొందరు వంట చేసేటప్పుడు గ్యాస్ లీకై, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో గడ్డి కోసేటప్పుడు కరెంట్ షాక్‌కు గురై, కరెంట్ స్తంభాలపై మరమ్మతులు చేస్తూ, యాసిడ్ దాడికి గురై, దురదృష్టవశాత్తు ఇళ్లు దగ్ధమై.. ఇలా పలు ఘటనల్లో మంటల్లో చిక్కుకున్న బాధితులుకు సరైన శస్త్రచికిత్స అందక ప్రతి ఏటా అక్షరాలా 1.4 లక్షల మంది మృత్యువాత పడుతుండగా.. 2.4 లక్షల మంది వైకల్యంతో బతుకీడుస్తున్నారు. రూ.2,933 కోట్లు విడుదలైనా.. కాలిన గాయాల బారిన పడి వైకల్యంతో బాధపడేవారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారి దీనస్థితిని చూసి దేశవ్యాప్తంగా ఉన్న 150 ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అన్ని జిల్లాల వైద్యశాలల్లో బర్న్ ఎక్వీప్మెంట్ ఉండాలని, స్పెషల్ బర్న్ వార్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్రప్రభుత్వం 2015లో ‘నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెంటేషన్ ఆఫ్ బర్న్ ఇంజ్యూరీస్’ ద్వారా రూ.2,933 కోట్లు విడుదల చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ నిధులతో అవసరమైన కొన్ని హాస్పిటల్లు మినహా ఇతర వాటిలో బర్న్ ఎక్వీప్మెంట్ ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ప్రత్యేకంగా బర్న్ వార్డ్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి.. కాలిన వారి కోసం ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డ్ ఉంటుంది, ఎక్వీప్మెంట్ ఉంటుంది. సరైన రీతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. దీనికి అగ్నిమాపక శాఖ సహకరించాలి. 5కే, 2కే రన్, సెమినార్లు లాంటివి నిర్వహించాలి. శరీంరం కాలిపోయిన వారికి బతుకుపై ఆసక్తిని కలిగించాలి. సమాజంలో సాటి మనుషులుగా> గుర్తించే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికీ కలిగేలా పూర్తిస్థాయిలో అవగాహన ర్యాలీలు, సదస్సులు చేపట్టాలి. శరీర భాగాలు కాలిన బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలి. సాటి మనుషులుగా గుర్తించండి.. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలేదు. మా తలరాత బాగోక కాలిపోయాం. కాలక ముందు.. కాలిన తర్వాత జీవితం చాలా వేరు. మా బతుకు మేం బతుకుతామన్నా ఈ సమాజం బతకనివ్వట్లేదు. హాస్టల్లో ఉండనివ్వట్లేదు. ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు. ముఖానికి స్కార్ఫ్ లేకుండా బయటకు వస్తే గ్రహాంతర వాసుల్లా చూస్తూ రాళ్లతో కొడుతున్నారు. ఎందుకు మాపై ఈ వివక్ష? మా జీవితాన్ని మేం బతుకుతాం. మేమూ మనుషులమే. మమ్మల్ని సాటి మనుషులుగా గుర్తించండి ప్లీజ్.– నిహారీ మండలి -
కరెంట్ షాక్! క్షణాల్లో వ్యక్తి సజీవ దహనం
-
ఆటోలో వ్యక్తి సజీవదహనం
నెల్లూరు: జిల్లాలోని దగదర్తి మండలం కౌరుగుంట వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. గ్రామ శివారులోని ఓ ఆటోలో గుర్తుతెలియని వ్యక్తిని సజీవదహనం చేశారు. ఆటోలో కాలిన మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు!
ఒక హిందీ పత్రికలో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులపై పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేసి, వారిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరిగింది. వాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన జర్నలిస్టులు.. అక్కడకు దగ్గర్లోనే ఉన్న తమ కార్యాలయంలో దాక్కున్నారు. అయినా, దాడి చేసిన వాళ్లు మళ్లీ అక్కడకు కూడా వచ్చి వారిని, మిగిలిన సిబ్బందిని కూడా తీవ్రంగా కొట్టారు. తర్వాత ఎవరో పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి అందరినీ కాపాడారు. తాము సివిల్ లైన్స్ ఏరియాలోని పెట్రోలు బంకుకు వెళ్లి రూ. 200కు పెట్రోలు పోయించుకున్నామని, వాళ్లకు పది రూపాయల నాణేలు 20 ఇచ్చామని బాధిత జర్నలిస్టులలో ఒకరైన కృష్ణకాంత్ గుప్తా తెలిపారు. అయితే బంకు సిబ్బంది మాత్రం తమకు నాణేలు వద్దని, నోట్లు ఇవ్వాలని అడిగారు. పది రూపాయల నాణేలు చెల్లుతున్నప్పుడు వాటిని ఎందుకు తీసుకోరని జర్నలిస్టులు వాళ్లను ప్రశ్నించగా.. పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన చూసి దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు అక్కడకు రాగా, మొత్తం నలుగురిపై బంకు సిబ్బంది పెట్రోలు పోసి, తమను సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కృష్ణకాంత్ చెప్పారు. -
మంటల్లో ‘కావేరి’ బస్సు
•నాలుగేళ్ల హైదరాబాద్ బాలుడి సజీవ దహనం •షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా దుర్ఘటన •ఐదుగురికి గాయాలు కర్ణాటక సరిహద్దులో ఘటన •డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం సాక్షి, జహీరాబాద్ టౌన్ /తణుకు : సాయినాథుని దర్శనం చేసుకున్న 36 మంది తెలుగు భక్తులు కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలవుతోంది. అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. బస్సు తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్నాబాద్ పట్టణం దాటి 2 కిలోమీటర్లు వచ్చింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకోవాలి. అంతలోనే ఉపద్రవం..! బస్సు ఇంజన్‌లోనుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపి.. పక్కనే ఉన్న ధాబా, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్లను పిలిచి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగానే బస్సంతా పొగ నిండింది. బయట ఉన్నవారు ప్రయాణికులను అప్రమత్తం చేసి అద్దాలు పగలగొట్టారు.అరుపులు కేకలకు మేల్కొన్న వారు వీలున్న చోటినుంచి బయటకు దూకేశారు. కిటీకీలు బద్దలుకొట్టి బయటపడ్డారు. నాలుగేళ్లకే నూరేళ్లు.. బస్సులో వెనకసీట్లో నిద్రపోతున్న అచ్చుత రామ ప్రసాద్, వెంకటేశ్వరి దంపతులూ ప్రాణాలతో బయటపడేందుకు పరిగెత్తారు. వీరికి ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు విహాల్ (4), మరో రెండేళ్ల బాబు. నిద్రమత్తో, మరేమోగాని ఆందోళనలో రెండేళ్ల బాబును తీసుకుని ప్రసాద్ కిందికి దిగగా.. భార్య వెంకటేశ్వరి కూడా కిందకు దిగారు. భార్య పెద్ద కుమారుడిని తీసుకొస్తుందని ప్రసాద్ అనుకున్నారు. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోతోంది. అంతలోనే విహాన్ కనిపించటం లేదని కంగారు పడ్డ భార్యాభర్తలకు.. పక్కసీట్లో పడుకున్న విహాల్‌ను తీసుకురాలేదని అర్థమైంది. దీంతో విహాల్‌ను తీసుకొచ్చేందుకు ఇద్దరూ దగ్ధమవుతున్న బస్సులోకి ఎక్కారు. వెంటనే పక్కనున్న వారు వీళ్లను కిందకు లాక్కొచ్చారు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో వీరికీ గాయాలయ్యాయి. వెనకసీట్లో నిద్రిస్తున్న విహాల్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. వీరితోపాటు రాణి (50), వరుణ్ కుమార్(35), నాగలక్ష్మి(22) గాయపడ్డారు. ఉమ్నాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రభాకర్‌రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన రూ.45 వేలు, మరో ప్రయాణికుడి ల్యాప్‌టాప్ కాలిపోయాయి. అతివేగం వల్లే.. ‘డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. డ్రైవర్ దగ్గర్నుంచే మంటలొచ్చాయి’ అని ప్రభాకర్ రెడ్డి అనే ప్రయాణికుడొకరు చెప్పారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్ తరలించారు. తణుకులో విషాదం.. విహాన్ (4) తల్లిదండ్రులది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. రామప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం సాయంత్రం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుర్ఘటన జరిగింది. విహాన్ మృతితో తణుకులో, గచ్చిబౌలిలో వీరుంటున్న కాలనీలోనూ విషాదం నెలకొంది. జూలైలో నాలుగో పుట్టినరోజు జరుపుకున్న విహాన్.. ఈ ఏడాది నుంచే ప్లే స్కూలుకెళ్తున్నాడు. -
సజీవ దహనానికి యత్నం..
జిన్నారం: స్నేహితుల మధ్య వ్యాపారం వికటించింది.. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగి.. ఏకంగా కుటుంబాన్నే హతమార్చేందుకు ఒకరు యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. జగన్నాథం సుంకయ్య కుటుంబంతో కలసి బొల్లారంలోని బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. ఇతను పందులను పట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నాడు. కాగా, సుంకయ్య తన భార్య సునీత, కుమారులు వీరన్న(5), క్రిష్(3), డానియేల్(1)తో కలసి నిద్రిస్తుండగా.. గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. వారి కేకలు గమనించిన చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తీయగా.. అప్పటికే 60 శాతం కాలిపోవడంతో 108లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. స్నేహితుల మధ్య వ్యాపారమే కారణం స్నేహితుల మధ్య వ్యాపార లావాదేవీలే సజీవ దహనం యత్నానికి కారణంగా సుంకయ్య బంధువులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన స్నేహితుడుతో కలసి సుంకయ్య రెండేళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించాడు. ఒప్పందంలో భాగంగా సుమారు రూ.7 లక్షలతో సెప్టిక్‌ట్యాంక్ వాహనం కొనుగోలు చేశారు. ఏడాది పాటు వ్యాపారం బాగా సాగడంతో సుమారు రూ.3 లక్షల అప్పు తీర్చారు. తర్వాత వ్యాపారం దెబ్బతిని.. సెప్టిక్ ట్యాంక్ ఓనర్ వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. క్లీనర్‌కు సంబంధించిన ఫోన్ సుంకయ్య స్నేహితుడి వద్దే ఉంది. దీంతో అతను ఆ ఫోన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయమై సుంకయ్య, తన స్నేహితుడి మధ్య గొడవలు జరిగారుు. ఈ నేపథ్యంలో సుంకయ్యపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా, సుంకయ్య కుటుంబాన్ని హతమార్చేందుకు సదరు స్నేహితుడే పథకం పన్నినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై బాధితుడి వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం
అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఎగసిపడిన మంటలకు ఓ వృద్ధురాలు పూరి గుడిసెలో సజీవ దహనమైపోయింది. ఈఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామ శివారులో జరిగింది. దండె నీలమ్మ (75), ఆమె మనవడు దావీద్‌రాజు కుటుంబ సభ్యులతో కలసి పక్క పక్కనే రెండు గుడిసెల్లో నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలో మంటలు లేచాయి. దావీద్ రాజు ఎలాగోలా తన భార్య, పిల్లలతో బయటకు వచ్చేశాడు. కానీ పక్క గుడిసెలో నీలమ్మ ఉండిపోయింది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో ఆమెను రక్షించలేకపోయారు. దీంతో ఆమె ఆ మంటలకే ఆహుతైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
8 మంది సజీవదహనం
ప్యాకింగ్ కార్ఖానాలో అగ్నిప్రమాదం మరో ముగ్గురికి తీవ్రగాయాలు భివండీ, న్యూస్‌లైన్: తాలూకాలోని మాన్‌కోలి ప్రాంతంలో శ నివారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. గాయాలపాలైన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ముంబైలోని సైన్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక నిజాంపూర పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. రహనాల్ ప్రాంతంలో మడ్వీ కాంపౌండ్‌లో వస్త్ర తాన్లు ప్యాకింగ్ చేసే కార్ఖానా ఉంది. అందులో పెద్ద ఎత్తున చెక్క, కలప నిల్వచేసి ఉంచారు. శుక్రవారం రాత్రి కార్ఖానాలో 13 మంది కార్మికులు నిద్రపోయారు. సుమారు మూడు గంటల ప్రాంతంలో అందులో మంటలు చెలరేగాయి. అయితే అదేసమయంలో అటువైపుగా వచ్చిన గస్తీ పోలీసులు మంటలను గమనించి అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. కాని వారు వచ్చే సరికి మంటలు పూర్తిగా చుట్టుముట్టాయి. కార్ఖానా నుంచి బయటకు వెళ్లలేక ఎనిమిది అందులోనే చిక్కుకుని ప్రాణాలు వదిలారు. మృతులను అజయ్ రాజ్‌బహదూర్, రాజు చవాన్, గౌరి చవాన్, కాలియా హరిహరన్, మున్నీలాల్ యాదవ్, మురళి మోరియా, త్రివిక్రం, నీరజ్ కుర్మీ లుగా గుర్తించారు. కాగా గాయపడినవారిలో వినోద్ యాదవ్, బహదూర్ చవాన్, గిరి చవాన్ ఉన్నారు. వీరిలో వినోద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముంబైకి తరలించారు. మిగతావారు స్థానిక ఇందిరా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నిజాంపూర పోలీసులు కేసు నమోదుచేసి కార్ఖానా యజమానులైన మన్వర్ అలీ, జంగ్ బహదూర్ఖాన్, ఇస్తియాక్ అహ్మద్, శౌకత్ అలీలను అరెస్టు చేశారు. సజీవ దహనం విషయం తెలుసుకున్న జిల్లాధికారి అశ్విని జోషి సంఘటన స్థలాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శిథిలాలను తొలగించే పనులు పూర్తయిన తరువాత దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు. -
యువతి సజీవ దహనం
* పెదతాడేపల్లిలో ఘాతుకం * రంగంలోకి డాగ్ స్క్వాడ్ * అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానం తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద జాతీయ రహదారి వద్ద వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని యువతి సజీవ దహనమైంది. శరీరం పూర్తిగా కాలిపోగా.. కేవలం రెండు చేతులు మోచేయి వరకూ మాత్రమే మిగిలాయి. ఆ ఆనవాళ్లను బట్టి సజీవ దహనమైంది యువతి అని, వయసు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం మెడ భాగంలో బెల్టు బిగించి ఉన్నట్టు కనపడుతోంది. ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శుక్రవారం ఈ ఘటన వెలుగుచూడగా, సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు కొండలరావు, కరుటూరి రామారావు ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించిన బంటా కార్మికులు పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కన శుక్రవారం వేకువజామున వ్యవసాయ క్షేత్రాలలో కూలి పనులకు వెళుతున్న బంటా కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహం తాలూకా భాగాలను కుక్కలు ఎత్తుకెళుతుండటాన్ని వారు గమనించారు. కొంతదూరంలో పిచ్చిమొక్కల మధ్య నుంచి పొగ వస్తోంది, ఏమిటా అనే ఆసక్తితో అక్కడికి వెళ్లి చూసిన వారు నిర్ఘాంతపోయారు. అక్కడ ఓ మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టకుండా ఉంది. అంతకు ముందు కుక్క తీసుకెళుతున్న శరీర భాగం ఈ మృతదేహానిదే అని తెలిసి వారి గుండెలు గుభిల్లుమన్నాయి. దగ్గరకు వెళ్లి చూస్తే ఆ మృతదేహం యువతిదిగా గుర్తించారు. వెంటనే విషయాన్ని వీఆర్ఏ దృష్టికి తీసుకువెళ్లారు. వీఆర్ఏ నుంచి వీఆర్వో ద్వారా ఈ సమాచారం పోలీసులకు చేరింది. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. యువతా.. బాలికా.. దుండగులు కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. శరీర మొత్తంలో కేవలం రెండు చేతి భాగాలు అదీ మోచేయి పైకి మాత్రమే ఉన్నాయి. శరీరం దహనం కాగా మిగిలిన భాగాలను బట్టి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఒక నల్లని చెప్పు ఉంది. మరో పాత చెప్పు ఒకటి ఉంది. ఈ చెప్పు ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహం మెడకు బెల్టు లాంటిది బిగించి ఉంది. దీనిని బట్టి బెల్టుతో మెడకు బిగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ముఖానికి గుడ్డ ఒకటి అడ్డుగా కట్టే ఉంది. మృతదేహం కాలిఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న మొక్కలు నలిగినట్టు కనిపిస్తున్నాయి. మెడకు బెల్టు వేసి వీటి మధ్య నుంచి సజీవంగా కాని, లేదా హత్య చేసి కాని ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదే రహదారి తణుకు వైపు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఎడమ పక్క మద్యం బాటిళ్లు, వాటర్ప్యాకె ట్లు, వాటికి దగ్గరగా ఖాళీ ప్లాస్లిక్ సీసాలను పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి హత్యకు ముందు అనుమానితులు మద్యం తాగి ఉంటారని అంటున్నారు. దహనమైన మృతదేహం పక్కన తొమ్మిది నంబర్ కలిగిన చెప్పు లభించింది. దీనిని బట్టి హత్యకు పాల్పడిన వారు ఇక్కడ ఎవ్వరి సహాయం అయినా తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు ముందు యువతిలేదా బాలికైపై అత్యాచారం జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈఘాతుకానికి ఒడిగట్టింది స్థానికులా, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఆధార్ వేలిముద్రలు పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కనున్న జరిగిన ఘోర హత్యోదంతంలో ఆధార్ ఆధారం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఘటనలో పూర్తిగా యువతి కాలిపోగా చేతులు మాత్రం మిగిలి ఉండటంతో వాటి వేలిముద్రల ఆధారంగా మృతురాలిని గుర్తించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. ఘటనా స్తలంలో మృతదేహానికి పంచనామా అనంతరం, పోస్టుమార్టం శనివారం ఉదయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలియదిరిగిన స్నిపర్ డాగ్ ఏలూరు నుంచి ట్రైనర్ అంజనీకుమార్ పర్యవేక్షణలో స్నిపర్ డాగ్ డాన్‌తో ఘటనా స్థలంలో ఆధారాల కోసం కలియదిరిగింది. ఘటనా స్థలంలో లభించిన చెప్పు, కాలిన దేహం వాసన చూసిన డాగ్ అక్కడ నుంచి నేరుగా ఏలూరు వైపున ఉన్న పొలాలలోకి వెళ్లింది. అక్కడి పొలాలలో పడి ఉన్న ఎముక ముక్కను గుర్తించింది. తర్వాత వెనక్కి వచ్చింది. బైపాస్ రహదారి పక్కనుంచి గ్రామంలోకి విద్యుత్ సబ్‌స్టేషన్ వైపున ఉన్న రహదారి వైపు వెళ్లింది. మార్గ మధ్యమంలో స్మశానం దగ్గరలో ఉన్న మలుపు వద్ద పగిలి పడి ఉన్న మోటారు సైకిల్ హెడ్ లైట్ ముక్కల వద్ద కొంత సేపు ఆగింది. అక్కడి నుంచి పెదతాడేపల్లి గ్రామంలోకి వెళ్లే రోడ్డుపైకి ఎక్కింది. అక్కడ రోడ్డుపక్కగా ఉన్న ఓ టెక్నికల్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ ఒక గది వద్ద తచ్చాడింది. అక్కడ్నించి పక్కనే ఉన్న ఓ ప్రార్ధనా మందిరంలోకి ఒకసారి వెళ్లి బయటకు వచ్చి, తిరిగి దీని ఎదురుగా ఉన్న స్థలంలో తచ్చాడి. మళ్లీ అదే ప్రార్ధనా స్థలంలోకి వెళ్లింది. తిరిగి దీని పక్కగా వ్యవసాయ క్షేత్రాలవైపున ఉన్న చెరువు వద్దకు పరుగు తీసింది. ఈ చెరువు చుట్టూ తిరిగి అక్కడి నుంచి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఎక్కే ప్రాంతంలో ఆగింది. అక్కడ కాటన్ చున్నీ, లంగా బొందు ఉంది. అక్కడ డాగ్ ఆగింది. ఆ చున్నీని, లంగా బొందును తీసుకొచ్చి డాగ్‌కు వాసన చూపించాక, ఘటనా స్థలం సమీపంలో కుక్క తచ్చాడింది. దీంతో ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసున్నవారే అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. చెరువు గట్టు మీద కాని అత్యాచారానికి పాల్పడి, ఆనక అఘాయిత్యం చేసి, చేలలో నుంచి యువతిని లాక్కొచ్చి, పెట్రోలు కాని యాసిడ్ లాంటి పదార్దం పోసి కాని తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ జి.దేవ్‌కుమార్ చె ప్పారు. వీఆర్ఓ తల్లాప్రగడ శ్రీనివాసు ఫిర్యాదు మేరకు సంఘటనా స్తలాన్ని చూశామన్నారు. గుర్తుతెలియని యువతిగా భావించి, కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనలో ఇద్దరికంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ఎస్ఐ కొండలరావు, రూరల్ ఎస్ఐ రామారావులు దర్యాప్తులో ఉన్నారు . -
పెళ్లి బస్సులో మంటలు.. ఆరుగురి మృతి
భింద్: మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా లో శుక్రవారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. హైటెన్షన్ విద్యు త్ తీగ బస్సుపై పడడంతో మంటలు చెలరేగాయి. బరోవాలో పెళ్లికి హాజరైన 60 మందితో వెళ్తున్న ఈ బస్సు భింద్ పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైంది. -
అగ్నిప్రమాదంలో ఒకరి సజీవదహనం
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ :విద్యుత్ షార్టుసర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం కాగా, ఒకరు సజీవదహనమైన సంఘటన మండలకేంద్రంలోని కోనేటి చెరువుకట్ల ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.2.25 లక్షల నగదు సహా ఆరు లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఎస్ఐ పి.ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోనేటి చెరువు కట్ట వద్ద తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన సుమారు 11 కుటుంబాలు ఐదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. వీరంతా స్థానిక స్టోన్‌క్రషర్ క్వారీలో పనిచేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పలు కుటుంబాల వారితోపాటు పెరుమాళ్ల సేలా అనే మహిళ కూడా గుంటూరులో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. సేలా భర్త కన్నా ముదిరాజ్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ముదిరాజ్ ఉన్న గుడిసెకు నిప్పంటుకుంది. మిగిలిన పది గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముదిరాజ్ సజీవదహనమయ్యాడు. స్థానికుల సమాచారంతో సత్తెనపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గుడిసెల్లో ఐదు కేజీల మూడు గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని భావిస్తున్నారు. పండగ సందర్భంగా క్వారీ యజమాని నుంచి అడ్వాన్సుగా తీసుకున్న రూ.2.25 లక్షల నగదు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. మృతుడు ముదిరాజ్ భార్య సేలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, నరసరావుపేట రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు, ఎస్ఐ పి.ఉదయబాబు పరిశీలించారు. బాధితులకు పరామర్శ.. కోనేటి చెరువు వద్ద జరిగిన అగ్ని ప్రమాద బాధితులను వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల నగదు. మృతుడి కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.