
సాక్షి, వరంగల్ : జిల్లాలోని దామెర మండలం ముస్తాలపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని చేతులు కట్టేసి తల్లిదండ్రులే సజీవ దహనం చేశారు. కొడారి ప్రభాకర్, వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లి అయింది. కొడుకు, కూతురు ఉన్నారు. గొడవల కారణంగా కొన్నేళ్ల క్రితమే రజిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గుమాస్తాగా పనిచేస్తున్న మహేష్.. మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి చిత్రహింసలు చేయడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ క్రమంలోనే మహేష్ చేతులు కట్టేసి కిరోసిన్ పోసి తగులపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment