అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఎగసిపడిన మంటలకు ఓ వృద్ధురాలు పూరి గుడిసెలో సజీవ దహనమైపోయింది.
అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఎగసిపడిన మంటలకు ఓ వృద్ధురాలు పూరి గుడిసెలో సజీవ దహనమైపోయింది. ఈఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామ శివారులో జరిగింది. దండె నీలమ్మ (75), ఆమె మనవడు దావీద్‌రాజు కుటుంబ సభ్యులతో కలసి పక్క పక్కనే రెండు గుడిసెల్లో నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలో మంటలు లేచాయి.
దావీద్ రాజు ఎలాగోలా తన భార్య, పిల్లలతో బయటకు వచ్చేశాడు. కానీ పక్క గుడిసెలో నీలమ్మ ఉండిపోయింది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో ఆమెను రక్షించలేకపోయారు. దీంతో ఆమె ఆ మంటలకే ఆహుతైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.