తల్లిదండ్రుల కళ్లెదుటే అత్తింటివారి అఘాయిత్యం
భర్త, అత్తామామ, బావ, తోటికోడలే నేరస్తులు
పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా
పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ తీర్పు
ఓదెల(పెద్దపల్లి): అదనంగా రూ.5 లక్షల కట్నం తేవడం లేదనే ఆగ్రహంతో భర్త, బావ, తోటికోడలు, అత్తామామ కలిసి వివాహిత యాట లావణ్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్లు నేరం రుజు వు కావడంతో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ శనివారం తీర్పు వెలువరించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీ పీ గజ్జి కృష్ణ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామానికి చెందిన యాట కుమారస్వామి పెద్దకూతురు యాట లావణ్యను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామానికి చెందిన వీర్ల రవీందర్‌కు 2013లో ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10లక్షల కట్నం, పది తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంఛనాలు అప్పగించారు.
మూడు నెలల తర్వాత అదన ంగా రూ.ఐదు లక్షల కట్నం కావాలని భర్త రవీందర్, అత్తామామలు రాజమ్మ, కొమురయ్య, బావ కు మారస్వామి, తోటికోడలు భారతి కలిసి లావణ్య ను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభిమచారు. ఈక్రమంలో 2014 మే 16వ తేదీన లా వణ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలు తల్లితండ్రులతో కలిసి కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేశారు. లావణ్యను ఇకనుంచి బాగా చూసుకుంటామని చెప్పడంతో తల్లితండ్రులు ఆమెను అత్తగారింటికి పంపారు. కొద్దికాలం త ర్వాత తనకు విడాకులు కావాలని భర్త కోర్టుకు వె ళ్లాడు.
ఈక్రమంలోనే 25 సెప్టెంబర్ 2014న అదనపు కట్నం తేవాలని ఐదుగురు కలిసి లావణ్యను కొట్టారు. ఈవిషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తన తల్లిదండ్రుకు చెప్పింది. వారు వెంటనే కొలనూరు గ్రామానికి చెరుకున్నారు. ఇక్కడుంటే లావణ్య ప్రాణానికి ముప్పు ఉంటుందని భావించి, త మతో రావాలని కూతురుకు తల్లిదండ్రులు సూచించారు. లావణ్య బట్టలు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోకు వెళ్లగానే భర్త, అత్తామామ, బావ, తోటికోడలు కలిసి ఇంట్లోకి వెళ్లి లావణ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఈ అఘాయిత్యం జరిగింది.
అయితే, తీవ్రంగా గాయపడిన లావణ్యను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ 28 సెప్టెంబర్ 2014న మృతిచెందింది. మృతురాలి లావణ్య తండ్రి యాట కుమారస్వామి ఫిర్యా దు మేరకు అప్పటి ఏసీపీ వేణుగోపాల్‌రావు కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాహలు చేశా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, డీసీపీ చేతన, ఏసీ పీ కృష్ణ పర్యవేక్షణలో కోర్టులో సాక్షలను ప్రవేశ పె ట్టారు. నేరం రుజువు కావడంతో భర్త, అత్తామామ, బావ, తోటికోడలుకు పదేళ్ల కారగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పు మొత్తం రూ.30వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సాక్షులను ప్రవేశపె ట్టడానికి సహకరించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీని వాస్‌ను రాంగుండం సీపీ శ్రీనివాస్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment