జిన్నారం: స్నేహితుల మధ్య వ్యాపారం వికటించింది.. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగి.. ఏకంగా కుటుంబాన్నే హతమార్చేందుకు ఒకరు యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. జగన్నాథం సుంకయ్య కుటుంబంతో కలసి బొల్లారంలోని బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. ఇతను పందులను పట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నాడు. కాగా, సుంకయ్య తన భార్య సునీత, కుమారులు వీరన్న(5), క్రిష్(3), డానియేల్(1)తో కలసి నిద్రిస్తుండగా.. గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
వారి కేకలు గమనించిన చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తీయగా.. అప్పటికే 60 శాతం కాలిపోవడంతో 108లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
స్నేహితుల మధ్య వ్యాపారమే కారణం
స్నేహితుల మధ్య వ్యాపార లావాదేవీలే సజీవ దహనం యత్నానికి కారణంగా సుంకయ్య బంధువులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన స్నేహితుడుతో కలసి సుంకయ్య రెండేళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించాడు. ఒప్పందంలో భాగంగా సుమారు రూ.7 లక్షలతో సెప్టిక్‌ట్యాంక్ వాహనం కొనుగోలు చేశారు. ఏడాది పాటు వ్యాపారం బాగా సాగడంతో సుమారు రూ.3 లక్షల అప్పు తీర్చారు. తర్వాత వ్యాపారం దెబ్బతిని.. సెప్టిక్ ట్యాంక్ ఓనర్ వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. క్లీనర్‌కు సంబంధించిన ఫోన్ సుంకయ్య స్నేహితుడి వద్దే ఉంది.
దీంతో అతను ఆ ఫోన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయమై సుంకయ్య, తన స్నేహితుడి మధ్య గొడవలు జరిగారుు. ఈ నేపథ్యంలో సుంకయ్యపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా, సుంకయ్య కుటుంబాన్ని హతమార్చేందుకు సదరు స్నేహితుడే పథకం పన్నినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై బాధితుడి వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
సజీవ దహనానికి యత్నం..
Published Fri, Aug 5 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement