భువనేశ్వర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే గ్యాస్ ట్యాంకర్ లోని వాయివులు పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో కిలోమీటరు మేర నివాసం ఉంటున్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అనంతరం గ్యాస్ ట్యాంకర్ను రహదారిపై నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.