గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన ప్రజలు | gas tanker turns turtle in east godhavari district | Sakshi
Sakshi News home page

గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన ప్రజలు

Published Sun, Sep 25 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.

గొల్లప్రోలు(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. గ్యాస్ లీక్ అవుతుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.

ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి సమీపంలోని గుమ్మళ్లదొడ్డి హెచ్‌పీ గ్యాస్ ఫిల్లింగ్‌స్టేషన్‌కు గ్యాస్ తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగనట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement