
వేలూరు: గ్యాస్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మురుగేషన్(60). ఇతని భార్య కోకిల. దంపతులు ఇద్దరు, వీరి బంధువులు రాజలింగం, ప్రేమ్‌తో కలిసి సేలం జిల్లా వెంకటగిరి ప్రాంతంలోని దేవి కరుమారియమ్మన్ ఆలయ దర్శనానికి వెళ్లారు.
దర్శనానంతరం శనివారం ఉదయం సొంత గ్రామానికి కారులో బయలు దేరారు. ఆంబూరు సమీపంలోని చిన్న కామేశ్వరం వద్ద జాతీయ రహదారిలో కారు వెళుతుండగా అదుపుతప్పి ముందు వెళుతున్న గ్యాస్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో మురుగేషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రాజలింగంను సీఎంసీ ఆస్పత్రికి, ప్రేమ్, కోకిలను ఆంబూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రేమ్ మృతిచెందాడు. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment