
అబుజా: ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది.
ట్యాంకర్‌లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment